Agent Movie: వైజాగ్ పోర్ట్ లో 'ఏజెంట్' షూటింగ్ - భారీ యాక్షన్ కి అఖిల్ రెడీ

'ఏజెంట్' సినిమా షూటింగ్ కొత్త షెడ్యూల్ వైజాగ్ పోర్ట్ లో మొదలైయింది. ఈ షెడ్యూల్ లో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ని చిత్రీకరించనున్నారు.

FOLLOW US: 

అక్కినేని అఖిల్ హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తరువాత సక్సెస్ కోసం చాలా పరితపించారు. కానీ ఆయన నటించిన సినిమాలన్నీ ఏవరేజ్ గా ఆడాయి. ఎట్టకేలకు తన నాల్గో సినిమా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'తో హిట్ అందుకున్నాడు. ఈ సినిమా మంచి వసూళ్లను కూడా రాబట్టింది. ఇంతకాలానికి హిట్ దక్కడంతో దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో పడ్డాడు ఈ యంగ్ హీరో.

తన కొత్త సినిమా 'ఏజెంట్'తో మాస్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. వక్కంతం వంశీ అందించిన కథతో దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. ఇందులో అఖిల్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో కనిపించనున్నాడు. దానికి తగ్గట్లే కొత్త లుక్ లో కనిపించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్వైజాగ్ పోర్ట్ లో జరుగుతోంది. ఈ షెడ్యూల్ లో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ని చిత్రీకరించనున్నారు.

షూటింగ్ లో భాగంగా వైజాగ్ చేరుకున్న హీరో అఖిల్ కు ఎయిర్ పోర్ట్ లో అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అఖిల్ ని చూడటానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ఫ్యాన్స్ బైక్ భారీ ర్యాలీ నిర్వహించి తమ అభిమానం చాటుకున్నారు. 
హై వోల్టేజ్ స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ను ఆగస్టు 12న విడుదల చేయబోతున్నారు. ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌పై అనీల్ సుంక‌ర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ స్పై థ్రిల్ల‌ర్‌లో అఖిల్ జోడీగా సాక్షి వైద్య న‌టిస్తుంది. ఈ సినిమా మలయాళ నటుడు మమ్ముట్టి కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి హిప్ హాప్ తమిజా సంగీతం అందించగా, రసూల్ ఎల్లోర్ ఛాయాగ్రహకుడిగా పని చేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్‌గా, అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.

View this post on Instagram
 
A post shared by AK Entertainments (@akentsofficial)

Published at : 11 Apr 2022 08:14 PM (IST) Tags: Akhil Agent Movie Surendar reddy AK Entertainments

సంబంధిత కథనాలు

Samudram Chittabbai: చక్కని విలేజ్ ప్రేమ కథ ‘సముద్రం చిట్టబ్బాయి’, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Samudram Chittabbai: చక్కని విలేజ్ ప్రేమ కథ ‘సముద్రం చిట్టబ్బాయి’, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Escaype Live Review: ‘ఎస్కేప్ లైవ్’ రివ్యూ - వాస్తవాలను కళ్లకు కట్టేలా సిద్ధార్థ్ వెబ్‌ సీరిస్, ఇదో ‘వైరల్’ ఆట!

Escaype Live Review: ‘ఎస్కేప్ లైవ్’ రివ్యూ - వాస్తవాలను కళ్లకు కట్టేలా సిద్ధార్థ్ వెబ్‌ సీరిస్, ఇదో ‘వైరల్’ ఆట!

Bigg Boss 6 Telugu: ‘బిగ్ బాస్’ సీజన్-6లోకి సామాన్యులకు అవకాశం, నాగ్ ఆహ్వానం

Bigg Boss 6 Telugu: ‘బిగ్ బాస్’ సీజన్-6లోకి సామాన్యులకు అవకాశం, నాగ్ ఆహ్వానం

Thank You Teaser: నాగ చైతన్య ‘థాంక్యూ’ టీజర్, లైఫ్‌లో ఇక కాంప్రమైజ్ అయ్యేదే లేదంటున్న చైతు!

Thank You Teaser: నాగ చైతన్య ‘థాంక్యూ’ టీజర్, లైఫ్‌లో ఇక కాంప్రమైజ్ అయ్యేదే లేదంటున్న చైతు!

Karan Johar New Movie: రూట్ మార్చిన బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ - 'ఆర్ఆర్ఆర్', 'కెజియఫ్ 2'  విజయాలే కారణమా?

Karan Johar New Movie: రూట్ మార్చిన బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ - 'ఆర్ఆర్ఆర్', 'కెజియఫ్ 2'  విజయాలే కారణమా?
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి

Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి

Bandi Sanjay Sensational Comments: తెలంగాణలో మసీదులన్నీ తవ్వాలి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay Sensational Comments: తెలంగాణలో మసీదులన్నీ తవ్వాలి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Income Earners: నెలకు రూ.25వేలు జీతమా! కంగ్రాట్స్‌ - ఇండియా టాప్‌-10లో ఉన్నట్టే!

Income Earners: నెలకు రూ.25వేలు జీతమా! కంగ్రాట్స్‌ - ఇండియా టాప్‌-10లో ఉన్నట్టే!

MLC Suspend YSRCP : ఎమ్మెల్సీ అనంతబాబు సస్పెండ్ - కీలక నిర్ణయం తీసుకున్న వైఎస్ఆర్‌సీపీ !

MLC Suspend YSRCP :  ఎమ్మెల్సీ అనంతబాబు సస్పెండ్ - కీలక నిర్ణయం తీసుకున్న వైఎస్ఆర్‌సీపీ !