అన్వేషించండి

Allu Arha: ఎన్టీఆర్ ‘దేవర’లో అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ - ఏ పాత్రలో నటించిందంటే?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ ‘దేవర’. ఈ మూవీలో అల్లు అర్హ కూడా ఓ ప్రత్యేక పాత్రలో నటించిందట. ఇప్పుడీ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Allu Arha: యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ ‘దేవర’. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు మూవీపై అంచనాలను భారీగా పెంచేశాయి. తాజాగా ఈ మూవీ గురించి ఓ ఇంట్రస్టింగ్ వార్త ఒకటి బయటకు వచ్చింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ ఈ సినిమాలో నటిస్తోందనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మూవీలో ఓ ప్రత్యేకమైన పాత్రకోసం అల్లు అర్హను తీసుకున్నారట మేకర్స్. ఇది తెలిసి బన్నీ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

జూనియర్ జాన్వీగా అల్లు అర్హ?

‘దేవర’ సినిమాలో అల్లూ అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ అతిథి పాత్రలో నటిస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. దీంతో ఈ వార్త కాస్తా నెట్టింట వైరల్ అవుతోంది. ఇప్పటికే అల్లు అర్హ సమంత నటించిన ‘శాకుంతలం’ సినిమాలో యువ భరతుడిగా ముని ఆశ్రమవాసిగా కనిపించింది. ఈ సినిమాలో అర్హ నటనకు ప్రశంసలు అందాయి. ఇప్పుడు తన రెండో సినిమాగా ‘దేవర’ లో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మూవీలో అర్హ జాన్వీ కపూర్ చిన్నప్పటి వెర్షన్ లో కనిపించనున్నట్లు చెబుతున్నారు. అంటే మూవీలో ఏదైనా పవర్ఫుల్ ఫ్లాష్ బ్యాక్ ఉండబోతోందని, అందుకే అల్లు అర్హను తీసుకున్నారని తెగ మురిసిపోతూ ఈ విషయాన్ని అందరికీ షేర్ చేస్తున్నారట అల్లు అభిమానులు. అల్లు అర్హ ‘దేవర’ లో నటించిందనే విషయాన్ని మూవీ టీమ్ అయితే ఇప్పటి వరకూ అధికారికంగా ప్రకటించలేదు. మరి ఈ విషయం పై మేకర్స్ ఎలాంటి ప్రకటన ఇస్తారో చూడాలి. 

అల్లు అర్హ రెమ్యూనరేషన్ పై చర్చ..

మొదటి సినిమా ‘శాకుంతలం’ తోనే అందరి దృష్టినీ ఆకట్టుకుంది అల్లు అర్హ. తన ముద్దు ముద్దు మాటలతో ఎంతో మంది హృదయాలను దోచుకొని ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుందీ చిన్నారి. ఇప్పుడు అర్హ ‘దేవర’ సినిమాలో నటిస్తుందని తెలియగానే దీనిపై సోషల్ మీడియాలో కూడా చర్చ మొదలైంది. ఈ మూవీలో అల్లు అర్హ నిమిషానికి రూ.2 లక్షలు పారితోషికం ఇచ్చారనే టాక్ నడుస్తోంది. మూవీలో అర్హ పాత్ర దాదాపు 10 నిమిషాల నిడివి ఉంటుందని, ఆ లెక్కన రూ.20 లక్షలు రెమ్యూనరేషన్ అందుకుంటుందనే టాక్ కూడా నడుస్తోంది. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు గానీ ఈ వార్తలు మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మరి మూవీలో అల్లు అర్హ పాత్ర ఎలా ఉండబోతుందో చూడాలి. 

