అన్వేషించండి

Venky Movie: బ్లాక్ బస్టర్ ‘వెంకీ‘ సినిమాకు స్నేహ ఫస్ట్ ఛాయిస్ కాదా? గోల్డెన్ ఆఫర్ మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?

రవితేజ, స్నేహ జంటగా నటించిన సూపర్ హిట్ మూవీ ‘వెంకీ’. 2004లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని అందుకుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది.

Sneha Was Not The First Choice For The Venky Movie 2004: మార్చి 24న విడుదలైన ‘వెంకీ’ సినిమా టాలీవుడ్ లో ప్రభంజనం సృష్టించింది. రవితేజ, స్నేహ హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన ఈ సినిమా విడుదలై 20 ఏండ్లు పూర్తైనా ప్రేక్షకులను ఇప్పటికీ ప్రేక్షకులలో క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఈ సినిమాలోని ట్రైన్ సన్నివేశాలు ఓ రేంజిలో ఆకట్టుకుంటాయి. రైల్లో రవితేజ, శ్రీనివాసరెడ్డి, చిత్రం శ్రీను, వేణుమాధవ్ చేసే కామెడీ కడుపుబ్బా నవ్విస్తుంది. గజాలగా బ్రహ్మానందం, బొక్కా క్యారెక్టర్ లో ఏవీఎస్‌ పండించిన హాస్యాన్ని ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. స్నేహను ఇంప్రెస్‌ చేసేందుకు రవితేజ ఆడే అబద్దాలు, గజాల, బొక్కాను టీజ్ చేసే విధానం ప్రేక్షకులను పడీ పడీ నవ్వేలా చేస్తుంది. రవితేజ కెరీర్ లోనే ఈ చిత్రం ఓ మైల్ స్టోన్ గా చెప్పుకోవచ్చు. కామెడీ మాత్రమే కాదు, అడుగడుగునా సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలు మరింత క్యూరియాసిటీ కలిగిస్తాయి.   

‘వెంకీ’ సినిమా ఫస్ట్ ఛాయిస్ స్నేహ కాదట!

తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ సినిమాలో శ్రావణిగా హీరోయిన్ స్నేహ నటించింది. చక్కటి అభినయంతో ఆకట్టుకుంది. కానీ, ఈ సినిమాకు స్నేహ ఫస్ట్ ఛాయిస్ కాదట. ఈ సినిమాలో హీరోయిన్ గా అసిన్ ను తీసుకోవాలని మేకర్స్ అనుకున్నారట. కానీ, ఆమె డేట్స్ అప్పట్లో ఖాళీగా లేకపోవడంతో ఈ పాత్రకు స్నేహను సెలెక్ట్ చేశారు. ఈ విషయాన్ని దర్శకుడు శ్రీను వైట్ల స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించడం విశేషం.

వెంకీ సినిమా కథ ఏంటంటే?

ఇక ‘వెంకీ’ సినిమా కథ విషయానికి వస్తే.. నలుగురు యువకులు ఎలాంటి పనీ పాట లేకుండా తిరుగుతుంటారు. అనుకోకుండా ఈ నలుగురు పోలీసు ఉద్యోగాలకు ఎంపిక అవుతారు. శిక్షణ కోసం విశాఖ నుంచి హైదరబాద్ కు రైల్లో వస్తుంటారు. ఈ సమయంలోనే ఓ హత్య కేసులో చిక్కుకుంటారు. ఆ తర్వాత ఈ నలుగురు మర్డర్ కేసు నుంచి ఎలా బయటపడతారు. అసలు నేరస్థులు ఎవరు? అనేది ఈ సినిమాలో చూపిస్తారు దర్శకుడు శ్రీను వైట్ల.  

రవితేజ చిత్రంతో దర్శకుడిగా శ్రీనువైట్ల ఇండస్ట్రీకి పరిచయం

అటు రవితేజ, శ్రీను వైట్ల మధ్య మంచి అనుబంధం ఉంది. వీరిద్దరు కలిసి 4 సినిమాలు చేశారు. వీరిద్దరు కాంబోలో తొలిసారి ‘నీ కోసం’ అనే సినిమా చేశారు. ఈ సినిమాతోనే శ్రీను వైట్ల దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆ తర్వాత ‘దుబాయ్ శ్రీను’, ‘వెంకీ’తో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. వీరిద్దరి కెరీర్ కు ‘వెంకీ‘ సినిమా ఓ రేంజిలో బూస్టింగ్ ఇచ్చింది. ఈ సినిమాతో ఇద్దరూ వెనక్కి తిరిగి చూసుకోలేదు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by 🫰𝕥𝕙𝕖 𝕓𝕒𝕔𝕙𝕖𝕝𝕠𝕣𝕖 𝕞𝕒𝕨𝕒 👌🏼 (@thebacheloremawa)

