The Kashmir Files: సినిమా పేరు చెప్పే ధైర్యం కూడా లేదా? అమితాబ్ పై ట్రోలింగ్
తాజాగా అమితాబ్ బచ్చన్ కశ్మీర్ ఫైల్స్ సినిమాను ఉద్దేశిస్తూ ఓ ట్వీట్ చేశారు. కానీ ఎక్కడా కూడా సినిమా పేరు ప్రస్తావించకుండా.. 'అంతకుముందు తెలియనిది ఇప్పుడు తెలిసింది' అంటూ పోస్ట్ పెట్టారు.
90వ దశకంలో కశ్మీర్ పండిట్ లపై సాగిన సామూహిక హత్యాకాండ నేపథ్యంలో దర్శకుడు వివేక్ 'ది కశ్మీర్ ఫైల్స్' అనే సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్ లు కీలకపాత్రలు పోషించారు. మార్చి 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ఇప్పటివరకు ఈ సినిమా వంద కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టింది.
అయితే బాలీవుడ్ స్టార్ మాత్రం ఈ సినిమా గురించి మాట్లాడడం లేదు. హిందూ పండిట్స్ పై ముస్లింలు జరిపిన హత్యాకాండ గురించి మాట్లాడే ధైర్యం ఎవరూ చేయడం లేదు. దీంతో బాలీవుడ్ స్టార్స్ ని ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఇదిలా ఉండగా.. తాజాగా అమితాబ్ బచ్చన్ ఈ సినిమాను ఉద్దేశిస్తూ ఓ ట్వీట్ చేశారు. కానీ ఎక్కడా కూడా సినిమా పేరు ప్రస్తావించకుండా.. 'అంతకుముందు తెలియనిది ఇప్పుడు తెలిసింది' అంటూ పోస్ట్ పెట్టారు.
ఇది చూసిన నెటిజన్లకు మరింత కోపమొచ్చింది. సినిమా పేరు చెప్పే ధైర్యం కూడా లేదా బిగ్ బీ..? అంటూ ప్రశ్నిస్తున్నారు. 'కశ్మీర్ ఫైల్స్' అని టైప్ చేయడానికి కూడా భయపడుతున్నారంటే.. మీరు ఎంత పిరికిపందలా వ్యవహరిస్తున్నారో..? అర్ధమవుతుందంటూ ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. నిజానికి అమితాబ్ ఈ సినిమా గురించి మాట్లాడతారేమోనని చాలా మంది ఎదురుచూశారు. కానీ ఆయన ఒక్క కామెంట్ కూడా చేయకుండా.. ఇలా ఇన్ డైరెక్ట్ గా పోస్ట్ పెట్టడం జనాలకు నచ్చడం లేదు.
T 4222 - .. we know now , what we never knew then ..
— Amitabh Bachchan (@SrBachchan) March 16, 2022
ఈ సినిమా కథ గురించి చెప్పాలంటే.. కశ్మీర్ లోయలోని హిందూ కుటుంబాలపై పాకిస్తాన్ ప్రేరేపిత ముస్లిం ఉగ్రవాదులు దారుణ మారణకాండకు పాల్పడ్డారు. కశ్మీరీ మహిళలలను వివస్త్రలుగా చేసి.. సామూహిక మానభంగం చేశారు. ఆ లోయలో ఉండాలంటే ముస్లింలుగా మతం మార్చుకోవాలని.. లేదంటే చంపేస్తామని బెదిరించారు. తమకు ఎదురు తిరిగినవారిని చంపేశారు. వారు ఆస్తులను దోచుకున్నారు. తుపాకులు, కత్తులతో హిందువులపై దాడి చేశారు. అప్పటివరకు తమతో కలిసి ఉన్న ముస్లిం సోదరులు తమను చంపడానికి ప్రయత్నించడం పండిట్ లను విస్మయానికి గురిచేసింది. దాదాపు 5 లక్షల మంది కశ్మీరీ పండిట్ లు స్వదేశంలోనే శరణార్థులుగా మారారు. ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిపోయారు. వేలాది కుటుంబాలు చెల్లాచెదురైపోయాయి. అప్పట్లో జరిగిన ఈ మారణకాండకు కేంద్రంలో ఉన్న ఓ మంత్రి సాయం చేసినట్లు అనుమానాలు ఉన్నాయి.