Nitesh Pandey Death: బాలీవుడ్ లో తీవ్ర విషాదం, హోటల్ గదిలో శవమై కనిపించిన ప్రముఖ నటుడు
హిందీ చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. హోటల్ గదిలో ప్రముఖ నటుడు శవమై కనిపించారు. ముంబైలోని ఇగత్‌పురిలో ఆయన మరణించినట్లు పోలీసులు వెల్లడించారు.
బాలీవుడ్ లో మరో అద్భుత నటుకు కన్నుమూశారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు నితీష్ పాండే ముంబైలోని ఓ హోటల్ గదిలో శవమై కనిపించారు. 51 ఏండ్ల నితీష్ ఇగత్ పురిలోని ఓ హోటల్లో ఆయన చనిపోయిన కనిపించినట్లు పోలీసులు వెల్లడించారు. గుండెపోటుతోనే ఆయన మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. శవపరీక్ష అనంతరం పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
TV actor Nitesh Pandey found dead at a hotel in Igatpuri, Nashik in Maharashtra. Prima facie, the cause of death seems to be a heart attack. A Police team present at the hotel and investigation is underway. Postmortem report is awaited. Questioning of hotel staff and people close… pic.twitter.com/UIEnosnZMo
— ANI (@ANI) May 24, 2023
నితీష్ పాండే మృతి పట్ల బాలీవుడ్ ప్రముఖుల దిగ్భ్రాంతి
నితీష్ పాండే మరణం గురించి తెలిసి బాలీవుడ్ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆయన మరణం పట్ల పలువురు సినీ దిగ్గజాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. సోషల్ మీడియా వేదికగా సినీ నటీనటులు ఆయనకు సంతాపం తెలుపుతున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఆయన అంత్యక్రియలకు సంబంధించిన వివరాలను కాసేపట్లో కుటుంబ సభ్యులు వెల్లడించే అవకాశం ఉంది.
Sad to hear about the sudden demise of actor #NiteshPandey Ji. His memorable performances have left a lasting impact on the entertainment industry. May his soul rest in peace. Sending heartfelt condolences to his family and friends during this difficult time. pic.twitter.com/Lly7vKiqU4
— Dr. Vivek Bindra (@DrVivekBindra) May 24, 2023
Since 3 days just getting bad news of death from the industry friends.
— AbRaam Paandey (@myabraam) May 24, 2023
Every day life teaches us that there is nothing called tomorrow.
So saddened by the news of passing away of Vaibhavi Upadhyay Aditya Singh Rajput & #NiteshPandey (due to cardiac arrest).
May god provide… pic.twitter.com/aXvgwWcMzl
నటనా రంగంలో 25 ఏండ్ల ప్రస్థానం
నితీష్ పాండే ఉత్తరాఖండ్ లోని అల్మోరా కుమావోన్ లో జన్మించారు. గత 25 సంవత్సరాలుగా ఆయన నటనా జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఎన్నో సీరియల్స్, టీవీ షోలతో పాటు సినిమాల్లోనూ అద్భుతంగా నటించి మెప్పించారు. ‘ప్యార్ కా దర్ద్ హై మీఠా మీఠా ప్యారా ప్యారా’, ‘ఇండియావాలి మా’, ‘ఏక్ రిష్తా సాజెదారీ కా’ సహా పలు టీవీ సిరీస్‌లు, ‘ఏక్ ప్రేమ్ కహానీ’, ‘సాయా’, ‘జస్టజూ’, ‘దుర్గేష్ నందిని’ లాంటి సీరియల్స్ తో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యారు. పలు సినిమాల్లోనూ ఆయన నటించి ఆకట్టుకున్నారు. ’ఓం శాంతి ఓం’,’దబాంగ్ 2′, ‘ఖోస్లా కా ఘోస్లా’, ‘మదారి’, ‘బదాయి దో’, ‘షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్’ లాంటి హిట్ సినిమాల్లో ఆయన కీలక పాత్రలు పోషించారు. ‘ఖోస్లా కా ఘోస్లా’లో నితీష్ పాండే నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. నితీష్ పాండే చివరిసారిగా ‘అనుపమ’, ‘ప్యార్ కా దర్ద్ హై మీఠా మీఠా ప్యారా ప్యారా’లో కనిపించారు.నితీష్ పాండే నటుడిగానే కాకుండా నిర్మాతగా మారి పలు సినిమాలను నిర్మించారు. డ్రీమ్ కాజిల్ ప్రొడక్షన్స్ పేరుతో స్వతంత్ర నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి అద్భుతంగా నడిపించారు. ఎన్నో చక్కటి సినిమాలను నిర్మించారు.
నితీష్ పాండే అశ్విని కల్సేకర్‌ను అయన వివాహం చేసుకున్నాడు. 2002లో ఈ ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత ‘జస్టజూ’అనే టీవీ షోలో పరిచయమైన నటి అర్పితా పాండేని నితీష్ 2003లో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరు కలిసి ఉంటున్నారు.
Read Also: టాలీవుడ్ హీరో నుంచి హన్సికకు వేదింపులంటూ వార్తలు - మీడియాపై ఆపిల్ బ్యూటీ ఆగ్రహం