Shraddha Kapoor: బాయ్ ఫ్రెండ్ తో శ్రద్ధాకపూర్ బ్రేకప్? ఒక్క పోస్ట్ తో క్లారిటీ ఇచ్చిన నటి
ఇటీవల శ్రద్ధాకపూర్ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంది. గోవాలో తన స్నేహితులు, సన్నిహితులతో కలిసి చాలా గ్రాండ్ గా బర్త్ డే జరుపుకుంది.
బాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రద్ధాకపూర్ 'సాహో' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఫ్యూచర్ లో ఆమె మరిన్ని తెలుగు సినిమాల్లో కనిపించనుందని సమాచారం. ఇదిలా ఉండగా.. ఈ బ్యూటీ చాలా ఏళ్లుగా సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ రోషన్ శ్రేష్ఠతో ప్రేమలో ఉంది. నిజానికి వీరిద్దరూ చిన్ననాటి స్నేహితులు. వీరి కుటుంబాల మధ్య కూడా మంచి రిలేషన్ ఉంది. అయితే గత ఐదారు ఏళ్లుగా శ్రద్ధా, రోహన్ లో ప్రేమలో ఉన్నారు. కానీ ఈ విషయాన్ని ఎప్పుడూ అఫీషియల్ గా చెప్పలేదు.
కానీ తరచూ పార్టీలకు, ట్రిప్ లకు వెళ్తూ మీడియాకంట పడుతుంటుంది ఈ జంట. అయితే ఈ ఇప్పుడు వీరిద్దరూ విడిపోయారని బాలీవుడ్ మీడియా కథనాలు ప్రచురిస్తోంది. ఇటీవల శ్రద్ధాకపూర్ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంది. గోవాలో తన స్నేహితులు, సన్నిహితులతో కలిసి చాలా గ్రాండ్ గా బర్త్ డే జరుపుకుంది. దీనికి రోహాన్ హాజరుకాలేదు. అంతేకాదు.. శ్రద్ధాకు సోషల్ మీడియా వేదికగా కూడా విషెస్ చెప్పలేదు. దీంతో ఈ జంట విడిపోతుందంటూ ప్రచారం చేశారు.
నిన్నటి నుంచి ఈ వార్తలు ఎక్కువ అవుతుండడంతో శ్రద్ధాకపూర్ ఇన్ డైరెక్ట్ గా స్పందించింది. తన ఇన్స్టాగ్రామ్ లో ఓ ఫొటోను షేర్ చేస్తూ.. 'ఇంకా చెప్పండి' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. తన బ్రేకప్ వార్తలపై వెటకారంగా స్పందించింది శ్రద్ధా. ఆమె పోస్ట్ ని బట్టి రోహన్ కి తనతో బ్రేకప్ జరగలేదని తెలుస్తోంది. మరి ఈ జంట తమ రిలేషన్ ను పెళ్లి వార్తకు తీసుకెళ్తుందో లేదో చూడాలి!
View this post on Instagram