By: ABP Desam | Updated at : 15 Mar 2023 05:30 PM (IST)
Edited By: Mani kumar
Image Credit: Payal Ghosh/Instagram
సినీ నటి పాయల్ ఘోష్ పేరు మరో సారి వార్తల్లోకి ఎక్కింది. తెలుగులో కూడా పలు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుంది పాయల్. గతంలో #MeToo ఉద్యమంలో కూడా ఆమె పేరు వినిపించింది. తాజగా మరోసారి నెట్టింట హాట్ టాపిక్ గా నిలిచింది ఈ బ్యూటీ. సోషల్ మీడియాలో ఓ సూసైడ్ నోట్ ఫోటోను షేర్ చేసి అందర్నీ షాక్ కు గురిచేసింది పాయల్. దీంతో ఏమైంది అంటూ ఆమె అభిమానులతో పాటు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇంతకీ ఏం జరిగిందంటే.. పాయల్ నాలుగు రోజుల క్రితం సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. అందులో ఓ చేతిలో సూసైడ్ నోట్ లాంటిది కనిపించింది. ‘‘నేను పాయల్ ఘోష్ ను, ఒక వేళ నేను సూసైడ్ చేసుకున్నా లేదా హార్ట్ ఎటాక్ తో చనిపోయినా దానికి కారణం ఎవరంటే?’’ అంటూ రాసి మిగతా ఖాళీను ఏమీ రాయకుండా వదిలేసింది. ఈ పోస్ట్ చూసి అందరూ షాక్ కు గురయ్యారు. దీంతో ఆమె పోస్ట్ పై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. అసలు పాయల్ కు ఏమైంది, ఏమైనా సమస్య ఉందా, ఎందుకు ఇలా చేసింది అంటూ ఆమె గురించి ఆరా తీస్తున్నారు. ఇంకొంత మంది ఇలా ఆలోచించకూడదు, ఎందుకైనా మంచిది ఓసారి డాక్టర్లను సంప్రదించు అంటూ అడ్వైజ్ ఇస్తున్నారు. ఈ పోస్ట్ వైరల్ కావడంతో ఆమె.. ఇన్‌స్టాగ్రామ్ నుంచి తొలగించింది.
పాయల్ కలకత్తాకు చెందిన నటి. మంచు మనోజ్ నటించిన ‘ప్రయాణం’ సినిమాతో సినీరంగంలో అడుగుపెట్టింది పాయల్. తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘ఊసరవెల్లి’ సినిమాలో నటించి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత ‘మిస్టర్ రాస్కెల్’ సినిమాలో కూడా నటించింది. ఈ సినిమాల తర్వాత ఆమెకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ కు వెళ్ళింది. తర్వాత పెద్దగా సినిమాల్లో రానించలేదు. అయితే సోషల్ మీడియా వేదికగా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటుంది పాయల్. గతంలో బాలీవుడ్ నిర్మాత అనురాగ్ కశ్యప్ పై లైంగిక ఆరోపణలు చేసింది. ఆయనపై పోలీస్ ష్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఆ సమయంలో పాయల్ ఎక్కువగా వార్తల్లో కనిపించింది.
అంతే కాకుండా మూడేళ్ల క్రితం నటి మీరా చోప్రాకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు మధ్య ట్విట్టర్ వార్ జరిగింది. ఆ సమయంలో ఆమె ఎన్టీఆర్ ఎవరో అన్నట్టుగా మాట్లాడింది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెను విపరీతంగా ట్రోలింగ్ చేయడం ప్రాంభించారు. ఈ వివాదం మధ్యలో ఎంటరైంది పాయల్. ఎన్టీఆర్ ఎంతో మంచి నటుడని, తాను ఆయనతో కలసి నటించానని చెప్పుకొచ్చింది. మీరాపై వ్యతిరేక వ్యాఖ్యలు చేయడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు దగ్గరైంది. అప్పటి నుంచీ ఎన్టీఆర్ గురించి ఏదొక వ్యాఖ్యలు చేస్తూ వస్తోంది పాయల్. ఇటీవల సోషల్ మీడియాలో మాట్లాడిన పాయల్.. ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ అవుతాడని తాను 2020 లోనే చెప్పానని, అప్పుడు అందరూ నవ్వుకున్నారని అంది. ఇప్పుడు అంతర్జాతీయ ఆస్కార్ వేదికపై ఎన్టీఆర్ పేరు వినిపిస్తోందని చెప్పింది. దీంతో పాయల్ వ్యవహారం మళ్లీ వార్తల్లోకి ఎక్కింది.
Read Also: మీకు తెలుసా? చెర్రీ, ఉపాసన ఎక్కడకెళ్లినా చిన్న సైజు ఆలయాన్ని వెంట తీసుకెళ్తారట!
Tollywood: మహేశ్ తర్వాత నానినే - మిగతా స్టార్స్ అంతా నేచురల్ స్టార్ వెనుకే!
Taraka Ratna Wife Alekhya : కోయంబత్తూరు వెళ్లిన తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డి
Pawan Kalyan Movie Title : అబ్బాయి అకీరా నందన్ బర్త్ డేకు పవన్ కళ్యాణ్ కొత్త సినిమా టైటిల్?
Janaki Kalaganaledu April 1st: రౌడీ దుమ్ముదులిపిన జానకి- జ్ఞానంబకి పెద్దకోడలు మీద చాడీలు చెప్పిన పెట్రోల్ మల్లిక
Pushpa 2 OTT Rights Price : 'పుష్ప 2' ఓటీటీ రైట్స్కు 200 కోట్లు - ఇదంతా 'ఆర్ఆర్ఆర్' సక్సెస్ మహిమేనా?
ఎమ్మెల్సీ కవిత జగిత్యాల పర్యటనలో అపశృతి- టూర్ రద్దు చేసుకొని తిరిగి పయనం
మంత్రివర్గ విస్తరణలో జగన్ టార్గెట్స్ ఇవేనా- మరి సీనియర్లు ఏమనుకుంటున్నారు?
నిజామాబాద్లో ఫ్లెక్సీ వార్- నిన్న పసుపు బోర్డుపై బీఆర్ఎస్ సైటర్- నిరుద్యోగ భృతి ఎక్కడా అంటూ బీజేపీ కౌంటర్
శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో టెన్షన్ టెన్షన్ - పల్లె రఘునాథ్ రెడ్డి వర్సెస్ శ్రీధర్ రెడ్డి