అన్వేషించండి

Allu Arjun's Pushpa 2 : 'పుష్ప 2' రిలీజ్ సెంటిమెంట్ - మళ్ళీ క్రిస్మస్ టార్గెట్?

Pushpa 2 Update : 'పుష్ప 2' ఇంకా సెట్స్ మీదకు వెళ్ళలేదు. కానీ, విడుదల తేదీ విషయంలో ఆల్రెడీ ఓ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. సెంటిమెంట్ ఫాలో అవుతూ మళ్ళీ క్రిస్మస్ సీజన్‌కు రావాలనుకుంటున్నారట.  

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా నటించనున్న తాజా సినిమా 'పుష్ప 2' (Pushpa 2 The Rule). నటించనున్న అని ఎందుకు అనాల్సి వస్తుందంటే... ఇంకా షూటింగ్ స్టార్ట్ కాలేదు. త్వరలో సెట్స్ మీదకు వెళ్ళనున్నారు. అయితే... ఓ ప్లాన్ ప్రకారం ముందుగా ఏమేం చేయాలో షెడ్యూల్ వేసుకున్నారట. షూటింగ్ స్టార్ట్ చేయడానికి రిలీజ్ సీజన్ ఫిక్స్ చేశారట!

మళ్ళీ క్రిస్మస్ సీజన్‌లో... 
'పుష్ప' డిసెంబర్‌లో విడుదలైంది. క్రిస్మస్ సీజన్ కంటే ఓ వారం ముందు థియేటర్లలోకి వచ్చింది. ఈసారి కూడా అదే విధంగా రావాలని అల్లు అర్జున్ అండ్ కో ప్లాన్ చేస్తున్నారట. ఈసారి 'పుష్ప 2'ను క్రిస్మస్ వీకెండ్ థియేటర్లలోకి తీసుకు వచ్చేలా సన్నాహాలు జరుగుతున్నాయట. వచ్చే ఏడాది (2023లో) డిసెంబర్ లో 'పుష్ప 2' విడుదల చేయాలనేది ప్రస్తుతానికి ఉన్న ప్లాన్. 
 
బ్యాంకాక్‌లో రెండు వారాలు...
Pushpa 2 Regular Shoot Update : 'పుష్ప 2' షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ కావాల్సింది. ఫస్ట్ పార్ట్ సక్సెస్ సాధించడంతో రెండు పార్ట్ కోసం ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఎక్కువ చేశారు. అది కంప్లీట్ కావడంతో వచ్చే వారం సెట్స్ మీదకు వెళుతున్నారు. బ్యాంకాక్‌లో రెండు వారాలు షెడ్యూల్ ప్లాన్ చేశారు. అక్కడ అడవుల్లో కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. ఆల్రెడీ దర్శకుడు సుకుమార్ బ్యాంకాక్ వెళ్లారని తెలిసింది. 30 శాతం సినిమా బ్యాంకాక్ అడవుల్లో షూటింగ్ చేయనున్నారు. ఫ్రెండ్ పెళ్లి కోసం సౌత్ ఆఫ్రికా వెళ్లిన అల్లు అర్జున్, అక్కడ నుంచి నేరుగా బ్యాంకాక్ వెళతారట. అదీ ప్లాన్!

బడ్జెట్ ఎంతైనా ఓకే!
'ఊర్వశివో రాక్షసివో' సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్‌లో ''ఇప్పుడు నన్ను అందరూ పుష్ప గురించి అడుగుతున్నారు. వారికి చిన్న అప్ డేట్ ఇస్తా... 'పుష్ప 1' తగ్గేదే లే అయితే 'పుష్ప 2' అస్సలు తగ్గేదేలే. నేనూ ఈ సినిమా కోసం ఎగ్జైట్‌మెంట్‌తో వెయిట్ చేస్తున్నాను'' అని బన్నీ చెప్పారు. బడ్జెట్ విషయంలో నిర్మాతలు కూడా అదే మాట అంటున్నారట. 

మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, యలమంచలి రవిశంకర్ 'పుష్ప 2' ప్రొడ్యూస్ చేస్తున్నారు. 'పుష్ప' నిర్మాతలు కూడా వారే. 'పుష్ప' కంటే ముందు సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా 'రంగస్థలం' నిర్మించారు. వాళ్ళకు దర్శకుడితో మంచి గురి కుదిరింది. 'పుష్ప 2' మీద భారీ అంచనాలు ఉండటంతో ఖర్చు విషయంలో రాజీ పడకూడదని నిర్ణయించుకున్నారట. 

