News
News
X

యాక్సిడెంట్ తర్వాత మొదటిసారిగా లైవ్‌లో మాట్లాడిన నటి 'రంభ'

తన కూతురు సాషా ఆసుపత్రిలో చికిత్స పొందుతుందని, తను త్వరగా కోలుకోవాలని ప్రార్ధించాలని రంభ కొన్ని ఫోటోలను షేర్ చేశారు. అయితే దీనిపై అప్డేట్ ఇస్తూ రంభ సోషల్ మీడియాలో లైవ్ లో మాట్లాడింది.

FOLLOW US: 
 
సినీ నటి రంభ నడుపుతున్న కారు ఇటీవల యాక్సిడెంట్‌కి గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో రంభ స్వల్ప గాయాలతో బయటపడినా, తన కూతురు సాషా ఆసుపత్రిలో చికిత్స పొందుతుందని, తను త్వరగా కోలుకోవాలని ప్రార్ధించాలని రంభ కొన్ని ఫోటోలను షేర్ చేశారు. అయితే దీనిపై అప్డేట్ ఇస్తూ రంభ సోషల్ మీడియా లైవ్‌లో మాట్లాడింది. అందరి ప్రార్థనలు ఫలించాయని తమ కుమార్తె పూర్తిగా కోలుకుందని సంతోషం వ్యక్తం చేసింది. తాను చాలా సంతోషంగా ఉన్నానని, తామంతా ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చేశామని పేర్కొంది. తమ కోసం ప్రార్థనలు చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపింది రంభ. 

కుటుంబంతో పాటు కెనడాలో సెటిల్ అయింది రంభ. రోజులాగే స్కూల్ నుంచి పిల్లల్ని కారులో తీసుకొస్తుండగా.. ఇంటర్‌ సెక్షన్ వద్ద రంభ కారుని మరో కారు వచ్చి ఢీకొట్టింది. కారులో తనతో పాటు పిల్లలు, ఆయా ఉన్నారు. అందరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అయితే రంభ కూతురు సాషా ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతోందని తమ కుమార్తె కోసం ప్రార్థనలు చేయాలని ఆమె కోరింది. ఈ నేపథ్యంలో తన కూతురు సాషా పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అవ్వడంతో లైవ్ వీడియోలో తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలిపింది రంభ.

చాలా రోజుల తర్వాత రంభ మొదటి సారిగా లైవ్ వీడియోలో కనిపించింది. దీంతో ఆమె అభిమానులు, స్నేహితులు సంతోషం వ్యక్తం చేశారు. ‘ఎలా ఉన్నారు మేడం, ఇండియాకు ఎప్పుడొస్తారు’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. లైవ్‌లో అభిమానుల స్పందన చూసి రంభ సంతోషం వ్యక్తం చేశారు. తాను తెలుగు అమ్మాయినే అని కాకపోతే ఇక్కడ సెటిల్ అయ్యానని అన్నారు. దాదాపు ఆరు, ఏడు భాషలు తాను మాట్లాడతానని, ఎక్కడికి వెళ్లినా ఆ భాషలో మాట్లాడతాను అని పేర్కొంది రంభ. తెలుగు, తమిళ్, కన్నడ, ఇంగ్లీష్, హిందీ, మలయాళ భాషలలో మాట్లాడి అందరికి థ్యాంక్స్ చెప్పింది రంభ. మీ అందరి అభిమానానికి రుణపడి ఉంటానన్నారు. ప్రస్తుతం తమ కుటుంబం మొత్తం సంతోషంగా ఉన్నాం అని తమ కోసం ప్రార్దించిన ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పింది రంభ. 

సుమారు వందకు పైగానే సినిమాల్లో రంభ నటించింది తెలుగు, తమిళ్, హిందీతో పాటు పలు భాషల్లో సినిమాలు చేసి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది రంభ. తర్వాత తమినాడు కు చెందిన వ్యాపార వేత్త ఇంద్రకుమార్‌ ని పెళ్లి చేసుకుంది, తర్వాత కుటుంబం తో పాటు కెనడాలో సెటిలైంది. వీరి వివాహం ఏప్రిల్ 10, 2010 లో జరిగింది. వీరికి ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి సంతానం ఉన్నారు. ఇటీవల ఆమెకి సౌత్ ఇండియా నుంచి సినిమా ఆఫర్లు వచ్చినా వెళ్ళలేదు. అయితే అప్పుడప్పుడు పలు టివి షో లలో కనిపిస్తూ సందడి చేస్తోంది రంభ. అయితే భవిష్యత్ లో సినిమాలు చేస్తుందో లేదో చూడాలి మరి.

