By: ABP Desam | Updated at : 15 Jun 2022 12:56 PM (IST)
Image Credit: Ananya Nagalla/Instagram
‘మల్లేశం’ సినిమాతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా అడుగుపెట్టింది అనన్య నాగళ్ల. ఆ తర్వాత ఆమె ‘వకీల్ సాబ్’, ‘ప్లే బ్యాక్’ సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరైంది. ప్రస్తుతం పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపిస్తోంది. అందాల ఆరబోతకు ఏ మాత్రం వెనుకాడని అనన్య ఇప్పుడు మంచి ‘బ్రేక్’ కోసం ఎదురుచూస్తోంది. ఒక్కసారి హీరోయిన్‌గా క్లిక్కైతే.. తిరిగే ఉండదని భావిస్తోంది. అయితే, అవకాశాలు రాలేదని డీలా పడకుండా లైఫ్‌ను మస్త్ ఎంజాయ్ చేస్తోంది.
అనన్యకు ట్రావెలింగ్ అంటే బాగా ఇష్టం. ఇటీవలే ఆమె ఉత్తరాఖండ్‌లోని మస్సూరికి వెళ్లొచ్చింది. ఆ తర్వాత ఆమె థాయ్‌లాండ్ ట్రిప్‌కు వెళ్లింది. ఈ సందర్భంగా ఆమె అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తోంది. ఆ వీడియోలు ఫొటోలను తన అభిమానులతో కూడా పంచుకుంటోంది. తాజాగా ఆమె పులితో ఆటలాడుతూ కనిపించింది. ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో పోస్ట్ చేసింది. పులి దగ్గర కూర్చొని, దాన్ని టచ్ చేస్తున్న ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిత్రం ఏమిటంటే.. ఆమె టచ్ చేసినా సరే ఆ పులి ఆమెను ఏమీ చేయడం లేదు.
Also Read: అప్పులు అన్నీ తీరుస్తా, కడుపు నిండా తింటా - కమల్ హాసన్
‘‘ఈ పులులకు ఎలాంటి మత్తు ఇవ్వలేదు. పుట్టినప్పటి నుంచే వీటిని మనుషులే పెంచుతారు. కాబట్టి, అవి మనుషుల మధ్యే తిరుగుతాయి’’ అని అనన్య క్యాప్షన్‌లో తెలిపింది. అనన్య నాగళ్ల పోస్ట్ చేసిన ఈ వీడియోను చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు.
థాయ్‌లాండ్‌లో ఎంజాయ్ చేస్తున్న అనన్య నాగళ్ల:
Also Read: డిజిటల్ తెరపై రాజ్ తరుణ్, శివానీ రాజశేఖర్ పెళ్ళంట
Dasara Collections: ‘దసరా’ అడ్వాన్స్ బుకింగ్ అదుర్స్ - నాని కెరీర్లో సరికొత్త రికార్డు!
Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు
Silk Smitha Poster: ‘దసరా’ మూవీలో సిల్క్ స్మితా పోస్టర్ వెనుక ఇంత కథ ఉందా - అసలు విషయం చెప్పేసిన దర్శకుడు
Naga Chaitanya - Sobhita Dhulipala: చైతూ - శోభిత మళ్లీ దొరికిపోయారా? వైరల్ అవుతున్న డేటింగ్ ఫొటో!
Parineeti Chopra Wedding: ఆ ఎంపీతో బాలీవుడ్ నటి పరిణితీ చోప్రా పెళ్లి? అసలు విషయం చెప్పేసిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత
Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం - విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్
TSLPRB Exam: కానిస్టేబుల్ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!
KTR On Amaravati : అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?