Adipurush: ‘ఆదిపురుష్’కు కలెక్షన్స్ కష్టాలు, చౌకగా 3D టికెట్లు - మరీ అంత తక్కువా?
‘ఆదిపురుష్’ సినిమా కలెక్షన్లు పెంచడం కోసం మేకర్స్ రకరకాల స్టంట్ లు చేస్తున్నారు. మొన్నటి వరకూ టికెట్ రేటు తగ్గినా 3డి గ్లాసెస్ కోసం విడిగా డబ్బులు చెల్లించాల్సి వచ్చేది. అయితే ఈసారి ఏకంగా..
Adipurush: భారీ అంచనాల మధ్య విడుదలైన ‘ఆదిపురుష్’ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలం అయింది. రామాయణ ఇతిహాసాల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఆది నుంచి విమర్శలు ఎదుర్కుంటోంది. సినిమాలోని గ్రాఫిక్స్, లుక్స్, డైలాగ్స్ పట్ల ప్రేక్షకుల నుంచి వ్యతిరేకత వచ్చింది. దీంతో ఆ ప్రభావం సినిమా కలెక్షన్ల పై పడింది. మొదటి రోజు బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు స్థాయిలో వచ్చిన కలెక్షన్లు నెగిటివ్ ఇంపాక్ట్ తో రెండు రోజు నుంచి భారీగా పడిపోయాయి. కలెక్షన్లు పెంచేందుకు టికిట్ రేట్లను తగ్గించారు మేకర్స్. అయినా కలెక్షన్లు పెరగకపోవడంతో టికెట్ రేట్ల విషయంలో మళ్లీ కీలక నిర్ణయం తీసుకుంది.
కేవలం రూ.112 కే ‘ఆదిపురుష్’..
‘ఆదిపురుష్’ సినిమా కలెక్షన్లు పెంచడం కోసం మేకర్స్ రకరకాల స్టంట్ లు చేస్తున్నారు. ముందునుంచీ కూడా మూవీ ప్రమోషన్స్ ను కూడా వినూత్నంగా చేసుకుంటూ వచ్చారు. అయితే అవన్నీ సినిమా రిలీజ్ అయ్యేంతవరకే పనిచేశాయి. రిలీజ్ తర్వాత అంచనాలు అన్నీ తలకిందులు అయ్యాయి. మొదటి రోజు భారీ వసూళ్లు రాబట్టిన ‘ఆదిపురుష్’ సినిమా రెండో రోజు నుంచీ వసూళ్లు పడిపోయాయి. సినిమాలో నెగిటివ్ ప్రభావం వలన ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గిపోయారు. దీంతో కలెక్షన్లను పెంచేందుకు టికెట్ ధరలను తగ్గించారు మేకర్స్. అయినా కూడా కూడా కలెక్షన్లలో ఏమాత్రం తేడా రాలేదు. దీంతో టికెట్ రేట్లను మరింత తగ్గించారు మేకర్స్. మొన్నటి వరకూ టికెట్ రేటు తగ్గినా 3డి గ్లాసెస్ కోసం విడిగా డబ్బులు చెల్లించాల్సి వచ్చేది. అయితే ఈసారి ఏకంగా 3డి గ్లాసెస్ తో కూడా కలిపి కేవలం రూ.112 కే ‘ఆదిపురుష్’ సినిమా అంటూ ప్రకటించారు. మరి ఈ ట్రిక్ తో అయినా సినిమా కలెక్షన్లు పెరుగుతాయోమో చూడాలి.
పది రోజుల్లో రూ.450 కోట్లు కలెక్షన్స్..
‘ఆదిపురుష్’ సినిమా పై ముందు నుంచి విమర్శలు వస్తూనే ఉన్నాయి. మూవీ విడుదల అయ్యాక ఈ విమర్శలు ఇంకా ఎక్కువయ్యాయి. మిశ్రమ స్పందనల నడుమ మూవీ థియేటర్లలో రన్ అయింది. దీంతో మొదటి మూడు రోజుల్లో రూ.340 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా.. తరవాత ఏడు రోజుల్లో మరో రూ.110 కోట్లు మాత్రమే రాబట్టగలిగింది. మొత్తంగా సినిమా విడుదల అయిన పంది రోజుల్లో రూ. 450 కోట్లు వసూళ్లు రాబట్టింది. ఈ మేరకు మూవీ మేకర్స్ అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రభాస్ కు నార్త్ లో కూడా బాగానే ఫాలోయింగ్ ఉంది. దీంతో ‘ఆదిపురుష్’ సినిమా నార్త లో మంచి వసూళ్లనే రాబట్టిందనే చెప్పాలి. హిందీలో ఈ మూవీ క్లీన్ హిట్ అయినట్టే టాక్ నడుస్తోంది. హిందీ వెర్షన్ లో ఈ పది రోజుల్లో రూ.140 కోట్ల మేర వసూళ్లు రాబట్టి క్లీన్ హిట్ గా నిలిచింది. గతంలో ‘బాహుబలి’, ‘బాహుబలి 2’, ‘సాహో’ సినిమాలు హిందీ బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు సాధించాయి. అయితే తెలుగులో మాత్రం ఈ సినిమా క్లీన్ హిట్ అవ్వలేదనే టాక్ నడుస్తోంది. మరి ఇప్పుడు టికెట్ల రేట్లు తగ్గించడంతో తెలుగులో ఏమైనా వసూళ్లు పెరుగుతాయోమో చూడాలి.
Also Read: ‘సలార్’ విలన్‌కు గాయాలు, చిక్కుల్లో ‘లియో’ హీరో విజయ్ - నేటి టాప్ 5 సినీ విశేషాలివే!