Read Also: పృథ్వీరాజ్ సుకుమారన్ 'ది గోట్ లైఫ్' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది - సినిమా ఎలా ఉందంటే?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Cigarette Price: ఫిబ్రవరి 1 నుంచి సిగరెట్ ధరలు ఎంత పెరుగుతాయి? రూ.75 నిజమేనా?
ఫిబ్రవరి 1 నుంచి సిగరెట్ ధరలు ఎంత పెరుగుతాయి? రూ.75 నిజమేనా?
Telangana Student Died: జర్మనీలో తెలంగాణ విద్యార్థి హృతిక్ రెడ్డి మృతి- న్యూ ఇయర్ రోజున కుటుంబంలో విషాదం!
జర్మనీలో తెలంగాణ విద్యార్థి హృతిక్ రెడ్డి మృతి- న్యూ ఇయర్ రోజున కుటుంబంలో విషాదం!
Iran Crisis : ఒక్క డాలర్‌కు 14 లక్షల రియాల్స్ - ఇరాన్‌లో రోడ్డెక్కిన ప్రజలు - ఆయిల్ రిచ్ కంట్రీలో ఏం జరుగుతోంది?
ఒక్క డాలర్‌కు 14 లక్షల రియాల్స్ - ఇరాన్‌లో రోడ్డెక్కిన ప్రజలు - ఆయిల్ రిచ్ కంట్రీలో ఏం జరుగుతోంది?
LPG Price : కొత్త సంవత్సరంలో దేశ ప్రజలకు పెద్ద షాక్! 111 రూపాయలు పెరిగిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర!
కొత్త సంవత్సరంలో దేశ ప్రజలకు పెద్ద షాక్! 111 రూపాయలు పెరిగిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర!

వీడియోలు

Rohin Uttappa about Rohit Virat Retirement | రో - కో టెస్ట్ రిటైర్మెంట్ పై మాజీ ప్లేయర్ వ్యాఖ్యలు
Sarfaraz Khan in Vijay Hazare Trophy | రోహిత్ రికార్డు బద్దలు కొట్టిన సర్ఫరాజ్
Devdutt Padikkal Vijay Hazare Trophy | సూపర్ ఫామ్‌లో దేవ్‌దత్ పడిక్కల్
పాతికేళ్లలో ఊహించలేని విధంగా మన ప్రపంచం మారిపోయింది
Indian Cricket High pay Profession | టాలెంట్ ఉందా..క్రికెట్ ఆడు..కోట్లు సంపాదించు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cigarette Price: ఫిబ్రవరి 1 నుంచి సిగరెట్ ధరలు ఎంత పెరుగుతాయి? రూ.75 నిజమేనా?
ఫిబ్రవరి 1 నుంచి సిగరెట్ ధరలు ఎంత పెరుగుతాయి? రూ.75 నిజమేనా?
Telangana Student Died: జర్మనీలో తెలంగాణ విద్యార్థి హృతిక్ రెడ్డి మృతి- న్యూ ఇయర్ రోజున కుటుంబంలో విషాదం!
జర్మనీలో తెలంగాణ విద్యార్థి హృతిక్ రెడ్డి మృతి- న్యూ ఇయర్ రోజున కుటుంబంలో విషాదం!
Iran Crisis : ఒక్క డాలర్‌కు 14 లక్షల రియాల్స్ - ఇరాన్‌లో రోడ్డెక్కిన ప్రజలు - ఆయిల్ రిచ్ కంట్రీలో ఏం జరుగుతోంది?
ఒక్క డాలర్‌కు 14 లక్షల రియాల్స్ - ఇరాన్‌లో రోడ్డెక్కిన ప్రజలు - ఆయిల్ రిచ్ కంట్రీలో ఏం జరుగుతోంది?
LPG Price : కొత్త సంవత్సరంలో దేశ ప్రజలకు పెద్ద షాక్! 111 రూపాయలు పెరిగిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర!
కొత్త సంవత్సరంలో దేశ ప్రజలకు పెద్ద షాక్! 111 రూపాయలు పెరిగిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర!
Haq OTT Release Date: నెట్‌ఫ్లిక్స్‌లో 'హక్' స్ట్రీమింగ్... మహిళల హక్కులపై కోర్ట్ రూమ్ డ్రామా... దీని స్పెషాలిటీ ఏమిటంటే?
నెట్‌ఫ్లిక్స్‌లో 'హక్' స్ట్రీమింగ్... మహిళల హక్కులపై కోర్ట్ రూమ్ డ్రామా... దీని స్పెషాలిటీ ఏమిటంటే?
New Year Celebration Tragedy: తెలుగు రాష్ట్రాల్లో 2026 స్వాగత సంబరాల్లో విషాదం; వివిధ కారణాలతో ముగ్గురు మృతి
తెలుగు రాష్ట్రాల్లో 2026 స్వాగత సంబరాల్లో విషాదం; వివిధ కారణాలతో ముగ్గురు మృతి
Eluru Crime News: ఏలూరులో ప్రేమిస్తే సీన్‌ రిపీట్‌- ఇంటి ఆడపిల్లలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని యువకుడిపై దాడి!
ఏలూరులో ప్రేమిస్తే సీన్‌ రిపీట్‌- ఇంటి ఆడపిల్లలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని యువకుడిపై దాడి!
US travel ban: ఈ 39 దేశాల నుంచి అమెరికాకు ఎవరూ వెళ్లలేరు - కొత్త ఏడాదిలో బ్యాన్ చేసిన ట్రంప్
ఈ 39 దేశాల నుంచి అమెరికాకు ఎవరూ వెళ్లలేరు - కొత్త ఏడాదిలో బ్యాన్ చేసిన ట్రంప్
Embed widget