By: ABP Desam | Updated at : 01 Jul 2022 03:54 PM (IST)
'మా బట్టలు మా ఇష్టం, మీరేమైనా కొనిస్తున్నారా?' సురేఖావాణి కూతురు ఫైర్
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగులో సినిమాలు చేస్తోన్న నటి సురేఖావాణికి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఈమెకి ఒక కూతురు ఉంది. ఆమె పేరు సుప్రీత. తల్లి మాదిరి ఆమె కూడా నటిగా గుర్తింపు తెచ్చుకోవాలని చూస్తుంది. ప్రస్తుతం ఈమె కొన్ని మ్యూజిక్ ఆల్బమ్స్, షార్ట్ ఫిలిమ్స్ లో నటిస్తోంది. త్వరలోనే సుప్రీత హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందని టాక్. ఇదిలా ఉండగా.. ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు తన తల్లితో దిగిన ఫొటోలను, వీడియోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తుంది.
అయితే ఈ ఫొటోలు, వీడియోలు చూసిన నెటిజన్లు వారిద్దరినీ బాగా ట్రోల్ చేస్తుంటారు. ముఖ్యంగా డ్రెస్సింగ్ విషయంలో ఈ తల్లీకూతుళ్లిద్దరూ ట్రోలింగ్ కి గురవుతుంటారు. దీనిపై ఎప్పటికప్పుడు సుప్రీత స్ట్రాంగ్ కౌంటర్స్ ఇస్తూనే ఉంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మరోసారి నెటిజన్లపై మండిపడింది సుప్రీత. తమ డ్రెస్సింగ్ పై జరుగుతోన్న ట్రోలింగ్ గురించి మాట్లాడుతూ.. 'మా బట్టలు మా ఇష్టం.. మీ డబ్బులతో ఏమైనా కొనిస్తున్నారా..? లేక మీ నుంచి మేమేమైనా ఆశిస్తున్నామా..? మిమ్మల్ని అడుగుతున్నామా..?' అంటూ మండిపడింది.
తన తండ్రి చనిపోయినప్పుడు ఆయన తరఫు వాళ్లెవరూ రాలేదని.. తల్లి కుటుంబమే అంతా చూసుకుందని చెప్పింది. నాన్న చనిపోయారనే బాధతో అమ్మ ఇంటి నుంచి బయటకు కూడా వచ్చేది కాదని.. ఆమెని మామూలు మనిషి చేయడానికి బ్యాంకాక్ ట్రిప్ కి తీసుకెళ్తే అప్పుడు కూడా అనవసరమైన కామెంట్స్ వినాల్సి వచ్చిందని వాపోయింది. కామెంట్స్ చేసేవారు.. కష్టం వచ్చినప్పుడు సాయానికి రారని.. అలాంటి వాళ్లు తమపై ఎలా విమర్శలు చేస్తారని ప్రశ్నించింది.
Also Read: మాది 'పవిత్ర' బంధం, మేం మంచి స్నేహితులం - రూమర్స్‌పై నరేష్ స్పందన
Also Read : నెట్‌ఫ్లిక్స్‌లో అడివి శేష్ 'మేజర్' - మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే?
Salaar: ప్రభాస్ 'సలార్'లో టాలెంటెడ్ యాక్టర్స్ - పృథ్వీరాజ్ సుకుమారన్ కన్ఫర్మ్!
Tollywood: 'ఆర్ఆర్ఆర్'కి ఆస్కార్ గ్యారెంటీ - ఫైట్ మాస్టర్ కణల్ కన్నన్ అరెస్ట్!
బాలీవుడ్ భయపడుతోందా? ‘కార్తికేయ 2’ హిట్తో మళ్లీ కలవరం!
Thalapathy Vijay: మహేష్ బాబు థియేటర్ లో విజయ్ - ఏం సినిమా చూశారో తెలుసా?
Shakini-Dhakini: ‘శాకిని డాకిని’ రిలీజ్ డేట్ ఫిక్స్, యాక్షన్ కామెడీతో వస్తున్న రెజినా, నివేదా థామస్
సంగం బ్యారేజ్ నిర్వహణపై రగడ- పైచేయి కోసం పోటీ పడుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు!
Psycho Killer Rambabu: భార్యపై కోపంతో ఆడజాతినే అంతం చేయాలనుకున్నాడు ! విశాఖ సీరియల్ కిల్లర్ అరెస్ట్
JVVD Scheme 2022: జగనన్న విదేశీ విద్యా దీవెనకు దరఖాస్తు చేసుకోండి, చివరితేది ఎప్పుడంటే?
Milk Price : పాల ప్యాకెట్ల కోసం బడ్జెట్ పెంచుకోవాల్సిందే - మళ్లీ రేట్లు పెంచేసిన కంపెనీలు ! ఇవిగో కొత్త ధరలు