News
News
X

బుల్లితెరపై ఇక ‘ఆనందం’ హీరో ఆకాశ్ సందడి - సీరియల్స్‌లోకి ఎంట్రీ?

ఆనందం, పిలిస్తే పలుకుతా వంటి సినిమాలతో మెప్పించిన హీరో జై ఆకాశ్ ప్రస్తుతం సీరియల్‌లో నటించనున్నాడు. ఈ సీరియల్ సెట్స్ పై నుంచి సోషల్ మీడియాలో ఫోటోలు దర్శనమిచ్చాయి.

FOLLOW US: 
Share:

కప్పుడు తెలుగు తెరపై మెరుపు మెరిసిన హీరోలు ఇప్పుడు కనుమరుగవుతున్నారు. కొందరు వ్యాపారాలలో సెటిల్ అయితే మరికొందరు అవకాశాలు రాక ఇబ్బంది పడుతున్నారు. అయితే మరికొందరు సైడ్ క్యారక్టర్ లు చేస్తూ సెటిల్ అయిపోతున్నారు. వెండి తెర నుంచి బుల్లితెరకు పరిచయం అవుతున్నవారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో ఆకాశ్ ఒకరు. ఆనందం, పిలిస్తే పలుకుతా, నవ వసంతం వంటి సినిమాలు చేసి ప్రస్తుతం సీరియల్స్ లో నటించడంతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాడు ఆకాశ్. ఇక ఈ హీరో నిన్నటి తరం హీరోలలో ఒకడు. ఆకాశ్ నటించింది తక్కువ సినిమాలే అయినా తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుని అభిమానుల హృదయంలో నిలిచిపోయాడు. ఆ తర్వాత తెలుగులో పలు సినిమాలలో హీరోగా నటించి మెప్పించాడు. కానీ ఆశించిన విజయాన్ని సొంతం చేసుకోలేకపోయాడనే సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ హీరో నటిస్తున్న సీరియల్ నుంచి కొత్త అప్డేడ్ వచ్చింది.

సీరియల్ సెట్స్ నుంచి ఇప్పటికే కొన్ని చిత్రాలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. ఆకాష్ తన సహనటులు మోనిషా, జబర్దస్త్ ఫేమ్ సన్నీ, ఇతరులతో కలిసి ఉన్న ఫోటోలు పోస్ట్ చేశారు. ఇందులో ఆకాష్ సంప్రదాయ దుస్తుల్లో ఉన్నాడు. ఈ సీరియల్ కి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయని తెలుస్తోంది.

ఆకాశ్ ఇప్పటికే తెలుగు, తమిళ చిత్రాలతో మెప్పించాడు. ఆకాశ్ శ్రీలంక మూలాలున్న తమిళ నటుడు. కానీ లండన్ లో స్థిరపడ్డారు. అయితే 1999లో ‘రోజావనం’ సినిమాలో మంచి పేరు సంపాదించాడు ఆకాశ్. ఈ సినిమాను కె. బాలచందర్ నిర్మించారు. ఆ తర్వాత 2001లో తెలుగులో వచ్చిన ‘ఆనందం’ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలవడంతో ఆకాశ్ క్రేజ్ పెరిగిపోయింది. అయితే ఈ చిత్రం తర్వాత సినిమాల్లో కనిపించలేదు ఈ నటుడు. కానీ పలు తెలుగు, తమిళ చిత్రాలకు దర్శకుడిగా మారాడు. 

హీరో ఆకాశ్ సీరియల్ లోకి ఎంట్రీ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. దీనికి కారణం సినిమాలలో ఆఫర్లు తగ్గడం వల్లే ఆకాశ్ సీరియల్ లోకి ఎంట్రీ ఇచ్చారని చిత్ర పరిశ్రమలోనూ టాక్ నడుస్తోంది. కొన్ని సినిమాలతోనే ప్రేక్షకుల మనసు దోసుకున్న ఆకాశ్ సీరియల్ లో ఏ స్థాయిలో సక్సెస్ అవుతాడో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

View this post on Instagram
 
A post shared by Jai Akash (@jaiakash252)