News Reels

View this post on Instagram
 
A post shared by RambhaIndrakumar💕 (@rambhaindran_)

Published at : 02 Nov 2022 10:03 AM (IST) Tags: Rambha Actress Rambha

సంబంధిత కథనాలు

Aadi's Top Gear Teaser : ప్రాణం కోసం టాక్సీ డ్రైవర్ పరుగు - ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన 'టాప్ గేర్' టీజర్

Aadi's Top Gear Teaser : ప్రాణం కోసం టాక్సీ డ్రైవర్ పరుగు - ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన 'టాప్ గేర్' టీజర్

Gurtunda Seetakalam Trailer : తమన్నాతో రొమాన్స్, లవ్‌లో సత్యదేవ్ హెలికాప్టర్ షాట్ - ష్యూర్‌షాట్ హిట్‌లా ఉందిగా

Gurtunda Seetakalam Trailer : తమన్నాతో రొమాన్స్, లవ్‌లో సత్యదేవ్ హెలికాప్టర్ షాట్ - ష్యూర్‌షాట్ హిట్‌లా ఉందిగా

Lucky Lakshman Teaser : అమ్మాయిలను నమ్ముకున్నోడు పైకి రాలేడురా - 'లక్కీ లక్ష్మణ్' గాడి మాటలు విన్నారా?

Lucky Lakshman Teaser : అమ్మాయిలను నమ్ముకున్నోడు పైకి రాలేడురా - 'లక్కీ లక్ష్మణ్' గాడి మాటలు విన్నారా?

Guppedantha Manasu December 3rd Update: అపార్థాల మాస్టర్ లా తయారైన ఈగో మాస్టర్, గౌతమ్ కి మిత్రద్రోహి ట్యాగ్!

Guppedantha Manasu December 3rd Update:  అపార్థాల మాస్టర్ లా తయారైన ఈగో మాస్టర్, గౌతమ్ కి మిత్రద్రోహి ట్యాగ్!

Karthika Deepam December 3rd Update: మోనిత అరెస్ట్, వంటలక్క సేవలో డాక్టర్ బాబు,మరి శౌర్య పరిస్థితేంటి!

Karthika Deepam December 3rd Update: మోనిత అరెస్ట్, వంటలక్క సేవలో డాక్టర్ బాబు,మరి శౌర్య పరిస్థితేంటి!

టాప్ స్టోరీస్

పది రూపాయలు ఇచ్చి ఆ పని చేస్తున్నారు- బాలినేని కుమారుడిపై టీడీపీ సెటైర్లు

పది రూపాయలు ఇచ్చి ఆ పని చేస్తున్నారు- బాలినేని కుమారుడిపై టీడీపీ సెటైర్లు

Gujarat Elections: ప్రచార సభలో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్న ఒవైసీ - వైరల్ వీడియో

Gujarat Elections: ప్రచార సభలో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్న ఒవైసీ - వైరల్ వీడియో

Zero Cost Term Insurance: డబ్బు ఖర్చు లేకుండా బీమా- కట్టిన ప్రీమియాన్ని తిరిగిచ్చే 'జీరో కాస్ట్‌ టర్మ్‌ ఇన్సూరెన్స్‌'

Zero Cost Term Insurance: డబ్బు ఖర్చు లేకుండా బీమా- కట్టిన ప్రీమియాన్ని తిరిగిచ్చే 'జీరో కాస్ట్‌ టర్మ్‌ ఇన్సూరెన్స్‌'

RRR| SS Rajamouli wins Best Director|New York Film Critics Circleలో ఉత్తమ దర్శకుడు రాజమౌళి | | ABP

RRR| SS Rajamouli wins Best Director|New York Film Critics Circleలో ఉత్తమ దర్శకుడు రాజమౌళి | | ABP