News
News
X

Hit 2 Movie: 'హిట్2' రిలీజ్ డేట్ ఫిక్స్ - అడివి శేష్‌కు మరో హిట్ వస్తుందా?

HIT The Second Case: అడివి శేష్ కథానాయకుడిగా నటించిన ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ 'హిట్ 2' రిలీజ్ ఎప్పుడంటే..?

FOLLOW US: 

అడివి శేష్(Adivi Sesh) కథానాయకుడిగా నటించిన ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ 'హిట్ 2' (HIT - Homicide Investigation Team). విశ్వక్ సేన్(Vishwak Sen) హీరోగా 2020లో వచ్చిన 'హిట్' చిన్న సినిమాగా వచ్చి పెద్ద సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్‌గా 'హిట్ 2'ని ఉంటుందని.. రిలీజ్ సమయంలోనే ప్రకటించారు. పార్ట్ 2లో కూడా విశ్వక్ సేన్ హీరోగా నటిస్తారని అనుకున్నారు. అయితే కొన్ని కారణాల దృష్ట్యా అడివి శేష్ హీరోగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

Adivi Sesh Hit 2 to release on December 2: శైలేష్ కొలను దర్శకత్వంలో వాల్ పోస్టర్ సినిమా పతాకంపై నేచురల్ స్టార్ నాని సమర్పణలో ప్రశాంత్ త్రిపిర్‌నేని 'హిట్' ఫ్రాంచైజీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మీనాక్షీ చౌదరి హీరోయిన్. మొదట జూలైలో ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కుదరలేదు. ఇప్పుడు డిసెంబర్ 2న సినిమా రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని చిత్రబృందం అఫీషియల్ గా వెల్లడించింది.  

మొదటి భాగంలో విక్రమ్ రుద్రరాజు పాత్రలో విశ్వక్ సేన్ నటించగా.. హైదరాబాద్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కింది. రెండో భాగం మాత్రం ఆంధ్రప్రదేశ్ బ్యాక్‌డ్రాప్‌లో రానుంది. ఈ హిట్ 2లో కృష్ణదేవ్ అలియాస్ కేడీ అనే పోలీస్ ఆఫీసర్ గా అడివిశేష్ కనిపించనున్నారు. 

కాగా.. ఇటీవల 'మేజర్' సినిమాతో ప్రేక్షకులను అలరించారు అడివి శేష్. ఈ సినిమాలో అడివిశేష్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ముంబై ఉగ్రదాడుల్లో కన్నుమూసిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. శశికిరణ్ తిక్కా దర్శకుడు. 20 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా భారీ లాభాలను తీసుకొచ్చింది. మరి 'హిట్2'తో శేష్ కి ఎలాంటి హిట్ వస్తుందో చూడాలి!

View this post on Instagram
 
A post shared by Sesh Adivi (@adivisesh)

Published at : 15 Sep 2022 05:37 PM (IST) Tags: Adivi Sesh HIT 2 Movie Hit 2 release date

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu: బాలాదిత్యకు నాగార్జున పంచ్, ఆ ఇద్దరినీ నేరుగా నామినేట్ చేసిన హోస్ట్ - శనివారం ఎపిసోడ్ హైలైట్స్!

Bigg Boss 6 Telugu: బాలాదిత్యకు నాగార్జున పంచ్, ఆ ఇద్దరినీ నేరుగా నామినేట్ చేసిన హోస్ట్ - శనివారం ఎపిసోడ్ హైలైట్స్!

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?

Ravi Teja: రవితేజ 'ధమాకా' సినిమాలో కామెడీ స్కిట్స్ - హైపర్ ఆది రాశారా?

Ravi Teja: రవితేజ 'ధమాకా' సినిమాలో కామెడీ స్కిట్స్ - హైపర్ ఆది రాశారా?

Sonal Chauhan Interview : నాగార్జునతో మాట్లాడాక ఆయనదీ నా వయసే అని...

Sonal Chauhan Interview : నాగార్జునతో మాట్లాడాక ఆయనదీ నా వయసే అని...

Prabhas: ఫ్యాన్ మేడ్ వీడియో - ప్రభాస్ ఎమోషన్ ని టచ్ చేశారు!

Prabhas: ఫ్యాన్ మేడ్ వీడియో - ప్రభాస్ ఎమోషన్ ని టచ్ చేశారు!

టాప్ స్టోరీస్

Pawan Politics : పవన్ లక్ష్యం అసెంబ్లీలో అడుగు పెట్టడమా .. అధికారమా? పార్ట్‌టైమ్ పాలిటిక్స్‌తో సాధించేదేంటి ?

Pawan Politics : పవన్ లక్ష్యం అసెంబ్లీలో అడుగు పెట్టడమా  .. అధికారమా? పార్ట్‌టైమ్ పాలిటిక్స్‌తో సాధించేదేంటి ?

Minister Jogi Ramesh : బాలకృష్ణకు పునర్జన్మనిచ్చింది వైఎస్సార్, చంద్రబాబు చేసిన ద్రోహం మర్చిపోయారా?- మంత్రి జోగి రమేష్

Minister Jogi Ramesh :  బాలకృష్ణకు పునర్జన్మనిచ్చింది వైఎస్సార్, చంద్రబాబు చేసిన ద్రోహం మర్చిపోయారా?- మంత్రి జోగి రమేష్

Hyderabad News : వంద శాతం మురుగునీటి శుద్ధి నగరంగా హైదరాబాద్- మంత్రి కేటీఆర్

Hyderabad News : వంద శాతం మురుగునీటి శుద్ధి నగరంగా హైదరాబాద్- మంత్రి కేటీఆర్

ఇంగ్లండ్‌పై టీమిండియా వివాదాస్పద విజయం - జులన్ గోస్వామికి ఘనమైన వీడ్కోలు!

ఇంగ్లండ్‌పై టీమిండియా వివాదాస్పద విజయం - జులన్ గోస్వామికి ఘనమైన వీడ్కోలు!