అన్వేషించండి

‘ఆదిపురుష్’ ట్రైలర్ - ఫ్యాన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్, థియేటర్లో కంటే ముందే యూట్యూబ్‌లో రిలీజ్

ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆదిపురుష్' సినిమా ట్రైలర్ కు సంబంధించి మరో అప్ డేట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లాంఛింగ్ కు 3గం. ముందుగానే మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది.

Adipurush : ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. మే 9న ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆదిపురుష్' కు సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేస్తామని చెప్పిన సంగతి తెలిసిందే.  పౌరాణిక ఇతిహాసం నేపథ్యంగా రూపొందించిన ఆదిపురుష్ కోసం అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో మేకర్స్ ఓ క్రేజీ అనౌన్స్ మెంట్ చేశారు. ఈ థియేట్రికల్ ట్రైలర్‌ను చెప్పిన సమయం కంటే 3 గంటల ముందు గానే రిలీజ్ చేయనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అత్యంత ఆసక్తిని రేకెత్తించే ఈ వార్త.. ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాముడిగా, హీరోయిన్ కృతి సనన్ సీతగా నటించిన 'ఆదిపురుష్' ట్రైలర్ ను మే 9న సాయంత్రం 5.40గంటలకు రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే అధికారికంగా వెల్లడించారు. సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ తో పాటు దాదాపు 70 దేశాల్లోని అనేక థియేటర్లలోనూ ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మామూలుగా అయితే 'ఆదిపురుష్' ట్రైలర్ సాయంత్రం 5.40కి విడుదల కావాలి. కానీ అసలు లాంఛ్ కు 3 గంటల ముందుగానే అంటే మధ్యాహ్నం 1.53 గంటలకు య్యూట్యూబ్‌లో ట్రైలర్‌ను రిలీజ్ చేస్తారు.

అయితే, థియేట్రికల్ స్క్రీనింగ్‌లో ఎటువంటి మార్పు ఉండదు. ఇదిలా ఉండగా ఆన్ లైన్ అఫీషియల్ విడుదలకు ఒకరోజు ముందుగానే హైదరాబాద్ ఏఎంబి మల్టీప్లెక్స్ లో మే 8న ఆది పురుష్ ట్రైలర్ ని స్క్రీనింగ్ చేయడం అభిమానుల్లో ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. ఈ ట్రైలర్ ను ముందుగా సాయంత్రం 4.15 గంటలకు ప్రదర్శిస్తామని, ఇది కేవలం అభిమానుల కోసమేనని మూవీ టీం ఇంతకు మునుపే ప్రకటించింది. కానీ హీరో ప్రభాస్ ఆలస్యంగా రావడంతో దాదాపు గంట ఆలస్యంగా ప్రదర్శించారు. ఈ ట్రైలర్ చూసిన తర్వాత అభిమానులు పండగ చేసుకుంటున్నారట. ప్రస్తుతానికైతే ట్రైలర్‌పై పాజిటివ్ టాక్ ఉంది. యూట్యూబ్‌లో రిలీజైన తర్వాత టాక్ ఎలా ఉంటుందో చూడాలి.

ట్రైలర్ ఎలా ఉందంటే...

హైదరాబాద్ లో ఫ్యాన్స్ కోసం ఏర్పాటు చేసిన 'ఆదిపురుష్' ట్రైలర్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ ట్రైలర్ మొత్తం మూడు నిమిషాల ఇరవై రెండు సెకన్లు ఉండగా... సీతను రావణుడు అపహరించడంతో మొదలై రాముడి ఆగమనం, అయోధ్య పరిచయం.. చివరికి రామ - రావణ యుద్ధంతో ఈ సినిమాను ముగించినట్టు తెలుస్తోంది. మూవీలోని విజువల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయని, టీజర్ చూసినప్పుడు ఏదైతే నెగటివ్ ఫీలింగ్ వచ్చిందో అది పూర్తిగా తొలగిపోయేలా బ్రహ్మాండంగా కట్ చేశారని పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభాస్ లుక్స్ కు మంచి స్పందన వస్తోంది. దీంతో సినిమాకు కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని మేకర్స్ భావిస్తున్నారు.

