Pragathi: జిమ్ ట్రైనర్ తో ప్రగతి వీడియో, అవాక్కవాల్సిందే!
తన జిమ్ ట్రైనర్ తో కలిసి ప్రగతి చేసిన వర్కవుట్ ఫీట్లు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.
సీనియర్ నటి ప్రగతి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో తెలిసిందే. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను షేర్ చేస్తుంటుంది. అందులో చాలా వరకు డాన్స్ అండ్ వర్కవుట్ వీడియోలు కనిపిస్తుంటాయి. మొన్నామధ్య 'ఊ అంటావా మావా' ఐటెం సాంగ్ స్టెప్పులేసి అదరగొట్టింది. తాజాగా ఈమె ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తన జిమ్ ట్రైనర్ తో కలిసి ప్రగతి చేసిన వర్కవుట్ ఫీట్లు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. సినిమాల్లో అమ్మ, అత్త పాత్రలు పోషించే ప్రగతి రియల్ లైఫ్ లో మాత్రం చాలా హాట్ గా కనిపించడానికి ఇష్టపడుతుంది. దానికి తగ్గట్లే ఫిజిక్ ను మెయింటైన్ చేయడం కోసం చాలా కష్టబడుతూ ఉంటుంది. గంటలు తరబడి జిమ్ లో వర్కవుట్లు చేస్తుంటుంది. ఈ క్రమంలో తాజాగా ఆమె ఓ వీడియోను షేర్ చేసింది.
తన వ్యాయామంలో భాగంగా జిమ్ ట్రైనర్ ను తన కాళ్లపై నిల్చోబెట్టుకొని కనిపించింది. గోడ కుర్చీ వేసినట్లుగా కూర్చొని.. ఎలాంటి సపోర్ట్ లేకుండా జిమ్ ట్రైనర్ ని తన కాళ్లపై నిలబెట్టుకోవడం చూసి షాక్ అవుతున్నారు నెటిజన్లు. సెలబ్రిటీలు సైతం ఈ వీడియోపై రియాక్ట్ అవుతున్నారు. గతంలో కూడా ప్రగతి ఇలాంటి వీడియోలను షేర్ చేసి వార్తల్లో నిలిచింది.
View this post on Instagram
View this post on Instagram