Isha Koppikar: ఆ స్టార్ హీరో ఒంటరిగా రమ్మన్నాడు- కాస్టింగ్ కౌచ్ గురించి ఇషా కొప్పికర్ షాకింగ్ కామెంట్స్
ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. తాజాగా తనకూ అలాంటి అనుభవం ఎదురైందని హీరోయి ఇషా కొప్పికర్ వెల్లడించింది. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఈ ఘటన జరిగినట్లు చెప్పింది.
Isha Koppikar About Her Casting Couch Experience: సినిమా పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ఉందా? లేదా? అనే విషయం మీద ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంది. సీనియర్ నటి కస్తూరి శంకర్ లాంటి వాళ్లు సినిమా పరిశ్రమలో అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ కాస్టింగ్ కౌచ్ లేదని చెప్తున్నా, చాలా మంది హీరోయిన్లు తమకు ఎదురైన కమిట్మెంట్ ఘనటల గురించి చెప్తూనే ఉన్నారు. అవకాశాల ఎర చూపి శారీరకంగా వాడుకునే ప్రయత్నాలు చేశారంటూనే ఉన్నారు.
ఆ ఒత్తిళ్లను తట్టుకోలేక ఇండస్ట్రీనే వదిలేశారు
తాజాగా హీరోయిన్ ఇషా కొప్పికర్ కూడా తనకు ఎదురైన కాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని వివరించింది. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో తనకు ఇలాంటి అనుభవాలు ఎదురైనట్లు చెప్పింది. “సినిమా పరిశ్రమలోని హీరోలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. తమ సినిమాలో ఎవరు నటించాలి అనే విషయాన్ని కూడా వాళ్లు ప్రభావితం చేస్తారు. తమ మూవీలో సెలెక్ట్ చేసిన హీరోయిన్లను కమిట్మెంట్ కోసం ఒత్తడి చేసిన సందర్భాలు ఉన్నాయి. చాలా మంది హీరోయిన్లు వారి ఒత్తిడి తట్టుకోలేక సినిమా నుంచే కాదు, ఇండస్ట్రీ నుంచి తప్పుకున్న వాళ్లు ఉన్నారు. నా లాంటి కొంత మంది ఆ ఒత్తిళ్లను తట్టుకుని మరీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు” అని చెప్పుకొచ్చింది.
నాకూ అలాంటి అనుభవాలు ఎదురయ్యాయి
తనకూ కాస్టింగ్ కౌచ్ అనుభవాలు ఎదురైనట్లు ఇషా కొప్పికర్ వెల్లడించింది. “సినిమా పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో నాకూ అలాంటి సంఘటనలు ఎదురయ్యాయి. అవకాశాలు రావాలంటే హీరోలు, నిర్మాతలతో ఫ్రెండ్లీగా ఉండాలని కొంత మంది అడ్వయిజ్ ఇచ్చారు. కొంత కాలం తర్వాత ఓ స్టార్ హీరో నుంచి నాకు అలాంటి అనుభవం ఎదురయ్యింది. ఓ రోజు నన్ను ఒంటరిగా కలవాలన్నారు. నాతో పాటు డ్రైవర్ అసిస్టెంట్ కూడా రావొద్దని చెప్పారు. నేను ఇప్పటికే కొంత మంది హీరోయిన్లతో రిలేషన్ షిప్ లో ఉన్నానని రూమర్స్ ఉన్నాయి. ఆ ఇబ్బంది రాకుండా ఉండాలంటే, ఎవరూ లేకుండా ఒంటరిగా కలవడానికి రావడం మంచిదన్నారు. కానీ, నేను అతడిని కలిసేందుకు వెళ్లలేదు” అని ఇషా వివరించింది. అయితే, ఆ హీరో ఎవరు? అనే విషయాన్ని మాత్రం బయటకు చెప్పలేదు.
తెలుగులో పలు సినిమాలు చేసిన ఇషా కొప్పికర్
ఇషా కొప్పికర్ సౌత్ తో పాటు నార్త్ లోనూ పలు సినిమాలు చేసింది. తెలుగు, తమిళం, కన్నడతో పాటు హిందీలోనూ హీరోయిన్ గా రాణించింది. ‘W/o వర ప్రసాద్’ సినిమా అనే సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టింది. ఈ సినిమాలో కేవలం ఆమె ఓ పాట మాత్రమే చేసింది. ఆ తర్వాత నాగార్జునతో కలిసి ‘చంద్రలేఖ’ అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత ‘ప్రేమతో రా’ అనే మూవీలోనూ కనిపించింది. ఆమె చివరగా తెలుగులో ‘కేశవా’ అనే సినిమాలో నటించింది. తమిళంలోనూ పలు సినిమాలు చేసిన ఆమె, ఆ తర్వాత బాలీవుడ్ లోకి వెళ్లిపోయింది.
Also Read: విజయ్ ‘గోట్’ నుంచి రెండో పాట విడుదల - చనిపోయిన సింగర్ వాయిస్‌ను రీక్రియేట్ చేసిన మేకర్స్