ఇక ‘దేవర’ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్‌, షైన్ టామ్ చాకో లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌తో కలిసి యువసుధ ఆర్ట్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తోంది. ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ ఈ మూవీకు సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ మూవీను ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 

Also Read: ‘ప్రాజెక్ట్ K’ నుంచి అదిరిపోయే అప్ డేట్- టైటిల్, గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Assembly: 'నువ్వేమన్నా డిప్యూటీ లీడర్‌వా?' - హరీష్ రావుపై మంత్రి కోమటిరెడ్డి తీవ్ర ఆగ్రహం, అసెంబ్లీలో మాటల యుద్ధం
'నువ్వేమన్నా డిప్యూటీ లీడర్‌వా?' - హరీష్ రావుపై మంత్రి కోమటిరెడ్డి తీవ్ర ఆగ్రహం, అసెంబ్లీలో మాటల యుద్ధం
Today Headlines: రాజధాని అమరావతి నిర్మాణంపై బిగ్ అప్‌డేట్ - రాహుల్‌కు కేటీఆర్ లేఖ, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
రాజధాని అమరావతి నిర్మాణంపై బిగ్ అప్‌డేట్ - రాహుల్‌కు కేటీఆర్ లేఖ, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
ఎన్టీఆర్ ఘాట్ జొలిస్తే అంతే సంగతులు - కాంగ్రెస్‌కు బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల స్ట్రాంగ్ వార్నింగ్
BRS On NTR: ఎన్టీఆర్ ఘాట్ జొలిస్తే అంతే సంగతులు - కాంగ్రెస్‌కు బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల స్ట్రాంగ్ వార్నింగ్
Pawan Kalyan: నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం -  కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం - కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలునా కామెంట్స్‌ని ట్విస్ట్ చేశారు, అంబేడ్కర్ వివాదంపై అమిత్ షాMumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Assembly: 'నువ్వేమన్నా డిప్యూటీ లీడర్‌వా?' - హరీష్ రావుపై మంత్రి కోమటిరెడ్డి తీవ్ర ఆగ్రహం, అసెంబ్లీలో మాటల యుద్ధం
'నువ్వేమన్నా డిప్యూటీ లీడర్‌వా?' - హరీష్ రావుపై మంత్రి కోమటిరెడ్డి తీవ్ర ఆగ్రహం, అసెంబ్లీలో మాటల యుద్ధం
Today Headlines: రాజధాని అమరావతి నిర్మాణంపై బిగ్ అప్‌డేట్ - రాహుల్‌కు కేటీఆర్ లేఖ, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
రాజధాని అమరావతి నిర్మాణంపై బిగ్ అప్‌డేట్ - రాహుల్‌కు కేటీఆర్ లేఖ, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
ఎన్టీఆర్ ఘాట్ జొలిస్తే అంతే సంగతులు - కాంగ్రెస్‌కు బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల స్ట్రాంగ్ వార్నింగ్
BRS On NTR: ఎన్టీఆర్ ఘాట్ జొలిస్తే అంతే సంగతులు - కాంగ్రెస్‌కు బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల స్ట్రాంగ్ వార్నింగ్
Pawan Kalyan: నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం -  కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం - కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
BJP MP Pratap Sarangi Injured: రాహుల్ గాంధీ నెట్టేశారు- గాయపడ్డ బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణ- పార్లమెంట్ వద్ద గందరగోళం
రాహుల్ గాంధీ నెట్టేశారు- గాయపడ్డ బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణ- పార్లమెంట్ వద్ద గందరగోళం
One Nation One Election JPC: జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
Telangana News: ప్రాణాలు తీస్తున్న పాములు- కొరికి చిత్ర వధ చేస్తున్న ఎలుకలు- తెలంగాణ గురుకులాల్లో భయానక పరిస్థితులు  
ప్రాణాలు తీస్తున్న పాములు- కొరికి చిత్ర వధ చేస్తున్న ఎలుకలు- తెలంగాణ గురుకులాల్లో భయానక పరిస్థితులు  
Amit Shah: అమిత్‌షాపై విపక్షాల అంబేద్కర్ అస్త్రం- సర్వత్రా విమర్శలు - సంజాయిషీ ఇచ్చుకున్న అమిత్‌షా 
అమిత్‌షాపై విపక్షాల అంబేద్కర్ అస్త్రం- సర్వత్రా విమర్శలు - సంజాయిషీ ఇచ్చుకున్న అమిత్‌షా 
Embed widget