Suriya : అందమైన ఆలోచనలు కలిస్తే.. జ్యోతిక, మమ్ముట్టి సినిమాపై సూర్య ప్రశంసలు!
Suriya : మమ్ముట్టి, జ్యోతిక జంటగా నటించిన 'కాథల్ ది కోర్' మూవీపై కోలీవుడ్ హీరో సూర్య సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపించారు.
Suriya On Kaathal The Core Movie : మలయాళంలో రీసెంట్ గా 'కన్నూర్ స్క్వాడ్' (Kannur Squad) మూవీ తో మంచి సక్సెస్ అందుకున్న మమ్ముట్టి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. కన్నూర్ స్కాడ్ వంటి సక్సెస్ తర్వాత మమ్ముట్టి నటించిన లేటెస్ట్ మూవీ 'కాథల్ ది కోర్'(Kaathal The Core). జో బేబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మమ్ముట్టి సరసన జ్యోతిక నటించింది. నవంబర్ 23న థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ మూవీకి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమా చూసిన సెలబ్రిటీలు సైతం ఇది చాలా గొప్ప సినిమా అంటూ సోషల్ మీడియాలో వరుస పోస్టులు పెడుతున్నారు.
తాజాగా ఈ సినిమాని వీక్షించిన కోలీవుడ్ అగ్ర హీరో సూర్య సోషల్ మీడియా వేదికగా ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించాడు. అందమైన ఆలోచనలు కలిసి వస్తే మనకు ‘కాథల్ ది కోర్ లాంటి సినిమాలు పుట్టుకొస్తాయని ఈ సందర్భంగా తెలిపారు సూర్య. " మంచి సినిమా పట్ల మమ్ముట్టి సార్ చూపించే ప్రేమ, గౌరవం, ఆయన ఇచ్చే స్ఫూర్తి ఎంతో అద్భుతం. ఇంత చక్కటి మెసేజ్ తో నిండి ఉన్న ఈ అందమైన సినిమాను అందించిన మమ్ముట్టి సార్ టీంకు నా హాట్సాఫ్. సినిమాలో నిశ్శబ్ద సన్నివేశాలు కూడా విలువల గురించి మాట్లాడతాయి. మాకు ఈ ప్రపంచాన్ని చూపించిన రైటర్స్ ఆదర్శ్ సుకుమారన్ అండ్ పౌల్సన్ స్కెరియాకు బెస్ట్ విషెస్" అని తెలిపారు.
ఇక చివర్లో 'నా ప్రియమైన జ్యోతిక తన ప్రేమతో అందరి హృదయాలని మరోసారి గెలుచుకుంది' అంటూ సూర్య తన ఇన్ స్టాగ్రామ్ లో రాసుకోచ్చారు. కాగా హీరో సూర్య చేసిన ఈ పోస్ట్ పై మమ్ముట్టి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.." సినిమా పట్ల మీరు చూపించిన లవ్ అండ్ సపోర్ట్ కి థాంక్యూ సూర్య సార్" అంటూ ట్వీట్ చేశారు. దీంతో కాథల్ ది కోర్ మూవీపై సూర్య చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. మరోవైపు సూర్య కంటే ముందు సమంత సైతం ఈ సినిమాపై పొగడ్తల వర్షం కురిపించింది. కాథల్ ది కోర్ సినిమా అద్భుతంగా ఉందని, ఈ ఏడాది బెస్ట్ మూవీ ఇదే అని, అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా అంటూ తన సోషల్ మీడియాలో పేర్కొంది.
ఇక 'కాథల్ ది కోర్'(Kaath The Core) మూవీ విషయానికొస్తే.. స్వలింగ సంపర్కుల పట్ల ఈ సొసైటీ ఎలా ప్రవర్తిస్తుంది అనే అంశాన్ని ఆధారంగా చేసుకుని డైరెక్టర్ జో బేబీ ఈ సినిమాని తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. దీంతో మలయాళం లో ఈ మూవీ డీసెంట్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. బ్యాంక్ రిటైర్ ఉద్యోగిగా జార్జ్ పాత్రలో మమ్ముట్టి నటించారు. ఆయన భార్యగా జ్యోతిక తన స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకుంది. ఇక సూర్య ప్రస్తుతం 'కంగువ'(Kanguva) అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో సాగనున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read : 'ఫ్యామిలీ స్టార్'లో రష్మిక క్యామియో - 'గీతా గోవిందం' మ్యాజిక్ రిపీట్!
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply
View this post on Instagram