RRR: 'ఆర్ఆర్ఆర్' సినిమా చూసిన అనిల్ కపూర్, అనుపమ్ ఖేర్ - నచ్చిందా నచ్చలేదా?
'ఆర్ఆర్ఆర్' సినిమాను కాస్త ఆలస్యంగా చూశారు సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్. తన స్నేహితుడు, నటుడు అనిల్ కపూర్ తో కలిసి 'ఆర్ఆర్ఆర్' సినిమా చూడడానికి ముంబైలో ఓ థియేటర్ కు వెళ్లారు అనుపమ్ ఖేర్.
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ల పెర్ఫార్మన్స్ కి అభిమానులు ఫిదా అయిపోయారు. నేషనల్ వైడ్ గా ఈ సినిమా సత్తా చాటింది. ఓవర్సీస్ లో కూడా భారీ కలెక్షన్స్ ను నమోదు చేసింది. ఈ సినిమా చూసిన సినీ సెలబ్రిటీలు, రాజకీయనాయకులు సోషల్ మీడియా వేదికగా సినిమాపై ప్రశంసలు కురిపించారు.
'కేజీఎఫ్2' సినిమా విడుదలైనా ఇప్పటికీ చాలా థియేటర్లలో 'ఆర్ఆర్ఆర్' సినిమా ఆడుతోంది. ఈ సినిమాను కాస్త ఆలస్యంగా చూశారు సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్. తన స్నేహితుడు, నటుడు అనిల్ కపూర్ తో కలిసి 'ఆర్ఆర్ఆర్' సినిమా చూడడానికి ముంబైలో ఓ థియేటర్ కు వెళ్లారు అనుపమ్ ఖేర్. అక్కడ తీసుకున్న ఓ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు. అలానే ఈ ఇద్దరు సీనియర్ నటులు 'ఆర్ఆర్ఆర్' సినిమా గురించి గొప్పగా మాట్లాడారు.
ఈ మధ్యకాలంలో వచ్చిన మోస్ట్ ఎంటర్‌టైనింగ్ సినిమా 'ఆర్ఆర్ఆర్' అని.. అందరికీ ఈ సినిమా పెద్ద ట్రీట్ అని, వరల్డ్ క్లాస్ సినిమా అంటూ అనిల్ కపూర్ ట్విట్టర్ లో రాసుకొచ్చారు. సినిమాలో కంటెంట్, పెర్ఫార్మన్స్, యాక్షన్, సాంగ్స్, డాన్స్ ఓ రేంజ్ లో ఉన్నాయని.. రామ్ చరణ్, ఎన్టీఆర్ తమ ఎలెక్ట్రిఫయింగ్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నారని.. క్లైమాక్స్ అద్భుతంగా ఉందని అనుపమ్ ఖేర్ రాసుకొచ్చారు. మొత్తానికి ఈ ఇద్దరు నటులకు 'ఆర్ఆర్ఆర్' బాగా నచ్చేసింది.
ఇక వారి సినిమాల విషయానికొస్తే.. అనిల్ కపూర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాలు చేస్తున్నారు. అనుపమ్ ఖేర్ చివరిగా 'ది కశ్మీర్ ఫైల్స్' అనే సినిమాలో నటించారు. ఈ సినిమాలో ఆయన నటనకు ప్రశంసలు దక్కాయి. సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది.
Also Read: పవన్ సినిమాలో నోరా ఫతేహి క్యారెక్టర్ ఇదే!
Also Read: హాస్పిటల్ లో మిథున్ చక్రవర్తి - వైరల్ అవుతోన్న ఫొటో
Went to the theatre after many many years with my dearest and humorous friend @AnilKapoor to watch @ssrajamouli #RRR. This hilarious conversation is before the film. Have fun & Enjoy. 😎🎬😎🤣 #Friends #JoyOfCinema pic.twitter.com/ulOONGURAT
— Anupam Kher (@AnupamPKher) May 2, 2022
Watched @ssrajamouli’s #RRR. What an amazingly entertaining movie. High on content, performances, songs, dances and action sequences! Both @AlwaysRamCharan & @tarak9999 #JrNTR are ELECTRIFYING. Loved the climax. Congratulations to whole team and @jayantilalgada ji! Jai Ho!😍👏🔥 pic.twitter.com/PaEdT8UYkN
— Anupam Kher (@AnupamPKher) May 2, 2022
Saw #RRR, one of the most entertaining & phenomenal films of recent times. Truly a treat for all senses! World class cinema! @ssrajamouli @AlwaysRamCharan @ajaydevgn @aliaa08 @tarak9999 @DVVMovies @RRRMovie @jayantilalgada @PenMovies @RRRMovie
— Anil Kapoor (@AnilKapoor) May 2, 2022