Rakshabandhan: 'రక్షాబంధన్' ట్రైలర్ - ఫ్యామిలీ ఎమోషన్స్ పీక్స్
అక్షయ్ కుమార్ నటించిన 'రక్షాబంధన్' సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.
బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ఓ పక్క కమర్షియల్ సినిమాలు చేస్తూనే.. మరోపక్క ప్రయోగాత్మక, సందేశాత్మక సినిమాలు చేస్తుంటారాయన. ఆయన ఎన్నుకునే కథల కాన్సెప్ట్స్ ఆకట్టుకునే విధంగా ఉంటాయి. ఏడాదికి రెండు, మూడు సినిమాలతో అలరించే ఈ హీరో ఇప్పటికే 'పృథ్వీరాజ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఇప్పుడు ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో ఆయన నటించిన 'రక్షాబంధన్' చిత్రాన్ని ఆగస్టులో రిలీజ్ చేయాలనుకుంటున్నారు.
ఆగస్టు 11న రక్షాబంధన్ కానుకగా ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టారు. తాజాగా ట్రైలర్ ను విడుదల చేశారు. ఒక అన్నయ్య, నలుగురు సిస్టర్స్ స్టోరీ ఇది. సినిమాలో అక్షయ్ చిన్న వ్యాపారం చేస్తుంటారు. తన నలుగురు చెల్లెళ్లకు మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయడమే అతడి లక్ష్యం. కానీ ఆ నలుగురు ఒక్కో రకం. అన్నయ్యకి చుక్కలు చూపిస్తుంటారు.
మరోపక్క హీరోయిన్ భూమి పెడ్నేకర్.. అక్షయ్ తో పెళ్లి ఎప్పుడు జరుగుతుందా..? అని ఎదురుచూస్తుంటుంది. అతడు మాత్రం చెల్లెళ్ల పెళ్లిళ్లు అయిన తరువాతే పెళ్లి చేసుకుంటానని ఫిక్స్ అవుతాడు. ఈ క్రమంలో అతడు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడనేదే సినిమా కథ. ట్రైలర్ ని ఫన్నీగా, ఎమోషనల్ గా కట్ చేశారు. ఈ సినిమాతో కట్నం కాన్సెప్ట్ ను టచ్ చేయబోతున్నారు అక్షయ్ కుమార్. అలా చూసుకుంటే కచ్చితంగా సినిమాలో మెసేజ్ ఉందనే అనిపిస్తుంది. మరి సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి!
Also Read : శోభితతో నాగచైతన్య డేటింగ్ - సమంత పుట్టించిన పుకారేనా?
Also Read : తక్కువ అంచనా వేయకండి - బాలకృష్ణ హీరోయిన్‌కు కరోనా
View this post on Instagram