By: ABP Desam | Updated at : 29 Mar 2023 10:16 AM (IST)
Edited By: anjibabuchittimalla
Photo@Keerthy Suresh/instagram
నేచురల్ స్టార్ నాని, ‘మహానటి’ బ్యూటీ కీర్తి సురేష్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘దసరా’. నాని కెరీర్ లో తొలిసారి పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. ఈ సినిమాపై ఆడియెన్స్ లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. విడుదలకు ముందు నుంచే ఓరేంజిలో హైప్ క్రియేట్ చేయడంతో, భారీ అంచనాలు నెలకొన్నాయి. బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ ను సొంతం చేసుకుంటుందని మేకర్స్ భావిస్తున్నారు.
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన 'దసరా', శ్రీరామనవమి కానుకగా మార్చి 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. సింగరేణి ప్రాంత నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు ఆకట్టుకుంటున్నాయి. ఈ మూవీలో హీరో నాని, కీర్తి సురేష్ సరికొత్త లుక్ లో కనిపించనున్నారు. తొలిసారి ఇద్దరూ పూర్తి స్థాయి డీగ్లామర్ రోల్స్ చేస్తున్నారు. ప్రస్తుతం మూవీ టీమ్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో మూవీ టీమ్ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
తాజాగా చిత్రం బృందం ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా నటి కీర్తి సురేష్ ఓ సీన్ విషయంలో దర్శకుడు నాలుగు పళ్లతో నవ్వమన్నాడంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. “ఒకరోజు షూట్ జరుగుతోంది. క్లోజప్ షాట్ తీస్తున్నారు. సింపుల్ షాట్. నేను నవ్వాలి. నవ్వాను అయిపోయింది. కానీ, ఇంకా మరోసారి ట్రై చేయమన్నాడు. సమ్ థింగ్ వేరేలా చేయాలన్నాడు. రెండు మూడు టేక్స్ అయ్యాయి. ఆ తర్వాత వచ్చి, నవ్వితే నాలుగు పళ్లు మాత్రమే కనిపించాలని చెప్పాడు. నవ్వితే కేవలం నాలుగు పళ్లే కనిపించాలి అన్నాడు. సేమ్, సెట్ లో అందరూ ‘మహానటి’ పాత్రను గుర్తు చేసుకున్నారు. అక్కడ ఒకే కంటనీరు, ఇక్కడ నాలుగు పళ్లతో నవ్వు అనుకున్నారు. కానీ, చివరకు తను అనుకున్నది చేయించుకున్నాడు. నాలుగు పళ్లు కనిపించేలా నవ్వడంతో షాట్ ఓకే అయ్యింది” అని కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది.
ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరుగుతుంది. అల్లు అర్జున్ 'పుష్ప', యశ్ 'కేజీఎఫ్'లతో పోటీ పడుతూ.. రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్ లు నమోదవుతున్నాయి. 'దసరా' సినిమాకు మొదటి రోజు ఇండియా అంతటా 86,000 టిక్కెట్లు అమ్ముడైనట్టు తెలుస్తోంది. అన్ని భాషలలో కలిపి రూ. 1.6 కోట్ల గ్రాస్ వసూలు చేసి రికార్డు సృష్టిస్తోంది. ఇందులో ఒరిజినల్ తెలుగు వెర్షన్ నుంచే రూ.1.57 కోట్లు రాబట్టడం విశేషం. ఓవర్సీస్ సహా ఎన్నో ప్రాంతాల్లో టికెట్లు బుకింగ్స్ మంచి ఫ్లోలో వెళుతోంది. ఈ మూవీకి అన్ని ఏరియాల్లోనూ అదిరిపోయే స్పందన వస్తోంది. ఈ సినిమాను ఏఏ సినిమాస్, స్టార్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. సంతోష్ నారాయణ్ సంగీతాన్ని అందించారు. తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో మార్చి 30 న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read Also: ఆ ఎంపీతో బాలీవుడ్ నటి పరిణితీ చోప్రా పెళ్లి? అసలు విషయం చెప్పేసిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత
‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్
Adipurush Trailer: ‘ఆదిపురుష్’ ఫైనల్ ట్రైలర్ - భీకర యుద్ధంలో కదంతొక్కిన రామసేన!
ప్రభాస్ తనలో రాముడిని బయటకు తెచ్చారు, నేటితరానికి ఈ మూవీ అవసరం: చిన్న జీయర్ స్వామి
రామ్ చరణ్ సినిమా కోసం 'RRR' ఫార్ములాను ఫాలో అవుతున్న బుచ్చిబాబు!
వివాదంలో ‘2018’ మూవీ - జూన్ 7 నుంచి థియేటర్స్ బంద్, ఎందుకంటే..
Academic Calendar: తెలంగాణలో పాఠశాలల కొత్త అకడమిక్ క్యాలెండర్ విడుదల - పరీక్షలు, సెలవుల వివరాలు ఇలా!
Cyclone Biparjoy: అరేబియా సముద్రంలో బిపర్జోయ్ తుపాను, వచ్చే 5 రోజులు ఇక్కడే బీభత్సమే - ఐఎండీ హెచ్చరిక
Odisha Train Accident: రైలు ప్రమాదంలో మృతుల సంఖ్యపై ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన, మళ్లీ పాత మాటే!
Kakinada MP Vanga Geetha: వైసీపీ ఎంపీ వంగా గీత నుంచి ప్రాణహాని! స్పందనలో కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన ఆడపడుచు