అన్వేషించండి
Advertisement
Chourasiya: నటిపై దాడి చేసింది సైకో.. దుండగుడి కోసం గాలింపు..
బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కులో నటి చౌరసియాపై జరిగిన దాడి ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఆదివారం నాడు కేబీఆర్ పార్క్‌కు వాకింగ్ కు వెళ్లిన నటి షాలు చౌరాసియాపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. జూబ్లీహిల్స్ రోడ్ నెం 92లోని స్టార్‌బక్స్ ఎదురుగా నిర్మానుష్య ప్రాంతం వద్ద దాడి చేసి ఆమె సెల్‌ఫోన్‌ను లాక్కుని పరారయ్యాడు. ఆమెపై దాడికి కూడా పాల్పడ్డాడు. ఈ ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నాలుగు పోలీసు బృందాలతో దుండగుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు కూడా రంగంలోకి దిగారు. వీఐపీ జోన్‌లోనే దారి దోపిడీ జరగడంపై నగర సీపీ అంజనీ కుమార్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది.
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను జల్లెడ పట్టి.. దుండగుడు నటి పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు గుర్తించారు. చౌరాసియా కోసం ఆగంతకుడు వచ్చాడని పోలీసు తెలిపారు. నటిని పొదల్లోకి లాక్కెళ్లి పెదాలు, మెడపై గాయపరిచాడని వెల్లడించారు. ఆమెను బలవంతంగా పక్కకు లాక్కెళ్లే ప్రయత్నం చేసినట్లు చెప్పారు. చౌరాసియాపై దాడి చేసింది ఒక సైకో అని పోలీసులు గుర్తించారు. దుండగుడిని పట్టుకునే పనిలో పడ్డారు.
తెలుగులో 'శైలు', 'సైకో' వంటి కొన్ని చిన్న సినిమాల్లో షాలు చౌరాసియా కథానాయికగా నటించారు. నటిగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. పలు ఈవెంట్స్ లో మోడల్ గా సందడి చేశారు.
Also Read: నితిన్‌తో కేథరిన్ థ్రెసా రొమాన్స్..
Also Read: బిజీ డిసెంబర్... అసలు గ్యాప్ లేదుగా..
Also Read: పవన్ కల్యాణ్ సినిమా వెనక్కి వెళ్లడం లేదు... సంక్రాంతి బరిలోనే 'భీమ్లా నాయక్'
Also Read: కోటి రూపాయలు గెలుచుకుని చరిత్ర సృష్టించిన తెలంగాణ పోలీస్
Also Read: 'ఆర్ఆర్ఆర్', 'రాధే శ్యామ్'కు దారిస్తూ... వెనక్కి వెళ్లిన 'గంగూబాయి కథియవాడి'
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
ఇండియా
సినిమా
విజయవాడ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion