అన్వేషించండి

Trivikram - Aadikeshava Result: త్రివిక్రమ్ సెలక్షన్ మీద విమర్శలు, సందేహాలు - ఏంటిది ఆదికేశవ?

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన 'ఆదికేశవ' ఫ్లాప్ తర్వాత గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టోరీ సెలక్షన్ మీద విమర్శలు, సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

Aadikeshava flop or hit: 'ఆదికేశవ' హిట్టా? ఫ్లాపా? అని క్వశ్చన్ వేస్తే... సినిమా చూసిన మెజారిటీ ప్రేక్షకుల నుంచి వచ్చే సమాధానం ఒక్కటే! అందులో మరో సందేహం అవసరం లేదు. వైష్ణవ్ తేజ్ ఊర మాస్ సినిమాకు పెయిడ్ ప్రీమియర్ షోస్ దగ్గర నుంచి ఫ్లాప్ టాక్ వచ్చింది. రివ్యూలు కూడా ఏమంత గొప్పగా రాలేదు. విమర్శకులు అందరూ మరో సందేహం లేకుండా ఫ్లాప్ అని తేల్చేశారు. అయితే... సినిమా హిట్టా? ఫ్లాపా? అనేది పక్కన పెడితే... మాటల మాంత్రికుడు, గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టోరీ సెలక్షన్ మీద సందేహాలు రేకెత్తించిన సినిమాగా 'ఆదికేశవ' మిగిలింది. 

ఏంటిది గురూజీ... మళ్ళీ అదే కథ!? 
'ఆదికేశవ' నిర్మాతల్లో సాయి సౌజన్య ఒకరు. ఆవిడ త్రివిక్రమ్ సతీమణి! పోస్టర్ మీద శ్రీమతి పేరు ఉన్నప్పటికీ... తెర వెనుక రచన, నిర్మాణ వ్యవహారాల్లో కర్త, కర్మ, క్రియ అన్నీ త్రివిక్రమ్ అనేది పరిశ్రమకు తెలిసిన విషయమే. 

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలో వచ్చిన 'డీజే టిల్లు', 'సార్' మంచి విజయాలు సాధించాయి. ఆయా సినిమాల దర్శక రచయితలు తమకు త్రివిక్రమ్ మంచి మంచి ఇన్‌పుట్స్ ఇచ్చారని చెప్పారు. మరి, 'ఆదికేశవ' సినిమాకు ఆయన ఇన్‌పుట్ ఏమీ ఇవ్వలేదా? అని అభిమానులలో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు, ఈ కథను త్రివిక్రమ్ ఎందుకు ఓకే చేశారు? అనే కొందరు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు వేస్తున్నారు. 

రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కిన పది పదిహేను కమర్షియల్ సినిమాలు చూస్తే 'ఆదికేశవ' కథ వన్ పర్సెంట్ కూడా కొత్తగా ఉండదు. పాత సినిమాలను మిక్సీలో వేసి తీసినట్లు ఉంటుంది. ఇటువంటి రొటీన్ కథను త్రివిక్రమ్ ఎందుకు ఓకే చేశారు? అనేది చాలా మందికి అర్థం కాని ప్రశ్న. మరొకటి ఏమిటంటే... 'అల వైకుంఠపురములో' హీరో హీరోయిన్స్ మధ్య ట్రాక్ & 'ఆదికేశవ'లో హీరో హీరోయిన్స్ మధ్య ట్రాక్ దగ్గర దగ్గరగా ఉండటం!

Also Read: కోట బొమ్మాళి పీఎస్ రివ్యూ: రాజకీయ చదరంగంలో పోలీసుల మధ్య యుద్ధం - థ్రిల్ ఇస్తుందా? లేదా? 

'అల వైకుంఠపురములో' సినిమా గుర్తు ఉందిగా! హీరోయిన్ పూజా హెగ్డే కంపెనీలో అల్లు అర్జున్ ఉద్యోగి. తొలుత మేడమ్ అన్నప్పటికీ... చూపులు అన్నీ ఆమె కాళ్ళ మీద ఉంటాయి. ఆ విషయం తెలిసి తన చుట్టూ తిప్పుకుంటుంది హీరోయిన్. 'సామజవరగమన' పాటలో ఉన్నది అదే కదా! చివరకు ఇద్దరూ ప్రేమలో పడతారు. 'ఆదికేశవ'కు వస్తే... ఇక్కడ కూడా శ్రీ లీల కంపెనీలో వైష్ణవ్ తేజ్ ఉద్యోగి. ఆమెను ప్రేమిస్తాడు. చివరకు ఇద్దరు ప్రేమలో పడతారు. సేమ్ ట్రాక్ ఉన్న సినిమాను గురూజీ ఎందుకు ఓకే చేశారు? అనేది అభిమానులకు అర్థం కావడం లేదు. 

