Mirzapur season 3: ‘మీర్జాపూర్’ సీజన్ 3 అప్‌డేట్ - ఎమోషనల్ పోస్టుతో గుడ్డూ భయ్యా గుడ్ న్యూస్!
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న మీర్జాపూర్ మూడో సీజన్ గురించి లేటెస్ట్ అప్డేట్ వచ్చేసింది. మీర్జాపూర్ మూడో సీజన్ షూటింగ్ పూర్తయిందని సిరీస్ లో ప్రధాన పాత్రలో నటించిన అలీ ఫజల్ కీలక ప్రకటన చేశాడు.
ప్రస్తుతం వెబ్ సిరీస్ ల హవా నడుస్తోంది. ఓటీటీలు వచ్చిన తర్వాత వెబ్ సిరీస్ లకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. వాటిల్లో కొన్ని డిజిటల్ వేదికపై సత్తా చాటుతున్నాయి. అలాంటి వాటిల్లో ‘మీర్జాపూర్’ ఒకటి. ఈ వెబ్ సిరీస్ గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. క్రైమ్, థ్రిల్లర్, యాక్షన్ ఎంటర్టైనర్ గా ‘అమేజాన్ ప్రైమ్ వీడియో’లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ కు సంబంధించి రెండు సీజన్ లు పూర్తయ్యాయి. ఈ రెండు సీజన్లు సూపర్ సక్సెస్‌ను అందుకున్నాయి. త్వరలో మూడో సీజన్ కూడా స్ట్రీమింగ్ కానుంది.
ఇటీవలే ఈ తాజా సీజన్ షూటింగ్ పూర్తయ్యింది. ఈ సీరిస్‌లో ప్రధాన పాత్ర పోషిస్తున్న అలీ ఫజల్(గుడ్డూ భయ్యా) ఈ విషయాన్ని వెల్లడించాడు. వెబ్ సిరీస్‌లో నటించిన టీమ్ తో కలసి దిగిన ఫొటో, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. సీజన్ 3 షూటింగ్ పూర్తైందని తెలిపాడు. మీర్జాపూర్ కోసం చిత్ర యూనిట్ చేస్తున్న కృషికి ధన్యవాదాలు తెలుపుతున్నానని, ఈ మూడో సీజన్ కూడా తనకు భిన్నమైన అనూభూతిని కలిగించిందన్నాడు. ఈ సీజన్ లో గోలు పాత్ర కు సంబంధించి శ్వేతా త్రిపాటి సోషల్ మీడియా ద్వారా అప్డేట్ ఇచ్చింది. సీజన్ 3 స్క్రిప్ట్ చదివిన తర్వాత తాను షూటింగ్ స్టార్ట్ అయ్యే వరకూ ఉండలేకపోయానని, ఇప్పుడు షూటింగ్ పూర్తి అయిందని, ఇప్పుడు సీజన్ రిలీజ్ అయ్యేవరకూ ఉండలేకపోతున్నానని, త్వరలోనే మిమ్మల్ని చేరుకుంటాను అంటూ షూటింగ్ స్పాట్ లోని వీడియోను షేర్ చేసింది. దీంతో ఈ సీజన్ పై ఉత్కంఠ నెలకొంది. 2023 లో సీజన్ 3 ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ వెబ్ సిరీస్ ఉత్తర ప్రదేశ్ లోని మీర్జాపూర్ అనే ప్రాంతం నేపథ్యంలో రూపొందించారు. దీని మొదటి సీజన్ 2018 లో నవంబర్ 16న విడుదలైంది. ఇందులో కొన్ని సన్నివేశాలు, డైలాగ్స్ శృతి మించి ఉన్నా.. ఓవరాల్ గా ప్రేక్షకులను ఆకట్టుకుంది. మొదట హిందీలో మాత్రమే ఈ వెబ్ సిరీస్ ను విడుదల చేశారు. రిలీజ్ తర్వాత విపరీతమైన క్రేజ్ రావడంతో ఇతర భాషల్లో కూడా అనువాదించారు. అన్ని చోట్లా కూడా ఈ వెబ్ సిరీస్ సూపర్ హిట్ అయ్యింది. దీనికి కొనసాగింపుగా రెండో సీజన్ ను 2020 అక్టోబరు 23న రిలీజ్ చేశారు. రెండు సీజన్లు కూడా మంచి హిట్ సాధించడంతో మూడో సీజన్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇందులో శ్వేతా త్రిపాఠి, దివ్యేందు శర్మ, అలీ ఫజల్, శ్రియ పిల్గోంగర్, హర్షిత గౌర్ తదితరులు నటించారు. ముఖ్యంగా ఇందులోని మున్నా భయ్యా, గుడ్డూ భయ్యా, అఖండానంద్ పాత్రలు అందరికీ గుర్తుండిపోతాయి.
View this post on Instagram
View this post on Instagram