Aditi Shankar: శంకర్ కూతురికి మరో సినిమా ఆఫర్ - ఈసారి బైలింగ్యువల్ ప్రాజెక్ట్!
శంకర్ కూతురు మరో సినిమా సైన్ చేసింది. శివకార్తికేయన్ హీరోగా సినిమా తెరకెక్కనుంది.

సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టింది. కార్తీ నటిస్తోన్న 'విరుమాన్' సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఆగస్టు రెండో వారంలో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా రిలీజ్ కాకుండానే అదితికి మరో సినిమా ఛాన్స్ వచ్చింది. కోలీవుడ్ హీరో కార్తికేయన్ రీసెంట్ గా బైలింగ్యువల్ ప్రాజెక్ట్ ఓకే చేశారు. ఆ సినిమాకి 'మావీరన్' అనే టైటిల్ ఫిక్స్ చేశారు.
తెలుగులో 'మహావీరుడు' అనే టైటిల్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను మడోన్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇదివరకు ఈ దర్శకుడు రూపొందించిన 'మండేలా' సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది. ఇప్పుడు శివకార్తికేయన్ హీరోగా 'మావీరన్'ను తెరకెక్కిస్తున్నారు. ఇందులో అదితి శంకర్ ను హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. ఈ విషయాన్ని అఫీషియల్ గా వెల్లడించారు. అంటే ఈ సినిమాతో అదితి తెలుగు ప్రేక్షకులను కూడా అలరించబోతుందన్నమాట.
శాంతి టాకీస్ సమర్పణలో అరుణ్ విశ్వ నిర్మిస్తున్న ఈ సినిమాకి శివకార్తికేయన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో శివకార్తికేయన్ రస్టిక్ అవతార్ లో కనిపించబోతున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమాను రూపొందించనున్నారు. భరత్ శంకర్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాకి విదు అయన్న సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.
Also Read: మళ్ళీ నిఖిల్‌ను వెనక్కి పంపారు - ఆగస్టు 12న కాదు, తర్వాత రోజున 'కార్తికేయ 2'
Also Read: నాగ చైతన్య నవ్వితే డేటింగ్‌లో ఉన్నట్టేనా? ఆమెతో ప్రేమ నిజమేనా?
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

