Bigg Boss Telugu 6: యాంకర్ శివ - అరియానాకు మళ్లీ ఛాన్స్, బిగ్‌బాస్ కేఫ్ హోస్ట్ చేయబోయేది వీళ్లే
బిగ్ బాస్ తెలుగు సీజన్లో కూడా అరియానా ఛాన్సు కొట్టేసింది. ఆమెతో పాటూ యాంకర్ శివ కూడా.
గత మూడేళ్లుగా అరియానా బిగ్‌బాస్ కార్యక్రమంతో ఏదో రకంగా అసోసియేట్ అవుతూనే ఉంది. మొన్నటి వరకు బిగ్‌బాస్ ఓటీటీ అలరించిన అరియానా, ఇక బిగ్‌బాస్ తో తన కథ ముగిసినట్టేనని అనుకుంది. ఎందుకంటే ఇప్పటికే రెండు సార్లు హౌస్‌లోకి వెళ్లింది. ఓసారి బిగ్‌బాస్ బజ్ హోస్ట్ చేసింది. ఇక తనకు ఏ అవకాశం రాదని అనుకుంది. కానీ బిగ్ బాస్ సీజన్ 6 అవకాశం కూడా అరియానాకే దక్కింది. ఆమెతో పాటూ ఓటీటీ కంటెస్టెంట్ యాంకర్ శివ కూడా దీన్ని హోస్ట్ చేయబోతున్నాడు. వీరిద్దరి క్రేజీ కాంబో ఎలిమినేట్ అయిన సభ్యులను ఇంటర్య్వూ చేయబోతోంది. ఈసారి బిగ్‌బాస్ బజ్‌ను ‘బీబీ కేఫ్’ గా పేరు మార్చారు.
Also read: రెండో రోజే బిగ్‌బాస్ హౌస్‌లో ఏడుపులు, తగువులు - తిక్కదానా అంటూ తిట్లు మొదలుపెట్టిన గలాటా గీతూ
ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రోమో కూడా పూర్తయి విడుదలైంది. అరియానా తన యూట్యూబ్ ఛానెల్లో ఈ విషయాన్ని మొదట బయటపెట్టింది. ఆ ప్రోమో షూట్ జరుగుతున్న ప్రదేశాలను, యాంకర్ శివను కూడా చూపించింది. అర్థరాత్రి ఈ షూటింగ్ జరిగినట్టు చెప్పుకొచ్చింది. ఈ ప్రోమోకు ప్రేక్షకుల నుంచి బాగానే రెస్సాన్స్ వచ్చింది. ఆదివారం మొదటి ఎలిమినేషన్ ఉండబోతోంది. ఆ రోజున వీరిద్దరి షో కూడా మొదలవుతుంది.
Also read: ‘ఓ పాట పాడు రాజా’, ఇనయాను ఆడేసుకుంటున్న గీతూ, లేటేస్ట్ బిగ్ బాస్ ప్రోమో రిలీజ్
యాంకర్ శివ తనకు బిగ్ బాస్6 లో అవకాశం ఇవ్వమని ఓటీటీ సీజన్లోనే అడిగాడు. అయితే ఆయన కంటెస్టెంట్‌గా చోటు దక్కలేదు. కానీ ఇలా బిగ్‌బాస్ బజ్‌ను హోస్ట్ చేసే అవకాశం వచ్చింది. ఓటీటీ సీజన్లో అరియాన, శివ... ఇద్దరూ టాప్ 5లో నిలిచారు. శివ టాప్ 3 స్థానంలో, అరియానా 4వ స్థానంలో నిలిచారు. వీరిద్దరూ స్వతహాగానే యాంకర్లు కావడంతో బిగ్‌బాస్ బజ్ వీరికి దక్కింది. బిగ్‌బాస్ 4 నుంచి అరియానా ప్రయాణం బిగ్‌బాస్ తో ప్రతి ఏడాది కొనసాగుతూనే ఉంది.
View this post on Instagram