By: ABP Desam | Updated at : 04 Feb 2022 12:14 PM (IST)
(Image credit: Instagram)
భిన్నమైన కథాంశాలతో సినిమాలను ఎంచుకునే హీరో అడివి శేష్. ఆయన గతంలో చేసిన సినిమాలన్నీ రొటీన్‌కు భిన్నమైనవే. క్షణం, గూఢచారి, ఎవరు సినిమాలు ప్రేక్షకులను చాలా ఆకట్టుకున్నాయి. సస్పెన్స్ క్రియేట్ చేసే మూవీల్లో చేసేందుకు ఇష్టపడతాడు అడివి శేష్. అందులో సున్నితమైన ప్రేమకథ కూడా ఉండేలా చూసుకుంటాడు. త్వరలో అతని సినిమా ‘మేజర్’ విడుదల కాబోతోంది. పాన్ ఇండియా మూవీగా ఇది రాబోతోంది. హిందీ, తెలుగు, మలయాళ భాషల్లో ఇది విడుదల కానుంది. ఈ సినిమాను ఈ ఏడాది మే 27 విడుదల చేయబోతున్నట్టు చిత్రయూనిట్ ప్రకటించింది.
నిజకథ ఆధారంగా...
మేజర్ సినిమాను సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా నిర్మిస్తున్నారు. సందీప్ 26/11 ముంబైలో జరిగిన తీవ్రవాద దాడుల్లో వీరమరణం పొందారు. తన ప్రాణాలను పణంగా పెట్టి ఎంతో మంది ప్రజలను కాపాడారు. సోనీ పిక్చర్స్, మహేష్ బాబు జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ కలిసి దీన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమానే గతేడాదే విడుదల చేయాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా వాయిదా వేశారు.
ఇందులో అడివి శేష్‌కు జోడీగా శోభితా ధూళిపాళ్ల, సాయి మంజ్రేకర్ నటిస్తున్నారు. తండ్రి ప్రకాష్ రాజ్, తల్లిగా రేవతి నటిస్తున్నారు. శశికిరణ్ తిక్కా దర్శకత్వం వహించారు.
[insta]
Tripti Dimri: నెట్టింట్లో త్రిప్తికి ఫుల్ క్రేజ్, ‘యానిమల్’ తర్వాత ఓ రేంజ్లో పెరిగిన ఇన్‌స్టా ఫాలోవర్స్!
Look Back 2023: పాపం... ఫస్ట్ సినిమాయే డిజాస్టర్ - ఈ అందగత్తెలకు కలిసిరాని 2023!
Bigg Boss 7 Telugu: దొరికిపోయిన శోభ, సారీ చెప్పనంటూ యావర్ మొండి పట్టుదల - క్లాస్ పీకిన నాగార్జున
Bigg Boss 7 Telugu: నువ్వేమైనా శివాజీ సేవకుడివా? అతడికి సేవలు చేయడానికే వచ్చావా? - ప్రశాంత్‌పై నాగ్ సీరియస్
Bigg Boss 7 Telugu: ఆడపిల్లలు అందరికీ నేనెందుకు సారీ చెప్పాలి? నాగార్జునతో శివాజీ వాదన, ‘బిగ్ బాస్’ హిస్టరీలో ఫస్ట్‌టైమ్ ఇలా!
Singareni Elections: సింగరేణి ఎన్నికల కోసం రాహుల్ గాంధీ, పోలింగ్ తేదీ ఖరారు - మంత్రి వెల్లడి
Balineni YSRCP : మంత్రిగా ఉన్నప్పుడు ఎవరైనా డబ్బులిస్తే తీసుకున్నా - వైసీపీ మాజీ మంత్రి బాలినేని సంచలన వ్యాఖ్యలు
Revanth Reddy Canvoy: ట్రాఫిక్‌లో ఇరుక్కున్న సీఎం రేవంత్ రెడ్డి, ఆయన కొత్త కాన్వాయ్ నంబర్ ఇదే
హైవేపై ఘోర ప్రమాదం, ట్రక్‌ని ఢీకొట్టిన కార్‌లో మంటలు - ఓ చిన్నారి సహా 8 మంది ఆహుతి
/body>