Anushka: ఆ నిర్మాతకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన అనుష్క!
అరుదుగా అనుష్క సోషల్ మీడియాలో పోస్టులు చేస్తారు. ఈ రోజు ఓ నిర్మాతకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్ చేశారు.
అనుష్క అజాత శత్రువు. ఆమె ఎవరి గురించి చెడుగా చెప్పరు. ఆ మాటకు వస్తే... ఆమె చాలా తక్కువ మాట్లాడతారు. సోషల్ మీడియాకు అయితే చాలా దూరంగా ఉంటారు. అప్పుడప్పుడూ మాత్రమే, అరుదుగా పోస్టులు చేస్తారు. లేటెస్టుగా ఓ నిర్మాతకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఓ పోస్ట్ చేశారు. ఈ రోజు యువి క్రియేషన్స్ అధినేతలతో ఒకరైన ప్రమోద్ పుట్టినరోజు. ఆయనతో దిగిన సెల్ఫీని షేర్ చేసిన అనుష్క... "హ్యాపీ హ్యాపీ బర్త్ డే ప్రమోద్ గారు. ఎల్లప్పుడూ... అన్నిటిలో మీకు బెస్ట్ జరగాలని కోరుకుంటున్నాను" అని పేర్కొన్నారు.
View this post on Instagram
యువి క్రియేషన్స్ సంస్థ నిర్మించిన తొలి సినిమా 'మిర్చి'లో అనుష్కే కథానాయిక. ఆ సినిమా తర్వాత అనుష్క ప్రధాన పాత్రలో ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా 'భాగమతి'ని యువి క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. ఇప్పుడు హ్యాట్రిక్ సినిమా నిర్మిస్తోంది.
Also Read: Tollywood 2021 Review: కాలర్ ఎగరేసిన కమర్షియల్ సినిమా... దుమ్ము దులిపేసిన స్టార్స్!
అనుష్క, నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రల్లో యువి క్రియేషన్స్ సంస్థ ఓ సినిమా నిర్మిస్తోంది. దీనికి మహేష్ బాబు పచ్చిగోళ్ల దర్శకుడు. అనుష్కకు ఇది 48వ సినిమా కాగా... నవీన్ పోలిశెట్టికి 3వ సినిమా.
Also Read: ప్రేమకథ ప్లేస్‌లో 'ఆర్ఆర్ఆర్' ఎలా వచ్చింది? రాజమౌళి వైఫ్ చేసిందేమిటి?
Also Read: సీజ్ చేసిన సినిమా థియేటర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. మంత్రి వెల్లడి
Also Read: నానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన తమన్... ఇద్దరి మధ్య గొడవ ఏంటి!?
Also Read: యువరానర్... వీళ్లే ఈ ఏడాది ఆన్-స్క్రీన్ లాయర్స్!
Also Read: Telugu Hero Vs Tamil Hero 2021: సామాన్యుడికి దూరంగా తెలుగు హీరో!? మనలో ఒకడిగా కనిపించలేరా!?
Also Read: Item Songs of the Year 2021: సెక్సీ లేడీస్... ఐటమ్ సాంగ్స్ అదుర్స్!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి.