BheemlaNayak: ఆ హిట్ సాంగ్ ను డిలీట్ చేస్తున్నారా?
రామజోగయ్య శాస్త్రి రాసిన 'అంత ఇష్టమేందయ్యా' అనే పాటను 'భీమ్లానాయక్' సినిమాలో నుంచి తీసేశారట.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన 'భీమ్లానాయక్'(BheemlaNayak) సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఏపీలో వంద శాతం ఆక్యుపెన్సీకి పర్మిషన్ వస్తే ఫిబ్రవరి 25న సినిమా రిలీజ్ కావడం ఖాయమంటున్నారు. ప్రస్తుతం సినిమా ఫైనల్ షూట్ పార్ట్ ను చిత్రీకరిస్తున్నారు. ఓ పాట షూటింగ్ జరుగుతోంది. నిజానికి ఇప్పుడు చిత్రీకరిస్తున్న పాటను జస్ట్ టైటిల్స్, రోలింగ్ టైటిల్స్ మీద వేద్దామని అనుకున్నారట. కానీ ఇప్పుడు సినిమా మధ్యలో ప్లేస్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
దీనికోసం సినిమాలో ఓ పాటను డిలీట్ చేసినట్లు టాక్. రామజోగయ్య శాస్త్రి రాసిన 'అంత ఇష్టమేందయ్యా'(Antha Ishtam Endayya) అనే పాటను సినిమాలో నుంచి తీసేశారట. ఫ్లోలో ఈ సాంగ్ సెట్ కావడం లేదని దర్శకనిర్మాతలు ఫీల్ అవుతున్నారని సమాచారం. సినిమా మొత్తం మాస్ ఎలిమెంట్స్ తో సాగిపోతున్న సమయంలో ఈ పాట వస్తుందట. అలాంటి సమయంలో క్లాస్ సాంగ్ ఫిట్ అవ్వదని యూనిట్ భావిస్తోంది. దీనికి బదులుగా వేర్ చోట ఇప్పుడు చిత్రీకరిస్తున్న హీరో సెంట్రిక్ సాంగ్ వస్తుందట.
పక్కా మాస్ ఎమోషనల్ కథగా దీన్ని చిత్రీకరిస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన 'అయ్యప్పనుమ్ కోశియుమ్' సినిమాకి రీమేక్ గా 'భీమ్లానాయక్' సినిమాను తెరకెక్కిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. ఇప్పటివరకు విడుదలైన ఈ సినిమా పాటలు యూట్యూబ్ లో ట్రెండ్ అయ్యాయి. త్వరలోనే ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయనున్నారు.
View this post on Instagram