అన్వేషించండి

Mahesh Babu - Sandeep Reddy Vanga: మహేష్‌తో ఎందుకు మిస్సింగ్? - నెక్స్ట్ రామ్ చరణ్‌తో కూడా!

తెలుగులో 'అర్జున్ రెడ్డి', హిందీలో 'కబీర్ సింగ్' సినిమాలతో విజయాలు అందుకున్న సందీప్ రెడ్డి వంగా... డిసెంబర్ 1న 'యానిమల్'తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమా విడుదల సందర్భంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. 

Animal movie director Sandeep Reddy Vanga interview: సందీప్ రెడ్డి వంగా... ఈ పేరు ఒక సంచలనం! విజయ్ దేవరకొండ స్టార్ హీరో కావడం వెనుక, యువతలో ఆయనకు విపరీతమైన ఫాలోయింగ్ రావడం వెనుక కారణం సందీప్ రెడ్డి! ఆయన దర్శకత్వం వహించిన 'అర్జున్ రెడ్డి' సినిమా! తొలి సినిమాతో సందీప్ రెడ్డి వంగా సంచలనాలు సృష్టించారు. 'అర్జున్ రెడ్డి' తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా ఓ సినిమా చేసే అవకాశం ఆయనకు వచ్చిందని టాలీవుడ్ ఫిలిం నగర్ వర్గాలు తెలిపాయి. అయితే..‌. ఆ సినిమా ఇప్పటికీ పట్టాలు ఎక్కలేదు. మహేష్ బాబుతో సినిమా ఎందుకు మిస్ అయ్యిందో లేదో చెప్పారు సందీప్ రెడ్డి వంగా.

తెలుగులో 'అర్జున్ రెడ్డి' సినిమాతో భారీ విజయం అందుకున్న సందీప్ రెడ్డి వంగా... ఆ తర్వాత అదే కథను హిందీలో 'కబీర్ సింగ్' పేరుతో రీమేక్ చేశారు. షాహిద్ కపూర్, కియారా అడ్వాణీ జంటగా నటించిన చిత్రమది. అక్కడ కూడా భారీ వసూళ్లు సాధించింది. 'కబీర్ సింగ్' తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన సినిమా 'యానిమల్'. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మికా మందన్న జంటగా నటించిన ఈ సినిమా డిసెంబర్ ఒకటిన విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ గురించి దర్శకుడు మాట్లాడారు.

మహేష్ బాబుకు కథ నచ్చింది కానీ...
''మహేష్ బాబు గారికి నేను ఒక కథ చెప్పాను. అది ఆయనకు నచ్చింది. అయితే వేరే కమిట్మెంట్స్ ఉండడం వలన ఆ సినిమా ముందుకు వెళ్లలేదు. మహేష్ బాబు గారితో మాత్రమే కాదు రామ్ చరణ్ గారితోనూ, మిగతా హీరోలతోనూ నాకు సినిమాలు చేయాలని ఉంది'' అని సందీప్ రెడ్డి వంగా తెలిపారు.

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply

'యానిమల్' తర్వాత ప్రభాస్ 'స్పిరిట్'!
'యానిమల్' తర్వాత సందీప్ రెడ్డి వంగా తెలుగులోని అగ్ర హీరోలలో ఒకరైన, దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న ప్రభాస్ కథానాయకుడిగా భారీ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. 'యానిమల్' నిర్మించిన టి సిరీస్ భూషణ్ కుమార్ నిర్మాణ భాగస్వామ్యంలో 'స్పిరిట్' సినిమా చేస్తారు. అది వచ్చే ఏడాది పట్టాలు ఎక్కుతుంది. 

Also Read: సుకుమార్ రేర్ రికార్డ్ - తెలుగులో రాజమౌళి తర్వాత లెక్కల మాస్టారే!

రణబీర్ కపూర్, రష్మిక మందన్నాతో కలిసి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఇటీవల గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న 'అన్ స్టాపబుల్' కార్యక్రమానికి విచ్చేసిన సంగతి తెలిసిందే. ఆ షోలో 'స్పిరిట్' సినిమాలో ఏదైనా ఒక చిన్న క్యారెక్టర్ ఉంటే ప్రభాస్ అన్నతో కలిసి నటించడానికి తాను రెడీ అని రణబీర్ కపూర్ చెప్పారు.

Also Read: త్రివిక్రమ్ సెలక్షన్ మీద విమర్శలు, సందేహాలు - ఏంటిది ఆదికేశవ?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
BSNL Best Prepaid Plan: జియో, ఎయిర్‌టెల్‌ను వణికించే ప్లాన్ దించిన బీఎస్ఎన్ఎల్ - రోజుకు 3 జీబీ అంత తక్కువకా?
జియో, ఎయిర్‌టెల్‌ను వణికించే ప్లాన్ దించిన బీఎస్ఎన్ఎల్ - రోజుకు 3 జీబీ అంత తక్కువకా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
BSNL Best Prepaid Plan: జియో, ఎయిర్‌టెల్‌ను వణికించే ప్లాన్ దించిన బీఎస్ఎన్ఎల్ - రోజుకు 3 జీబీ అంత తక్కువకా?
జియో, ఎయిర్‌టెల్‌ను వణికించే ప్లాన్ దించిన బీఎస్ఎన్ఎల్ - రోజుకు 3 జీబీ అంత తక్కువకా?
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
Embed widget