RGV On Tickets Issue: ఏపీ టికెట్ల వివాదంపై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు... ఒకరిద్దరు హీరోలను తొక్కేయడానికో ఏమో...!... ధరలు తగ్గింపుపై లాజిక్ ఏమిటని ప్రశ్న
ఏపీ టికెట్ల వివాదంపై దర్శకుడు ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకరిద్దరు హీరోలను తొక్కేయడానికి ఇలా చేస్తున్నారా లేదా అనేది తనకు తెలియదన్నారు. హీరోలను చూసే ప్రేక్షకులు సినిమాలకు వస్తున్నారన్నారు.
ఏపీలో సినిమా టికెట్ల వివాదంపై ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఒక వస్తువును తయారు చేసేవాళ్ల ధర నిర్ణయించే అధికారం లేదా అని ప్రశ్నించారు. సినిమా మేకింగ్‌లో 70 శాతం హీరోలకు రెమ్యునిరేషన్ అని మంత్రులు పేర్నినాని, అనిల్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను ఆర్జీవీ తప్పుబట్టారు. సినిమా మేకింగ్ ఖర్చుల్లో రెమ్యునిరేషన్ కూడా భాగమేనన్నారు. ఎవరూ నష్టపోవాలని భారీ బడ్జెట్ సినిమాలు తీయరన్నారు. ప్రేక్షకులు హీరోను చూసే సినిమాకు వస్తారని, హీరోకు ఎక్కువ డబ్బు ఇచ్చేది అందుకేనన్నారు.
Also Read: టిక్కెట్ రేట్ల తగ్గింపును విమర్శించేవారు శత్రువులే.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు !
Me talking about AP Ticket Rates ..This attitude of Government will destroy the advancement of the Film industry ..See Link https://t.co/T9Y6eGKPJp
— Ram Gopal Varma (@RGVzoomin) January 2, 2022
'గంజి తాగితే ఆకలి తీరుతుంది, పూరింట్లో ఉంటే చాలు అనుకుంటే ఇన్ని డెవలప్ మెంట్స్ ఎందుకు వస్తాయి. అంటే మనం మళ్లీ ఆదిమానవుడి కాలానికి వెళ్లాలి. తెలుగు సినిమా మార్కెట్ రూ.100 కోట్లు ఉందనకుంటున్న రోజుల్లో డైరెక్టర్ రాజమౌళి, నిర్మాత శోభు యార్లగడ్డ రూ. 200 కోట్ల బడ్జెట్‌తో పాన్ ఇండియా సినిమా తీశారు. తమ ప్రొడక్ట్‌పై వాళ్లకు ఉన్న నమ్మకం అది. సూపర్ క్వాలిటీతో సినిమా తీస్తే మార్కెట్‌ను అధిగమించవచ్చని సినిమాలు చేస్తుంటారు. ఒకవేళ సినిమాలు పరాజయం పొందే అవకాశాలూ ఉండొచ్చు. ఒకవేళ అలా జరిగితే రాజమౌళి, శోభు యార్లగడ్డకే నష్టం. లాభం వస్తే మొత్తం సినిమా ఇండస్ట్రీకే వస్తుంది. తెలుగు ఇండస్ట్రీని వరల్డ్ మ్యాప్ పై పెట్టిన సినిమా ‘బాహుబలి’. దాన్ని ఉద్దేశంగా తీసుకుని ‘బాహుబలి’కి మించి ‘ఆర్‌ఆర్‌ఆర్’ తీయొచ్చు. ఇలాంటి పెద్ద ప్రాజెక్టులకు, ఇతర చిన్న సినిమాలకు ఒకే టికెట్ ధర అనడంలో అర్థంలేదు’’.' అని ఆర్జీవీ అన్నారు.
Also Read: ఆర్ఆర్ఆర్‌కూ ఏపీలో అవే టిక్కెట్ ధరలు.. ఏమీ తేల్చకుండానే కమిటీ తొలి భేటీ వాయిదా !
రేకుల షెడ్డుకు మల్టీప్లెక్స్ కు ఒకటే టికెట్ సరికాదు
రేకుల షెడ్డుకు మల్టీప్లెక్స్‌లకు ఒకటే టికెట్ అంటే సరికాదని రామ్ గోపాల్ వర్మ అన్నారు. ఏదో ఒకరు ఇద్దరు హీరోలను తొక్కేయడానికి చేస్తున్నారా? లేదా అనేది తనకు తెలియదన్నారు. ఇప్పటికే పెద్ద హీరోలు చాలా సంపన్నులు. రెమ్యునరేషన్ లో రూ.10 కోట్లు తగ్గితే హీరోలకు పెద్దగా పోయేది ఏమిలేదన్నారు. కానీ ఇద్దరు హీరోల కోసం తీసుకుంటున్న నిర్ణయాలతో చిన్న హీరోలు దెబ్బతింటారని ఆర్జీవీ అన్నారు. అసలు ఏపీ ప్రభుత్వం ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది, టికెట్ల ధరలు తగ్గింపు వెనుక ఏదైనా బలమైన కారణం ఉందా క్లియర్ కట్‌గా చెప్పాలని డిమాండ్ చేశారు. సినిమా టికెట్ ధరను నియంత్రించినట్లు ఫైవ్ స్టార్ హోటల్ పుడ్ ధరలు, బ్రాండెడ్ షర్ట్స్‌ల ధరలు ఎందుకు ఎక్కువ ఉన్నాయి, వాటిని ఎందుకు నియత్రించడంలేదని ప్రశ్నించారు.