Alia Bhatt: తెలుగులో పాట పాడిన అలియా, అద్భుతమంటూ నెటిజన్లు ఫిదా!
బాలీవుడ్ ప్రతిష్టాత్మక సినిమా ‘బ్రహ్మస్త్ర‘ ప్రమోషన్ కార్యక్రమం తాజాగా హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలియా భట్ తెలుగులో అద్భుతంగా పాట పాడి అందర్నీ ఆశ్చర్యపరిచింది.
రణ్ బీర్ ఆలియా భట్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న తాజా సినిమా ‘బ్రహ్మస్త్ర‘. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రూపొందుతుంది. పూర్తి స్థాయి సోషియో ఫాంటసీ సినిమాగా తెరెక్కుతున్నది. ఈ చిత్రాన్ని మూడు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు సినిమా యూనిట్ ప్రకటించింది. ఇందులో మొదటి భాగం బ్రహ్మాస్త పార్ట్-1ను సెప్టెంబర్ 9న థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నది. ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ జోరుగా కొనసాగుతున్నాయి. ఫస్ట్ లుక్ పోస్టర్స్ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి. తాజాగా విడుదలైన సినిమా ట్రైలర్ విజువల్ వండర్ గా తెరకెక్కింది. సినిమాపై అంచనాలను భారీగా పెంచింది.
ఆకట్టుకున్న ఆలియా తెలుగు పాట
అటు రామోజీ ఫిల్మ్ సిటీలోఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలి అనుకున్నా.. పోలీసులు పలు కారణాలతో అనుమతి ఇవ్వలేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి, నటుడు ఎన్టీఆర్, నాగార్జునతో కలిపి బ్రహ్మాస్త సినిమా యూనిట్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ఆలియా పాడిన పాట సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. బ్రహ్మస్త్ర చిత్రంలోని ‘‘కుంకుమలా నువ్వే చేరగా ప్రియా’’ అనే పాటను తెలుగులో చక్కగా పాడింది. ఆమె పాటకు అక్కడున్నవాళ్లంతా ఆశ్చర్యపోయారు. చప్పట్లు కొడుతూ సంతోషం వ్యక్తం చేశారు. బాలీవుడ్ హీరోయిన్ అయిన ఆలియా తెలుగులో అద్భుతంగా పాడటం పట్ల నెటిజన్లు ఫిదా అవుతున్నారు. తెలుగులో ఈ పాటను ప్రముఖ సింగర్ సిద్ శ్రీరామ్ పాడారు. ఈ పాట ఇప్పటికే ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
విజువల్ వండర్ గా సెకెండ్ సింగిల్
విడుదలకు సిద్ధమయిన ఈ సినిమా నుంచి తాజాగా సెకెండ్ సింగిల్ విడుదల చేశారు. ‘దేవ దేవ’ అంటూ సాగే ఈ పాట.. ఎంతో అద్భుతంగా ఉంది. ఆకట్టుకునే విజువల్స్ అందరినీ అలరిస్తున్నాయి. బ్రహ్మస్త్ర సినిమాను స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, స్టార్‌లైట్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్నది. కరణ్ జోహార్, రణ్‌బీర్ కపూర్, అయాన్ ముఖర్జీ, అపూర్వ మెహతా, నమిత్ మల్హోత్రా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సోసియో ఫాంటసీ సినిమాలో మౌని రాయ్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. ప్రీతమ్ సంగీతం అందిస్తున్నారు. అన్ని సౌత్ లాంగ్వేజెస్ లో ఈ సినిమాను దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సమర్పిస్తున్నారు.
కొనసాగుతున్న బాయ్ కాట్ భయం
ప్రస్తుతం బాలీవుడ్ లో బాయ్ కాట్ ట్రెండ్ జోరుగా కొనసాగుతుంది. కరణ్ జోహార్ సినిమాలు అంటేనే నెటిజన్లు తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. తాజాగా ఆలియా భట్ సైతం బాయ్ కాట్ బాలీవుడ్ వివాదంలో చిక్కుకుంది. ఆమెపై నెటిజన్లు ఓ రేంజిలో విరుచుకుపడ్డారు. తాజాగా విడుదలైన పలు సినిమాలు బాయ్ కాట్ ప్రచారంతో తీవ్ర స్థాయిలో నష్టపోయాయి. ఈ సినిమా విషయంలోనూ నిర్మాతల్లో భయం నెలకొంది.