Also Read: ఆదికేశవ రివ్యూ: మెగా మేనల్లుడి ఊర మాస్ యాక్షన్ - వైష్ణవ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?

తప్పు ఎక్కడ జరిగినప్పటికీ... వైష్ణవ్ తేజ్ ఖాతాలో మరో ఫ్లాప్ చేరింది. 'ఉప్పెన' తర్వాత మరోసారి ఆ స్థాయి విజయం ఆయనకు అందని ద్రాక్ష అయ్యింది. ఈ సినిమాతో అర్థం చేసుకోవలసిన మరో విషయం ఏమిటంటే... దర్శక రచయితలు ఎవరైనా సరే, త్రివిక్రమ్ సతీమణి నిర్మాతగా ఉన్న సినిమా ఫ్లాప్ అయితే ఆయన మీద విమర్శలు వస్తాయని!

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply

టాప్ హెడ్ లైన్స్

Gundeninda Gudigantalu Nov 20:రవిని బిజినెస్‌ పార్టనర్‌ చేసుకోవడానికి ముందుకొచ్చిన నీతూ..మనోజ్‌కు నీతూనిచ్చి పెళ్లిచేయాలని ప్రభావతి ప్రయత్నాలు
గుండెనిండా గుడిగంటలు: రవిని బిజినెస్‌ పార్టనర్‌ చేసుకోవడానికి ముందుకొచ్చిన నీతూ..మనోజ్‌కు నీతూనిచ్చి పెళ్లిచేయాలని ప్రభావతి ప్రయత్నాలు
Podarillu Serial Today NoV 20:విడాకుల గురించి పునరాలోచించుకోవాలని మహా,చక్రికి మాధవ్‌ చెబుతాడు. వెనక్కి తగ్గేదిలేదని ఇద్దరూ తేల్చి చెబుతారు
పొదరిల్లు: విడాకుల గురించి పునరాలోచించుకోవాలని మహా,చక్రికి మాధవ్‌ చెబుతాడు. వెనక్కి తగ్గేదిలేదని ఇద్దరూ తేల్చి చెబుతారు
Nuvvu leka Neanu Lenu Serial Today NOV 20:రాధపై చేయిచేసుకున్న విక్కీ..తనపై కోపంతోనే అనసూయకు పెళ్లిచేస్తున్నావా అంటూ నిలదీత
నువ్వులేక నేను లేను: రాధపై చేయిచేసుకున్న విక్కీ..తనపై కోపంతోనే అనసూయకు పెళ్లిచేస్తున్నావా అంటూ నిలదీత
Bigg Boss Season 10 Today November 19th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: బరువులు మోసి త్రిగుణ్‌ని గెలిపించిన అమన్! ఆ విషయంలో త్రిగుణ్ రియల్ హీరో!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: బరువులు మోసి త్రిగుణ్‌ని గెలిపించిన అమన్! ఆ విషయంలో త్రిగుణ్ రియల్ హీరో!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR On CM Revanth Reddy: 'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
Kolathur MLA VS Babu Passes Away: తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
Polavaram Maoist Dump:చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
Rahul Gandhi US Remarks Row: అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
AICC Action on Komatireddy Rajagopal Reddy: ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
Ramayana Collections : 1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
Sunil Gavaskar Shock: సిరాజ్‌ను తప్పించడంపై గవాస్కర్ అసహనం.. వేటు ఎందుకంటూ సూటి ప్రశ్న,  గిల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
సిరాజ్‌ను తప్పించడంపై గవాస్కర్ అసహనం.. వేటు ఎందుకంటూ సూటి ప్రశ్న,  గిల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
Henry Nicholls Century: బుమ్రా నిప్పులు చెరిగినా కోలుకున్న కివీస్.. నికోల్స్,  ఫిలిప్స్ అద్భుత పోరాటం, తొలి రోజు న్యూజిలాండ్ దే..
బుమ్రా నిప్పులు చెరిగినా కోలుకున్న కివీస్.. నికోల్స్,  ఫిలిప్స్ అద్భుత పోరాటం, తొలి రోజు న్యూజిలాండ్ దే..
Embed widget