Rashmika Mandanna: ఆల్రెడీ నాకు పెళ్లయిపోయింది, షాకింగ్ న్యూస్ చెప్పిన రష్మిక మందన్న
కన్నడ బ్యూటీ రష్మిక మందన్న షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. ఇప్పటికే తన పెళ్లి అయిపోయిందంటూ బాంబు పేల్చింది. ప్రస్తుతం తన మనసులో అతడే ఉన్నాడని చెప్పుకొచ్చింది.
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ప్రేమ వ్యవహారం గురించి చాలా కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. చాలాసార్లు వెకేషన్ కు వెళ్తూ మీడియాకు కూడా కనిపించారు. అయితే, ఇప్పటి వరకూ ఈ జంట తాము రిలేషన్ షిప్ లో ఉన్నామని ఎప్పుడూ చెప్పలేదు. కొన్ని సందర్భాల్లో వారిని మీడియా ప్రతినిధులు ఈ విషయం గురించి అడిగినా, సమాధానం చెప్పకుండా స్కిప్ చేశారు. అప్పుడప్పుడు విజయ్, రష్మిక సోషల్ మీడియాలో చేసే పోస్టులు మాత్రం వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తుందనే వార్తలకు బలం చేకూర్చుతుంటాయి. కాసేపు వీరి ప్రేమ విషయం పక్కన పెడితే, రష్మిక తాజాగా ఓ షాకింగ్ విషయాన్ని చెప్పింది.
పెళ్లి గురించి రష్మిక షాకింగ్ కామెంట్స్
తన ప్రేమ, పెళ్లి గురించి ఎన్ని ఊహాగానాలు వచ్చినా, మీడియాలో పలు వార్తలు ప్రసారమైనా స్పందించని రష్మిక, రీసెంట్ గా సంచలన విషయాన్ని వెల్లడించింది. తాజాగా ఓ ఈవెంట్ లో పాల్గొన్న ఆమె, తన పెళ్లి గురించి ఎవరూ ఊహించని ముచ్చట చెప్పింది. ఇంతకాలం తన మనసులో విజయ్ దేవరకొండ ఉన్నాడని అందరూ భావించినా, వేరే వ్యక్తితో తనకు ఇప్పటికే పెళ్లి అయిపోయిందంటూ పేద్ద బాంబు పేల్చింది. ప్రస్తుతం తన మనసు నిండా అతడే ఉన్నట్లు వెల్లడించింది.
రీసెంట్ గా ఓ ప్రమోషనల్ కార్యక్రమంలో బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ తో కలిసి వెళ్లింది. ఈ ఈవెంట్ లో యాంకర్ రష్మిక పెళ్లి గురించి ప్రస్తావించింది. ఎవరితో ప్రేమలో ఉన్నారు? ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు? అని క్వశ్చన్ చేసింది. ఈ ప్రశ్నకు రష్మిక దిమ్మతిరిగే సమాధానం చెప్పింది. ఇప్పటికే తనకు నరుటోతో పెళ్లి అయిపోయిందని చెప్పింది. ప్రస్తుతం తన మనసు నిండా అతడే ఉన్నట్లు వెల్లడించింది. ఇంతకీ ఈ నరుటో ఎవరు? అనేదే కదా మీ ప్రశ్న? ఇదో ఫేమస్ జపాన్ సిరీస్. ఇందులో ప్రధాన పాత్ర పేరు నరుటో. ఈ పాత్రకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. వారిలో రష్మిక కూడా ఒకరు. ఆమె చేసిన ఈ ఫన్నీ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వరుస సినిమాలతో రష్మిక ఫుల్ బిజీ
ఇక రష్మిక మందన్న కన్నడ మూవీ 'కిరాక్ పార్టీ' మూవీతో హీరోయిన్ గా వెండి తెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత తెలుగులో 'ఛలో' చిత్రంతో అడుగు పెట్టింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత స్టార్ హీరోలతో పలు సినిమాల్లో నటించింది. బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. ప్రస్తుతం బాలీవుడ్ లోనూ సత్తా చాటుతోంది. రష్మిక ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ మూవీ ‘పుష్ప-2’లో హీరోయిన్ గా నటిస్తోంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'యానిమల్' అనే సినిమా చేస్తోంది. 'రెయిన్ బో' అనే లేడీ ఓరియెంటెడ్ మూవీలోనూ నటిస్తోంది. టాలీవుడ్ లో నితిన్‌తో ఓ చేస్తోంది. అయితే, రీసెంట్ ఈ సినిమా నుంచి తను తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial