By: ABP Desam | Updated at : 24 May 2023 03:16 PM (IST)
Photo Credit:PRIYANKA/twitter
బాలీవుడ్ లో పలు సూపర్ డూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ప్రియాంకా చోప్రా, ప్రస్తుతం హాలీవుడ్ లోకి వెళ్లిపోయింది. అక్కడ వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు చేస్తూ సక్సెస్ ఫుల్ గా కెరీర్ కొనసాగిస్తోంది. బాలీవుడ్ లోకి తిరిగి వచ్చే అవకాశం లేదని ఇప్పటికే వెల్లడించిన ప్రియాంక, వీలు దొరికినప్పుడల్లా బాలీవుడ్ లో తనకు ఎదురైన విపత్కర పరిస్థితుల గురించి వివరిస్తూనే ఉంది. తాజాగా మరో షాకింగ్ విషయాన్ని వెల్లడించింది.
సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టిన కొత్తలో ఓ దర్శకుడి ప్రవర్తన తన తనను షాక్ కు గురిచేసినట్లు వెల్లడించింది. ఏకంగా సెట్స్ లోనే తన లోదుస్తులు చూడాలని చెప్పడంతో మతిపోయిందని చెప్పింది. “నేను అప్పుడు బాలీవుడ్ లోకి వచ్చాను. ఓ సినిమా చేస్తున్నాను. ఆ సినిమాలో ఓ డ్యాన్స్ ఉంటుంది. ఆ సమయంలో సదరు సినిమా డైరెక్టర్ నా దగ్గరికి వచ్చి డ్యాన్స్ చేసే సమయంలో నీ లో దుస్తులు అన్నీ తొలగించాలని చెప్పాడు. నాకు ఓ రేంజిలో కోపం వచ్చింది. కానీ, ఏం చేయాలో అర్థం కాలేదు. అయినా, తను చెప్పినట్లు చేయలేదు. నెక్ట్స్ డే ఆ సినిమా నుంచి తప్పుకున్నాను. ఆ సినిమాలో నటించడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. నిజానికి ఆ దర్శకుడి మాటలు వినగానే పట్టలేని కోపం వచ్చింది. కొట్టాలనేంత కసి ఏర్పడింది. కానీ, అలా చేస్తే కెరీర్ కు ఇబ్బంది కలుగుతుందని భయపడ్డాను. నేను మౌనంగా ఉండి చాలా పెద్ద తప్పు చేశాను అనిపిస్తుంది” అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
కొద్ది సంవత్సరాల క్రితం వరకు కొన్ని విషయాలను బయటకు చెప్పాలంటే చాలా భయపడే దాన్ని అని ప్రియాంక రీసెంట్ గా చెప్పింది. అమెరికా వెళ్లిన కొత్తలో పక్కవారితో ఎలా స్నేహంగా ఉండాలో తెలిసేది కాదని చెప్పింది. “హైస్కూల్ ఎడ్యుకేషన్ కోసం అమెరికాకు వెళ్లాను. ఆ సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. అక్కడ వారితో ఎలా స్నేహంగా ఉండాలో తెలియలేదు. చివరికి క్యాంటీన్‌కు వెళ్లి అక్కడి ఫుడ్ ఎలా తీసుకోవాలో కూడా తెలిసేది కాదు. వెండింగ్ మిషన్ నుంచి స్నాక్స్ తీసుకొని ఎవరూ చూడకుండా తిని, క్లాస్ రూమ్ కి వెళ్లేదాన్ని. చాలా రోజుల పాటు వేరే వాళ్లతో కలిసి వెళ్లలేదు. నాకు ఉన్న భయం కారణంగానే అలా చేయాల్సి వచ్చింది” అని చెప్పుకొచ్చింది.
తాజాగా ప్రియాంక చోప్రా ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రియాంక చోప్రా, రిచర్డ్ మాడాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ ను, అమెజాన్ సంస్థ గ్రాండ్ గా రూపొందించింది. ‘అవెంజర్స్’, ‘కెప్టెన్ అమెరికా’ సినిమాలకు దర్శకత్వం వహించిన రుసో బ్రదర్స్ హాలీవుడ్ వెర్షన్ తెరకెక్కించారు. ఈ సిరీస్‌లో కళ్లు చెదిరే యాక్షన్ సీక్వెన్స్‌లు యాక్షన్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
Read Also: బాలీవుడ్ లో తీవ్ర విషాదం, హోటల్ గదిలో శవమై కనిపించిన ప్రముఖ నటుడు
Mahesh Babu: మహేష్ బాబు, త్రివిక్రమ్ మూవీ టైటిల్ వచ్చేసింది - మాస్ స్ట్రైక్ వీడియోతో సూపర్ స్టార్ రచ్చ!
మాస్ లుక్‌లో మహేష్, ప్రభాస్‌తో కమల్ ఢీ? - నేటి టాప్ 5 సినీ విశేషాలివే!
అనాథ పిల్లల కోసం ఇంటర్నేషనల్ స్కూల్ - మరో మంచి పనికి సోనూసూద్ శ్రీకారం
ఓ ఇంటివాడు కాబోతున్న ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల
Samantha Gown Worth : సమంత గౌను రేటు వింటే మతులు పోతాయ్ - సామ్ చాలా కాస్ట్లీ గురూ!
TSPSC Paper Leak Case: మరో 13 మంది అభ్యర్థులకు టీఎస్ పీఎస్సీ షాక్, జీవితాంతం ఎగ్జామ్ రాయకుండా డీబార్
Gorantla Butchaiah Chowdary: సీఎం జగన్ ఢిల్లీ వెళ్లినప్పుడల్లా అవినాష్ కేసుకు బ్రేకులు: గోరంట్ల బుచ్చయ్య సెటైర్లు
Margadarsi Case: మార్గదర్శి కేసు: సీఐడీ లుక్‌అవుట్ నోటీసులపై హైకోర్టుకు శైలజా కిరణ్
Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ విగ్రహం అంకురార్పణ - ఈ ఏడాది ఎన్ని అడుగులంటే ?
Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!