By: ABP Desam | Updated at : 03 May 2022 10:36 AM (IST)
హాస్పిటల్ లో మిథున్ చక్రవర్తి
ప్రముఖ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి హాస్పిటల్ పాలయ్యారు. బెంగుళూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో అనారోగ్యం కారణంగా ఆయన్ను జాయిన్ చేశారు. బీజేపీ నాయకుడు అనుపమ్ హజ్రా ఆయన త్వరగా కోలుకోవాలని ఆసిస్తూ హాస్పిటల్ లోని ఆయన ఫొటోలను ట్విట్టర్ లో షేర్ చేశారు. దీంతో హాస్పిటల్ బెడ్ పై పడుకొని ఉన్న మిథున్ చక్రవర్తి ఫొటోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.
సడెన్ గా మిథున్ చక్రవర్తి హాస్పిటల్ పాలవ్వడంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. దీంతో ఆయన రెండో కుమారుడు మిమో చక్రవర్తి ఆయన ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చారు. ప్రముఖ మీడియా పోర్టల్ తో మాట్లాడుతూ.. ప్రస్తుతం మిథున్ చక్రవర్తి ఆరోగ్యంగానే ఉన్నారని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.
ఆయనకు కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని.. అందుకే ఏప్రిల్ 30న హాస్పిటల్ లో జాయిన్ చేసినట్లు చెప్పారు. ఆయనకు ఆపరేషన్ జరిగిందని.. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి ఇప్పుడు ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారని మిమో చక్రవర్తి చెప్పుకొచ్చాడు. దీంతో ఫ్యాన్స్ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. 1980, 90లలో మిథున్ చక్రవర్తి హీరోగా బెంగాలీ, హిందీ సినిమాలలో తన సత్తా చాటారు. ఆయన చివరిగా 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమాలో కీలకపాత్ర పోషించారు.
Also Read: రాజమౌళితో సినిమా చేసిన హీరోలకు ఫ్లాప్స్ తప్పవా? అసలు కారణాలు ఏంటి??
Also Read: కొరటాల శివకు కండిషన్లు పెట్టిన ఎన్టీఆర్?
Get well soon Mithun Da ❤️
— Dr. Anupam Hazra 🇮🇳 (@tweetanupam) April 30, 2022
তোমার দ্রুত আরোগ্য কামনা করি মিঠুন দা ❤️ pic.twitter.com/yM5N24mxFf
Mahesh Babu: మహేష్ బాబుతో 'విక్రమ్' డైరెక్టర్ మీటింగ్ - విషయమేంటో?
Jabardasth: స్టార్ కమెడియన్స్ 'జబర్దస్త్'ను వదిలేశారా?
Shekar Movie : జీవిత, రాజశేఖర్ కు భారీ షాక్, శేఖర్ సినిమా ప్రదర్శన నిలిపివేత
BuchiBabu: బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ఎన్టీఆర్ ని నమ్ముకొని తప్పు చేస్తున్నాడా?
Bigg Boss Non-Stop Winner Prize Money: బిగ్ బాస్ ఓటీటీ విన్నర్ - ప్రైజ్ మనీ ఎంత గెలుచుకుందంటే?
Weather Updates: చురుకుగా కదులుతున్న నైరుతి రుతుపవనాలు - ఏపీ, తెలంగాణలో నేడు ఆ జిల్లాల్లో మోస్తరు వర్షాలు
Rajanna Sircilla: కలెక్టర్ పేరుతో ఫేక్ వాట్సాప్ అకౌంట్, డబ్బులు కావాలని అధికారులకు మెసేజ్లు - ట్విస్ట్ ఏంటంటే !
CM KCR : బీజేపీని ప్రశ్నిస్తే దేశద్రోహులు అనే ముద్ర, కేంద్రంపై సీఎం కేసీఆర్ ఫైర్
TSRTC Offer: పదో తరగతి విద్యార్థులకు ఆర్టీసీ గుడ్ న్యూస్! వీరికి ఫ్రీ రైడ్ - రోజుకు ఎన్నిసార్లంటే