Sreemukhi: శ్రీముఖి అభిమానులకు గుండె పగిలే న్యూస్, మొత్తానికి ఒకే చెప్పేసింది!
మొత్తానికి శ్రీముఖి ఒక గుడ్ న్యూస్ చెప్పకనే చెప్పేసింది. కానీ, అది ఏమిటా అనేది మాత్రం మీరే గెస్ చేయాలి. ఆమె పోస్ట్‌కు అర్థం ఏమిటీ?
Sreemukhi | యాంకర్ శ్రీముఖి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. బుల్లితెరపై యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత సినిమాల్లో చిన్న చిన్న పాత్రల నుంచి హీరోయిన్గా తన లక్ పరీక్షించుకున్న ఈ అందాల రాములమ్మ.. ఇన్నాళ్లు సింగిల్‌గానే ఉందనే విషయం తెలిసిందే. అయితే, 2022 ఆమె జీవితంలో మరిచిపోని రోజును తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వాలంటైన్స్‌డే పురస్కరించుకుని శ్రీముఖి గుడ్ న్యూస్ చెప్పకనే చెప్పేసింది. అయితే, ఈమె అల్లరిని తట్టుకోగలిగే.. అమాయకుడు ఎవరనేదే తెలియాల్సి ఉంది.
వాలెంటైన్స్ డే సందర్భంగా శ్రీముఖి సోమవారం ఆసక్తికరమైన ట్వీట్ పోస్ట్ చేసింది. తన జీవితంలో ఇదే బెస్ట్ వాలంటైన్స్ డే అని పేర్కొంది. దీన్ని బట్టి చూస్తుంటే.. శ్రీముఖి త్వరలోనే తన అభిమానులకు గుండె ఆగే న్యూస్ చెప్పేందుకు సిద్ధమైంది. ఒకేసారి ఆ వార్త చెబితే తన అభిమానులు తట్టుకోలేరని అనుకుందో ఏమో.. ఓ పెద్ద హింట్‌ను చిన్న ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌తో చెప్పేసింది.
చేతిలో ఫ్లవర్ బొక్కే.. ఆమె కళ్లలో ఆనందాన్ని చూస్తే.. ఎవరైనా ఈజీగా చెప్పేయొచ్చు. మొత్తానికి శ్రీముఖి ఎవరికో ఒకే చెప్పేసిందని. ఈ విషయాన్ని ఆమె కూడా రెండు ముక్కల్లో చెప్పేసింది. కానీ, సస్పెన్స్‌ను మాత్రం అలాగే ఉంచేసింది. ‘‘ఫిబ్రవరి 14, 2022. ఇది గుర్తుపెట్టుకోండి. మళ్లీ మాట్లాడుకుందాం. బెస్ట్ వాలెంటైన్స్ ఎవర్’ అంటూ తన సంతోషాన్ని అభిమానులతో పంచుకుంది. ఇదేదో తేడా కొడుతోందంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇంతకీ పెళ్లికి ఒకే చెప్పావా? లేదా ప్రేమకా అని చాలామంది కామెంట్ల ద్వారా అడుగుతున్నారు. అయినా, తర్వాత చెబుతా అందిగా కొద్ది రోజులు వేచి చూస్తే పోలే!
View this post on Instagram