Godfrey-Chiranjeevi: చిరు పాట, మాస్ స్టెప్పులకు అమెరికన్ కామెడీ స్టార్ ఫిదా!
హాలీవుడ్ కమెడియన్ గాడ్ ఫ్రే.. మెగాస్టార్ చిరంజీవి స్టెప్పులకు ఫిదా అయ్యారు.
మెగాస్టార్ చిరంజీవికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ఆయన మాస్ స్టెప్పులకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. తన రీఎంట్రీలో కూడా అల్లాడిస్తున్నారు మెగాస్టార్. వరుస సినిమాలు ఒప్పుకుంటూ దూసుకుపోతున్నారు. ఇదిలా ఉండగా.. రీసెంట్ గా ఓ వీజే లైవ్ షోలో భాగంగా హాలీవుడ్ కమెడియన్ గాడ్ ఫ్రేతో మాట్లాడుతూ చిరంజీవి ప్రస్తావన తీసుకొచ్చారు. అలానే 'ముఠామేస్త్రి' సినిమాలో చిరంజీవి డాన్స్ వీడియోను ప్లే చేసి చూపించారు.
ఈ క్రమంలో గాడ్ ఫ్రే డాంచిమా.. మెగాస్టార్ చిరంజీవి స్టెప్పులకు ఫిదా అయ్యారు. ప్రముఖ తెలుగు-అమెరికన్ స్టాండప్ కమెడియన్ విష్ణు వాకా నిర్వహించిన కార్యక్రమంలో లైవ్ లో పాల్గొన్నారు గాడ్ ఫ్రే. అతడికి విష్ణు చిరంజీవి పాటలని, డాన్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు. మొదట చిరంజీవి అనే పేరును పలకడానికి ఇబ్బందిపడ్డ గాడ్ ఫ్రే కి సరిగ్గా ఎలా పలకాలో వినిపించాడు విష్ణు. ఆ తరువాత చిరంజీవి ఇండియా లో ఎంత పెద్ద స్టారో వివరిస్తూ.. తను ఇండియన్ మైఖేల్ జాక్సన్ లాగా పేరొందిన విషయాన్ని తెలిపారు. వీరిద్దరి మధ్య సంభాషణ చాలా సరదాగా సాగింది.
ఇక చిరంజీవి సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన 'గాడ్ ఫాదర్' సినిమాలో నటిస్తున్నారు. 'లూసిఫర్'కి రీమేక్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. అలానే మెహర్ రమేష్ దర్శకత్వంలో 'భోళా శంకర్', బాబీ దర్శకత్వంలో 'వాల్తేర్ వీరయ్య' సినిమాల్లో నటిస్తున్నారు. దీంతో పాటు వెంకీ కుడుముల దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు.
Also Read: మహేష్ బాబు - త్రివిక్రమ్ శ్రీనివాస్ - 'సైన్యం' ఆగింది
Also Read: 'విక్రమ్', 'మేజర్' వల్లే అక్షయ్ కుమార్ 'పృథ్వీరాజ్' ప్లాప్ అయ్యిందా? హీరోయిన్ మాటలు విన్నారా?
View this post on Instagram
View this post on Instagram