అన్వేషించండి

Pushpa 2 Movie : 'పుష్ప 2' - ఖర్చులో అస్సలు తగ్గేదే లే

'పుష్ప 2' సినిమా విషయంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంచనాలు పెంచేశారు. ఈ మధ్య 'ఊర్వశివో రాక్షసీవో' సక్సెస్ సెలబ్రేషన్స్‌లో 'అస్సలు తగ్గేదే లే' అన్నారు. ఖర్చు విషయంలో నిర్మాతలు కూడా అదే మాట అంటున్నారట!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కథానాయకుడిగా నటించనున్న సినిమా 'పుష్ప 2' (Pushpa 2 The Rule). త్వరలో షూటింగ్ స్టార్ట్ కానుంది. పాన్ ఇండియా స్థాయిలో 'పుష్ప' సూపర్ సక్సెస్ సాధించడంతో... ఇప్పుడు అందరూ 'పుష్ప 2' కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంకా సెట్స్ మీదకు వెళ్ళక ముందే అల్లు అర్జున్ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు. 

'ఊర్వశివో రాక్షసివో' సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్‌లో ''ఇప్పుడు నన్ను అందరూ పుష్ప గురించి అడుగుతున్నారు. వారికి చిన్న అప్ డేట్ ఇస్తా... 'పుష్ప 1' తగ్గేదే లే అయితే 'పుష్ప 2' అస్సలు తగ్గేదేలే. నేనూ ఈ సినిమా కోసం ఎగ్జైట్‌మెంట్‌తో వెయిట్ చేస్తున్నాను'' అని బన్నీ చెప్పారు. బడ్జెట్ విషయంలో నిర్మాతలు కూడా అదే మాట అంటున్నారట.

బడ్జెట్ ఎంత?...
ఇంత అని లేదు!
'పుష్ప' సక్సెస్ అవ్వడంతో 'పుష్ప 2'ను భారీగా తీయాలని డిసైడ్ అయినట్లు బన్నీ సన్నిహిత వర్గాల సమాచారం. ఆల్రెడీ బడ్జెట్ గురించి నిర్మాతలతో అల్లు అర్జున్ డిస్కస్ చేశారని టాక్. సుకుమార్ ఎంత అడిగితే అంత ఇవ్వమని, ఖర్చు పరంగా అతడి మీద ఒత్తిడి తీసుకు రావద్దని, ఇంత అని లెక్కలు వేసుకోవద్దని చెప్పేశారట. సో... బడ్జెట్ విషయంలో సుకుమార్‌కు ఫుల్ ఫ్రీడమ్ లభించినట్టే అని తెలుగు సినిమా ఇండస్ట్రీ ఖబర్.
 
'ఊర్వశివో రాక్షసివో' సక్సెస్ సెలబ్రేషన్స్‌లో అల్లు అర్జున్ ఆప్తుడు 'బన్నీ' వాసు సైతం 'పుష్ప 2' మీద అంచనాలు పెంచారు. ''2023లో వస్తున్న 'పుష్ప 2'తో స్క్రీన్లు పగిలిపోబోతున్నాయి. ఇది రాసిపెట్టుకోండి'' అని ఆయన అన్నారు. ఈ మాటలకు తోడు భారీ బడ్జెట్ ఉండటంతో సినిమా ఎలా తీస్తున్నారో? అని ఇండస్ట్రీ కూడా వెయిట్ చేస్తోంది. 

మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, యలమంచలి రవిశంకర్ 'పుష్ప 2' ప్రొడ్యూస్ చేస్తున్నారు. 'పుష్ప' నిర్మాతలు కూడా వారే. 'పుష్ప' కంటే ముందు సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా 'రంగస్థలం' నిర్మించారు. వాళ్ళకు దర్శకుడితో మంచి గురి కుదిరింది. 'పుష్ప 2' మీద భారీ అంచనాలు ఉండటంతో ఖర్చు విషయంలో రాజీ పడకూడదని నిర్ణయించుకున్నారట. 