ఆదిపురుష్ లో సైఫ్ అలీ రావణుడి పాత్రలో నటించారు. ప్రారంభంలో సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రకు సెట్ కాలేదని పలువురు విమర్శించారు. రామాయణాన్ని కించపర్చేలా పాత్రలు రూపుదిద్దారని ఆరోపించారు. కానీ ఈ సినిమాకు ఇటీవలి కాలంలో వస్తోన్న రెస్పాన్స్ చూస్తుంటే.. విడుదల వరకు ముందు ఎదుర్కొన్న వివాదాలన్నీ తొలగిపోతాయనిపిస్తుంది. భారీ బడ్జెట్ లో రూపుదిద్దుకున్న ‘ఆదిపురుష్’.. జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

Also Read పడ్డవాడు చెడ్డవాడు కాదు - కుర్రాళ్ల క్రేజీ హార్ట్ బీట్ విజయ్ దేవరకొండ, రౌడీ బాయ్ కెరీర్‌ను మార్చిన మూవీస్ ఇవే!

టాప్ హెడ్ లైన్స్

Pavala Shyamala Daughter: పావలా శ్యామల కుమార్తెకు మురళీమోహన్, నరేష్ సాయం... దాతలకు 'మా' పిలుపు
పావలా శ్యామల కుమార్తెకు మురళీమోహన్, నరేష్ సాయం... దాతలకు 'మా' పిలుపు
Secret Soldier: చైనా పీస్ టైటిల్ 'సీక్రెట్ సోల్జర్'గా ఎందుకు మారింది? సెన్సార్‌ డిలే ఎందుకు? - హీరోలు చెప్పిన విశేషాలు
చైనా పీస్ టైటిల్ 'సీక్రెట్ సోల్జర్'గా ఎందుకు మారింది? సెన్సార్‌ డిలే ఎందుకు? - హీరోలు చెప్పిన విశేషాలు
Vijay Trisha: త్రిష ఎంట్రీతో విజయ్ కంగారు... ముఖం పక్కకు తిప్పేశాడుగా!
త్రిష ఎంట్రీతో విజయ్ కంగారు... ముఖం పక్కకు తిప్పేశాడుగా!
Varanasi: 'వారణాసి'కి మళ్ళీ లీకుల బెడద... సెట్‌ చూసి ఫ్యాన్స్ షాక్!
'వారణాసి'కి మళ్ళీ లీకుల బెడద... సెట్‌ చూసి ఫ్యాన్స్ షాక్!

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP TET Results: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. స్కోర్ కార్డ్ ఇలా డౌన్ లోడ్ చేసుకోండి
ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. స్కోర్ కార్డ్ ఇలా డౌన్ లోడ్ చేసుకోండి
Arvind Kejriwal: గోవాలో కూటమి ఏర్పాటు చేసిన AAP.. అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన, ఆ పార్టీ అంత స్పెషలా ?
గోవాలో కూటమి ఏర్పాటు చేసిన AAP.. అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన, ఆ పార్టీ అంత స్పెషలా ?
18th BRICS Summit: ఖనిజాలు, టెక్నాలజీని ఆయుధాలుగా మార్చవద్దు.. బ్రిక్స్ సదస్సు ముగింపులో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
ఖనిజాలు, టెక్నాలజీని ఆయుధాలుగా మార్చవద్దు.. బ్రిక్స్ సదస్సు ముగింపులో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
CM Revanth Reddy: ఎంత మంది సీఎంలు మారినా ఆర్థిక మంత్రి ఆయనే.. రోశయ్య దూరదృష్టి వల్లే మిగులు బడ్జెట్ - సీఎం రేవంత్ రెడ్డి
ఎంత మంది సీఎంలు మారినా ఆర్థిక మంత్రి ఆయనే.. రోశయ్య దూరదృష్టి వల్లే మిగులు బడ్జెట్ - సీఎం రేవంత్ రెడ్డి
Tirumala Latest News: తిరుమలకు వచ్చే ప్రైవేట్ వాహనాల పరిమితిపై భక్తులకు టీటీడీ క్లారిటీ
తిరుమలకు వచ్చే ప్రైవేట్ వాహనాల పరిమితిపై భక్తులకు టీటీడీ క్లారిటీ
Kakinada Crime News: యువతులతో రిలేషన్.. ప్రైవేట్ వీడియోల కోసమే చంపేశారు - కాకినాడ హత్య కేసు ఛేదించిన పోలీసులు
యువతులతో రిలేషన్.. ప్రైవేట్ వీడియోల కోసమే చంపేశారు - కాకినాడ హత్య కేసు ఛేదించిన పోలీసులు
Indonesia Ship Missing: 241 మందితో వెళ్తున్న నౌక జావా సముద్రంలో అదృశ్యం, కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్
241 మందితో వెళ్తున్న నౌక జావా సముద్రంలో అదృశ్యం, కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్
Vijay Trisha: త్రిష ఎంట్రీతో విజయ్ కంగారు... ముఖం పక్కకు తిప్పేశాడుగా!
త్రిష ఎంట్రీతో విజయ్ కంగారు... ముఖం పక్కకు తిప్పేశాడుగా!
Embed widget