Also Read : నేను ఒక్కరోజు టైమ్ తీసుకుంటా! కానీ, 'యశోద'కు... : సమంత ఇంటర్వ్యూ

అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా (Rashmika Mandanna) కథానాయికగా...  ఫహాద్ ఫాజిల్ (Fahad Fazil), అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj), సునీల్ తదితరులు 'పుష్ప 2'లో కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 'పుష్ప' విడుదలైన తర్వాత 'తగ్గేదే లే' పాపులర్ అయ్యింది. ఇప్పుడు 'అస్సలు తగ్గేదే లే' అంటున్నారు. 'తగ్గేదే లే'తో పాటు 'ఊ అంటావా మావ ఊఊ అంటావా' సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. అందులో సమంత (Samantha)తో అల్లు అర్జున్ వేసిన స్టెప్పులు సిగ్నేచర్ మూమెంట్స్ అయ్యాయి. చాలా షోల్లో కాపీ చేస్తున్నారు. మరి, 'పుష్ప 2' కోసం దేవి శ్రీ ప్రసాద్ ఎటువంటి ఐటమ్ సాంగ్ కంపోజ్ చేస్తారో? అని అందరూ వెయిట్ చేస్తున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CM Vijay Condoles Ajith: అజిత్ ఇంటికి సీఎం విజయ్... వెంట త్రిష కూడా... ఆప్త మిత్రుడికి పరామర్శ
అజిత్ ఇంటికి సీఎం విజయ్... వెంట త్రిష కూడా... ఆప్త మిత్రుడికి పరామర్శ
Anshu Reddy: బుల్లితెరపై రాణిస్తున్న తెలుగింటి అందం.. అన్షురెడ్డి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
బుల్లితెరపై రాణిస్తున్న తెలుగింటి అందం.. అన్షురెడ్డి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
Dasari Narayana Rao: దాసరి కొడుకులు ఎక్కడ? ఇంత జరిగినా బయటకు రాలేదే?? నోరు విప్పలేదే???
దాసరి కొడుకులు ఎక్కడ? ఇంత జరిగినా బయటకు రాలేదే?? నోరు విప్పలేదే???
Ram Charan : సీఎం విజయ్‌ను చూసి గర్వ పడుతున్నా - పెద్ది ఈవెంట్‌లో దళపతిపై రామ్ చరణ్ ప్రశంసలు
సీఎం విజయ్‌ను చూసి గర్వ పడుతున్నా - పెద్ది ఈవెంట్‌లో దళపతిపై రామ్ చరణ్ ప్రశంసలు

వీడియోలు

GT vs RR Qualifier 2 Highlights IPL 2026 | ఐపీఎల్ ఫైనల్‌కు గుజరాత్ టైటాన్స్
Vaibhav Sooryavanshi 96 Runs Highlights IPL 2026 | వైభవ్ సూర్యవంశీని వెంటాడిన దురదృష్టం
Riyan Parag about Vaibhav IPL 2026 | రాజస్థాన్‌కు రెండో టైటిల్ తెచ్చేది వైభవే
Hardik Pandya Leaves Mumbai Indians | ముంబైని వీడి CSKలోకి హార్దిక్ ఎంట్రీ?
Sai Sudharsan Hit Wicket In IPL 2026 | వరుసగా రెండు మ్యాచ్‌ల్లో హిట్ వికెట్ అయిన సాయి సుదర్శన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Abhishek Banerjee Attack: బెంగాల్‌లో ట్రీట్మెంట్ అందడం లేదు.. అవసరమైతే అభిషేక్ బెనర్జీని హైదరాబాద్‌కు తరలిస్తాం: మమతా బెనర్జీ
బెంగాల్‌లో ట్రీట్మెంట్ అందడం లేదు.. అవసరమైతే అభిషేక్ బెనర్జీని హైదరాబాద్‌కు తరలింపు: మమతా బెనర్జీ
Karnataka New CM DK Shivakumar: సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నిక ఏకగ్రీవం.. జూన్ 3న కర్ణాటక సీఎంగా ప్రమాణం
సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నిక ఏకగ్రీవం.. జూన్ 3న కర్ణాటక సీఎంగా ప్రమాణం
e- Shram Card 2026: అసంఘటిత రంగాల్లోని కార్మికులకు రూ.2 లక్షల బీమా.. ఇ-శ్రమ్ కార్డు ప్రయోజనాలు, దరఖాస్తు విధానం
అసంఘటిత రంగాల్లోని కార్మికులకు రూ.2 లక్షల బీమా.. ఇ-శ్రమ్ కార్డు ప్రయోజనాలు, దరఖాస్తు విధానం
Drinker Sai OTT: ట్రెండింగ్‌లో 'డ్రింకర్ సాయి'... ఓటీటీలో ధర్మ మహేష్ సినిమా ఫ్రీ ఫ్రీ ఫ్రీ... రెస్పాన్స్ సూపర్
ట్రెండింగ్‌లో 'డ్రింకర్ సాయి'... ఓటీటీలో ధర్మ మహేష్ సినిమా ఫ్రీ ఫ్రీ ఫ్రీ... రెస్పాన్స్ సూపర్
PM SETU Scheme: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
CM Vijay Condoles Ajith: అజిత్ ఇంటికి సీఎం విజయ్... వెంట త్రిష కూడా... ఆప్త మిత్రుడికి పరామర్శ
అజిత్ ఇంటికి సీఎం విజయ్... వెంట త్రిష కూడా... ఆప్త మిత్రుడికి పరామర్శ
IPL Best Ever Opening Pair: టోర్నీ హిస్టరీలోనే గిల్, సాయి సుదర్శన్ బెస్ట్ ఓపెనింగ్ జోడీ..  ఫైనల్స్ లో వాళ్ల‌కే ఛాన్స్ ఎక్కువ.. మాజీ క్రికెట‌ర్ అనాల‌సిస్
టోర్నీ హిస్టరీలోనే గిల్, సాయి సుదర్శన్ బెస్ట్ ఓపెనింగ్ జోడీ..  ఫైనల్స్ లో వాళ్ల‌కే ఛాన్స్ ఎక్కువ..
Kurnool Tragedy: కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
Embed widget