Also Read : 'పోకిరి'లో మహేష్ - 'యశోద' డబ్బింగ్‌లో సమంత!

అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా (Rashmika Mandanna) కథానాయికగా...  ఫహాద్ ఫాజిల్ (Fahad Fazil), అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj), సునీల్ తదితరులు 'పుష్ప 2'లో కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 'పుష్ప' విడుదలైన తర్వాత 'తగ్గేదే లే' పాపులర్ అయ్యింది. ఇప్పుడు 'అస్సలు తగ్గేదే లే' అంటున్నారు. 

'తగ్గేదే లే'తో పాటు 'ఊ అంటావా మావ ఊఊ అంటావా' సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. అందులో సమంత (Samantha)తో అల్లు అర్జున్ వేసిన స్టెప్పులు సిగ్నేచర్ మూమెంట్స్ అయ్యాయి. చాలా షోల్లో కాపీ చేస్తున్నారు. మరి, 'పుష్ప 2' కోసం దేవి శ్రీ ప్రసాద్ ఎటువంటి ఐటమ్ సాంగ్ కంపోజ్ చేస్తారో? అని అందరూ వెయిట్ చేస్తున్నారు. 

'పుష్ప' సినిమాకు ఫారిన్ సినిమాటోగ్రాఫర్ మిరోస్లా బ్రోజెక్ వర్క్ చేశారు. సెకండ్ పార్ట్‌కు కూడా ఆయనే వర్క్ చేస్తున్నారు. ఈ మధ్య అల్లు అర్జున్ మీద స్పెషల్ ఫోటోషూట్ చేసినట్టు ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. టీజర్ కూడా షూట్ చేసినట్టు టాక్. త్వరలో ఆ టీజర్ వస్తుందేమో!? 

టాప్ హెడ్ లైన్స్

Devi Sri Prasad: దేవికి ఓటు వేసిన నాగార్జున... 'కింగ్ 100'కు డీఎస్పీ మ్యూజిక్ కన్ఫర్మ్
దేవికి ఓటు వేసిన నాగార్జున... 'కింగ్ 100'కు డీఎస్పీ మ్యూజిక్ కన్ఫర్మ్
Vijay Varma: తమన్నా మాజీ బాయ్‌ఫ్రెండ్‌కు లైంగిక వేధింపులు... కాస్టింగ్ కౌచ్ గురించి విజయ్ వర్మ ఏమన్నాడంటే?
తమన్నా మాజీ బాయ్‌ఫ్రెండ్‌కు లైంగిక వేధింపులు... కాస్టింగ్ కౌచ్ గురించి విజయ్ వర్మ ఏమన్నాడంటే?
Casting Couch: డబ్బులు అడిగితే  లైంగిక కోర్కెలు తీర్చమన్నాడు... అందాల పోటీల్లో చీకటి కోణం
డబ్బులు అడిగితే  లైంగిక కోర్కెలు తీర్చమన్నాడు... అందాల పోటీల్లో చీకటి కోణం
Soniya Singh: యూట్యూబ్ క్రేజ్ నుంచి విరూపాక్ష దాకా.. సోనియా సింగ్ రియల్ లైఫ్ విశేషాలు
యూట్యూబ్ క్రేజ్ నుంచి విరూపాక్ష దాకా.. సోనియా సింగ్ రియల్ లైఫ్ విశేషాలు

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Iran War: దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
Taslima Nasrin Back To Kolkata: రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
Jasprit Bumrah Out.!: లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
YSRCP MLA Virupakshi: కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Ritika Nayak: కొరియన్ అమ్మాయి కాదు... కనకరాజుతో నటించిన హీరోయిన్‌ది ఢిల్లీ - ట్రైలర్‌ లాంచ్‌లో ఫోటోలు
కొరియన్ అమ్మాయి కాదు... కనకరాజుతో నటించిన హీరోయిన్‌ది ఢిల్లీ - ట్రైలర్‌ లాంచ్‌లో ఫోటోలు
Embed widget