Unstoppable: బాలయ్య షోలో 'అఖండ' టీమ్.. రేపే ప్రోమో..
బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న 'అన్ స్టాపబుల్' టాక్ షోకి అతిథులుగా 'అఖండ' టీమ్ వచ్చింది.
నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న 'అన్ స్టాపబుల్' టాక్ షోకి అతిథులుగా 'అఖండ' టీమ్ వచ్చింది. ఈ విషయాన్ని 'ఆహా' సంస్థ అఫీషియల్ గా వెల్లడించింది. అంతేకాదు.. కొన్ని ఫొటోలను కూడా షేర్ చేసింది. రేపు ఉదయం ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో రాబోతుంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే టీమ్ మొత్తం బాలయ్య షోకి వచ్చినట్లు తెలుస్తోంది.
ఈ టాక్ షోలో దర్శకుడు బోయపాటి శ్రీను, హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, శ్రీకాంత్ పాల్గొన్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు 'అఖండ' సినిమాలో సాంగ్ పాడిన కృష్ణచైతన్య, గీతామాధురి కూడా ఈ టాక్ షోలో కనిపించనున్నారు. మరి వీరంతా కలిసి ఈ షోలో ఎంత అల్లరి చేశారో తెలియాలంటే ఎపిసోడ్ రిలీజ్ అయ్యేవరకు ఆగాల్సిందే.
ఇటీవల విడుదలైన 'అఖండ' సినిమాకి అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి భారీ రెస్పాన్స్ వస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. ఓవర్సీస్ కూడా ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. తొలి షో నుంచే భారీ కలెక్షన్స్ ను సాధిస్తూ రికార్డు సృష్టిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ తరువాత విడుదలైన సినిమాల్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా 'అఖండ' నిలిచింది.
The stars of #Akhanda are here on #UnstoppableWithNBK to celebrate their blockbuster success 💥
— ahavideoIN (@ahavideoIN) December 5, 2021
Ep-4 Promo releasing tomorrow at 11:30 AM.#NandamuriBalakrishna #BoyapatiSreenu @MusicThaman @actorsrikanth @ItsMePragya @geethasinger #SriKrishna pic.twitter.com/hKTv6p6tN2
Also Read:ఎయిర్ పోర్ట్ లో హీరోయిన్ ను అడ్డుకున్న అధికారులు.. కారణమిదే..
Also Read: 'హరిహర వీరమల్లు'.. జాక్వెలిన్ అవుట్.. నర్గీస్ ఫక్రీ ఇన్..
Also Read: బాలీవుడ్ లో 'అఖండ' రీమేక్.. హీరో ఎవరంటే..?
Also Read: అనసూయ ఇంట్లో విషాదం... తండ్రిని కోల్పోయిన స్టార్ యాంకర్
Also Read: అమ్మాయిలను ఎప్పుడూ అలా చూడలేదా? ఇతర మహిళలకు లేనిది ఏమైనా నాకుందా? - పాయల్ బోల్డ్ రియాక్షన్
Also Read: సిరివెన్నెలకు నా ముద్దు, ఆర్జీవీ ఎమోషనల్ పోస్టు, పాట పాడి మరీ...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి