అన్వేషించండి

Ananya Nagalla: అనన్య సినిమాకు అనసూయ, పాయల్ సపోర్ట్

Tantra Movie Songs: అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలో రూపొందుతున్న 'తంత్ర' సినిమాలో ఫస్ట్ సాంగ్ సోషల్ మీడియా వేదికగా హీరోయిన్ పాయల్, నటి అనసూయ చేతుల మీదుగా విడుదల చేశారు.

Ananya Nagalla's Tantra movie first song Dheere Dheere released: 'మల్లేశం'తో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన తెలుగమ్మాయి అనన్యా నాగళ్ల. తొలి సినిమా తర్వాత 'ప్లే బ్యాక్', పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'వకీల్‌ సాబ్‌' తదితర హిట్ సినిమాలు చేశారు. ఇప్పుడామె ప్రధాన పాత్రలో రూపొందుతున్న హారర్ థ్రిల్లర్ 'తంత్ర'. ఈ సినిమాతో దివంగత నటుడు శ్రీహరి తమ్ముడి కుమారుడు ధనుష్‌ రఘుముద్రి హీరోగా పరిచయం అవుతున్నారు.

'తంత్ర'లో పాట విడుదల చేసిన అనసూయ, పాయల్
అనన్య నాగళ్ళ, ధనుష్ రఘుముద్రి జంటగా నటిస్తున్న ఈ సినిమాలో సలోని, 'టెంపర్' వంశీ, మీసాల లక్ష్మణ్ (ఆర్ఎక్స్ 100, మంగళవారం సినిమాల ఫేమ్) ప్రధాన తారాగణం. ఫస్ట్ కాపీ మూవీస్, బి ద వే ఫిల్మ్స్ సంస్థలపై నరేష్ బాబు పి, రవి చైతన్య ప్రొడ్యూస్ చేస్తున్నారు. శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ఈ సినిమా ఫస్ట్ సాంగ్ విడుదల చేశారు.

సెన్సేషనల్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్, ప్రముఖ నటి & యాంకర్ అనసూయ భరద్వాజ్ 'తంత్ర' సినిమాలో తొలి పాటను సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. 'తంత్ర' సినిమాకు ఆర్ఆర్ ధ్రువన్ సంగీతం అందించారు. 'ధీరే ధీరే' అంటూ సాగే ఈ పాటను అనురాగ్ కులకర్ణి ఆలపించగా... అలరాజు సాహిత్యం అందించారు. 

Also Read: ప్రభాస్ ఫస్ట్ లుక్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్

''మహిళా ప్రాధాన్య చిత్రమిది. ఫిమేల్ ఓరియెంటెడ్ హారర్‌ ఎంటర్‌టైనర్‌. పురాణ  గాథలు, భారతీయ తాంత్రిక శాస్త్రం నేపథ్యంలో ఆద్యంతం ఉత్కంఠగా సాగే చిత్రమిది. ఇప్పటికి వరకు విడుదల చేసిన ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించింది'' అని నిర్మాతలు తెలిపారు. తమ సినిమాకు ప్రేక్షకుల ఆదరణ ఇదే విధంగా కొనసాగాలని వారు కోరారు. 

Also Readగుంటూరు కారం రివ్యూ: మహేష్ బాబు ఎనర్జీ & ఆ మాస్ సూపర్, మరి సినిమా?

'ధీరే ధీరే...' పాట విడుదలైన సందర్భంగా చిత్ర దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి మాట్లాడుతూ ''గతంలో మేం విడుదల చేసిన ఫస్ట్ లుక్, ఆ తర్వాత టీజర్ ఆడియన్స్ నుంచి ఫెంటాస్టిక్ రెస్పాన్స్ అందుకున్నాయి. టీజర్ చూసిన ప్రతి ఒక్కరూ పాజిటివ్ కామెంట్స్ ఇస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ అని చెబుతూ  మెచ్చుకుంటుంటే మాకు ఎంతో ధైర్యంగా ఉంది. ఇప్పుడు విడుదల చేసిన పాటకూ శ్రోతల నుంచి మంచి స్పందన లభిస్తోంది. అతి త్వరలో ట్రైలర్ కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. మా నిర్మాతలు నరేష్ బాబు, రవి చైతన్య ఎక్కడా రాజీ పడకుండా, నేను అడిగింది వెంటనే ఏర్పాటు చేస్తూ సినిమా బాగా రావడానికి ఎంతో సహకరించారు. స్టార్ సింగర్ అనురాగ్ కులకర్ణి గారు ఈ సాంగ్ పాడడం మాకు ఎంతో ప్లస్ అయ్యింది. ఎంతో బిజీగా ఉన్నామేం అడిగిన వెంటనే సాంగ్ రిలీజ్ చేసిన పాయల్, అనసూయ గారికి థాంక్స్'' అని చెప్పారు.

'తంత్ర' సినిమాలో అనన్యా నాగళ్ల, ధనుష్‌, సలోని, 'టెంపర్‌' వంశీ, మీసాల లక్ష్మణ్ తదితరులు ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి కూర్పు : ఎస్‌.బి. ఉద్దవ్‌ (భలే భలే మగాడివోయ్‌, మిథునం),  ఛాయాగ్రహణం : సాయి రామ్ ఉదయ్‌ (రాజు యాదవ్‌ ఫేం) - విజయ భాస్కర్ సద్దాల, సంగీతం: ఆర్‌ఆర్‌ ధృవన్‌ (క్రేజీ ఫెలో, మైల్స్‌ ఆఫ్‌ లవ్‌), నిర్మాణ సంస్థలు : ఫస్ట్‌ కాపీ మూవీస్‌ - బి ద వే ఫిల్మ్స్‌ - వి ఫిల్మ్‌ ఫ్యాక్టరీ, నిర్మాతలు : నరేష్ బాబు పి - రవి చైతన్య, దర్శకత్వం: శ్రీనివాస్‌ గోపిశెట్టి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Fake Calls: ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
New Year Celebrations: హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
Boxing Day Test Updates: భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
Borewell Deaths: పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
Embed widget