జెమిని టీవీలో ఆకాశ్ కొత్త సీరియల్ షూట్ ప్రసారం కానుందని సమాచారం. ఈ సీరియల్‌కు ‘గీతాంజలి’ అనే పేరును ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక తమిళ సీరియల్స్ లో ఆకాశ్‌కు ఇప్పటికే ప్రేక్షకుల మెప్పు పొందాడు. మరి తెలుగు సీరియల్ లో ఏ స్థాయిలో సక్సెస్ అవుతారో లేదో చూడాలి. ఆకాశ్ 2014లో ‘దొంగ ప్రేమ’ సినిమా తర్వాత మళ్లీ టాలీవుడ్‌లో కనిపించలేదు. ఆ తర్వాత తమిళ చిత్రాల్లో బిజీగా మారిపోయాడు. సీరియల్స్‌లో కూడా నటిస్తూ తీరికలేకుండా ఉన్నాడు. ప్రస్తుతం ఆకాశ్ ‘తవమై తవమిరుండు’ అనే తమిళ సీరియల్‌లో నటిస్తున్నాడు. 

Read Also: భక్తిలో అయినా ప్రేమలో అయినా తన్మయత్వం ఒకటే -విశ్వనాథ్ సినిమాలో ఈ ఒక్క పాట చాలు

Published at : 03 Feb 2023 10:15 PM (IST) Tags: Serials Akash in Telugu Serial Hero Akash Gitanjali serial hero into serial

సంబంధిత కథనాలు

Brad Minnich For NTR 30 : ఎన్టీఆర్ సినిమాకు ఇంకో హాలీవుడ్ టచ్ - స్టార్ టెక్నీషియన్ వచ్చాడుగా 

Brad Minnich For NTR 30 : ఎన్టీఆర్ సినిమాకు ఇంకో హాలీవుడ్ టచ్ - స్టార్ టెక్నీషియన్ వచ్చాడుగా 

Janaki Kalaganaledu March 28th: ఒక్కటైన రామ, జానకి- సంతోషంలో జ్ఞానంబ, అనుమానించిన మల్లిక

Janaki Kalaganaledu March 28th: ఒక్కటైన రామ, జానకి- సంతోషంలో జ్ఞానంబ, అనుమానించిన మల్లిక

డేటింగ్‌పై నెటిజన్ వింత ప్రశ్న, తన స్టైల్ లో రిప్లై ఇచ్చిన సమంత

డేటింగ్‌పై నెటిజన్ వింత ప్రశ్న, తన స్టైల్ లో రిప్లై ఇచ్చిన సమంత

'పులి' నుంచి 'కబ్జ' వరకు - పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే ఇదే జరుగుద్ది

'పులి' నుంచి 'కబ్జ' వరకు - పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే ఇదే జరుగుద్ది

మాధురీ దీక్షిత్‌పై అస‌భ్య వ్యాఖ్య‌లు - ‘నెట్‌ఫ్లిక్స్’కు లీగ‌ల్ నోటీసులు జారీ

మాధురీ దీక్షిత్‌పై అస‌భ్య వ్యాఖ్య‌లు - ‘నెట్‌ఫ్లిక్స్’కు లీగ‌ల్ నోటీసులు జారీ

టాప్ స్టోరీస్

Hyderabad Traffic Restrictions: హైదరాబాదీలకు ట్రాపిక్ అలర్ట్ - 90 రోజుల పాటు అటు చూడొద్దు!

Hyderabad Traffic Restrictions: హైదరాబాదీలకు ట్రాపిక్ అలర్ట్ - 90 రోజుల పాటు అటు చూడొద్దు!

EPFO: శుభవార్త వచ్చేసింది, EPF వడ్డీ రేటు 8.15%కు పెంపు

EPFO: శుభవార్త వచ్చేసింది, EPF వడ్డీ రేటు 8.15%కు పెంపు

PAN- Aadhaar Link: పాన్‌-ఆధార్‌ లింకేజీలో వీళ్లకు మినహాయింపు, మీరూ ఈ వర్గంలో ఉన్నారా?

PAN- Aadhaar Link: పాన్‌-ఆధార్‌ లింకేజీలో వీళ్లకు మినహాయింపు, మీరూ ఈ వర్గంలో ఉన్నారా?

Ram Charan Birthday - NTR : రామ్ చరణ్ బర్త్‌డే పార్టీకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు?

Ram Charan Birthday - NTR : రామ్ చరణ్ బర్త్‌డే పార్టీకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు?