Hansika Motwani: టాలీవుడ్ హీరో నుంచి హన్సికకు వేదింపులంటూ వార్తలు - మీడియాపై ఆపిల్ బ్యూటీ ఆగ్రహం
సౌత్ లో టాప్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న హన్సికకు టాలీవుడ్ యంగ్ హీరో నుంచి వేధింపులు ఎదురైనట్లు వార్తలు హల్ చల్ చేశారు.అయితే, ఈ ఊహాగానాలపై ఆపిల్ బ్యూటీ సీరియస్ అయ్యింది.
అందాల తార హన్సిక గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. బాల నటిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి, తక్కువ సమయంలోనే హీరోయిన్ గా ఎదిగింది. అందం, అభినయంతో సౌత్ లో టాప్ హీరోయిన్ గా పేరు సంపాదించింది. కొద్ది నెలల క్రితమే తన బాల్య స్నేహితుడు, వ్యాపారవేత్త అయిన సోహైల్ ఖతురియాను పెళ్లి చేసుకుంది. జైపూర్ వేదిగా అంగరంగ వైభవంగా జరిగిన ఈ వివాహ వేడుకకు పలువురు సినీ, వ్యాపార ప్రముఖులు హాజరయ్యారు. ప్రస్తుతం తన వైవాహిక జీవితాన్ని చాలా సంతోషంగా గడుపుతున్నారు.
వాస్తవాలు తెలుసుకుని రాస్తే మంచిది!
తాజాగా హన్సికు సంబంధించి ఓ వార్త నెట్టింట్లో తెగ చక్కర్లు కొట్టింది. పలు వార్తా సంస్థలు కూడా సదరు వార్తను ప్రసారం చేశాయి. ఇంతకీ ఆ వార్త ఏంటంటే? ఆమె కెరీర్ స్టార్టింగ్‌లో ఓ టాలీవుడ్ యంగ్ హీరో హన్సికను డేట్‌కు వెళ్దామంటూ తరచూ వేధించాడట. చివరకు ఆమె ఆ కుర్ర హీరోకు బుద్ది చెప్పిందట. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ పలు వెబ్ సైట్స్ వార్తలు రాసుకొచ్చాయి. తాజాగా ఈ వార్తలపై హన్సిక స్పందించింది. అవన్నీ కేవలం ఊహాగానాలు మాత్రమేనని తేల్చి చెప్పింది. “ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. నిరాధారమైన ఊహాగానాలతో నేను విసుగు చెందాను. ఇలాంటి కథనాలను ప్రచురించే ముందు వాస్తవాలను తెలుసుకుంటే బాగుంటుంది. మీడియాకు నేను ఇదొక్కటే విజ్ఞప్తి చేస్తున్నాను” అంటూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. హన్సిక వివరణతో రెండు మూడు రోజులుగా వస్తున్న వార్తలన్నీ కేవలం పుకార్లేనని తేలిపోయింది.
Publications urging you to cross check before picking up random news piece ! Never made this comment that's doing the rounds pls fact check before publishing blindly .
— Hansika (@ihansika) May 23, 2023
హన్సికకు మీడియా తలనొప్పులు
వాస్తవానికి ఇప్పటి చాలా సార్లు హన్సిక గురించి మీడియాలు పలు రకాల వార్తలు వచ్చాయి. హన్సిక సోహెల్ ఖతురియాను వివాహం చేసుకోవడం కూడా పలు విమర్శలకు దారితీసింది. తన బెస్ట్ ఫ్రెండ్ మాజీ భర్తనే హన్సిక పెళ్లి చేసుకున్నందున సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర స్థాయిలో ట్రోల్ చేశారు. హన్సిక కారణంగా సోహెల్ తన భార్యకు విడాకులు ఇచ్చారని మండిపడ్డారు. ఈ వార్తలపై సోహెల్ స్పందించారు. హన్సిక వల్లే తనకు బ్రేకప్ అయిందంటూ వచ్చిన వార్తలు అవాస్తవమని, నిరాధారమైనవని తేల్చి చెప్పారు. అటు బాల నటిగా ఉన్న తను త్వరగా పెద్ద అమ్మాయిలా కనిపించేందుకు తన తల్లి ఆమెకు హార్మోన్ ఇంజెక్షన్స్ ఇచ్చిందనే వార్తలు కూడా అప్పట్లో వినిపించాయి. వాటిని కూడా హన్సిక కొట్టిపారేసింది.
ఇక ప్రస్తుతం ప్రస్తుతం హన్సిక వరుస సినిమాలతో బిజీగా ఉంది. ‘పార్టనర్’, ‘105 మినిట్స్’, ‘నా పేరు శృతి’, ‘రౌడీ బేబీ’, ‘గాంధారి’, ‘గార్డియన్’ సినిమాల్లో నటిస్తోంది. అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘దేశ ముదురు’ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైన హన్సిక, అంతకు ముందే హిందీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె తొలి సినిమా మంచి హిట్ కావడంతో వరుస అవకాశాలు వచ్చాయి. పలు హిట్ చిత్రాలతో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. ఆ తర్వాత కొన్ని ఫ్లాప్స్ ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో తను తెలుగు సినిమా పరిశ్రమ నుంచి తమిళంలోకి వెళ్లింది. అక్కడ ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా సత్తా చాటుతోంది.
Read Also: వర్షిణి ప్రేమలో సుందర్! - తన కంటే ఆరేళ్లు చిన్నోడితో డేటింగ్?