Actress Esther: 'నో' చెప్తే కెరీర్ ఉండదని బెదిరించారు, క్యాస్టింగ్ కౌచ్ పై నటి ఎస్తర్ వ్యాఖ్యలు
రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎస్తర్ తన విడాకులకు చాలా కారణాలున్నాయని చెప్పుకొచ్చింది

టాలీవుడ్ లో హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టిన నటి ఎస్తర్ కి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. 'భీమవరం బుల్లోడు', 'గరం', 'జయ జానకి నాయక' లాంటి సినిమాల్లో నటించింది ఎస్తర్. హీరోయిన్ గా ఛాన్స్ లు రాకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ప్రయత్నించింది కానీ వర్కవుట్ అవ్వలేదు. అదే సమయంలో ప్రముఖ సింగర్ నోయెల్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ ఈ జంట ఎక్కువకాలం కలిసి ఉండలేకపోయింది. పెళ్లైన ఏడాదిలోపే విడాకులు తీసుకున్నారు.
రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎస్తర్ తన విడాకులకు చాలా కారణాలున్నాయని చెప్పుకొచ్చింది. తన లైఫ్ పెళ్లి చేసుకోవడమనేది చాలా పెద్ద డెసిషన్ అని.. అలాంటిది అంత త్వరగా ఎండ్ కార్డ్ పడుతుందనుకోలేదని చెప్పుకొచ్చింది. నోయెల్ తో విడిపోవడానికి చాలా కారణాలున్నాయని.. ముఖ్యంగా అతడి బాగా అబద్ధాలు చెప్పేవాడని తెలిపింది. ఇదే సమయంలో ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ సమస్యలు ఎదుర్కొన్నట్లు చెప్పింది.
సినిమా ఇండస్ట్రీలో ఆఫర్స్ రావాలంటే కమిట్మెంట్ ఇస్తావా..? అని చాలా మంది అడిగారని.. వాటికి ఒప్పుకోకపోతే కెరీర్ ఇక్కడితోనే ముగిసిపోతుంది బెదిరించారని తెలిపింది. కమిట్మెంట్ కోసం నేరుగా అడగకపోయినా.. అర్ధమయ్యేలానే కన్వే చేస్తారని చెప్పుకొచ్చింది. సినిమా అంటే చాలా ఇష్టం కానీ అదే నా జీవితం కాదని చెప్పింది ఎస్తర్.
అవకాశాల కోసం అంతగా దిగజారే అవసరం తనకు లేదని చెప్పింది. అందుకే 'నో' చెప్పానని.. అవకాశాలు ఇలానే వస్తాయంటే నాకవరసరం లేదని తేల్చి చెప్పింది ఎస్తర్. ఈ క్యాస్టింగ్ కౌచ్ విషయంలో తప్పు ఎవరో ఒకరిది అని చెప్పలేమని తన అభిప్రాయాన్నివెల్లడించింది. సినిమా వాళ్లు అడగకపోయినా.. కమిట్మెంట్ ఆఫర్ చేసేవాళ్లు ఉన్నారని కామెంట్స్ చేసింది ఎస్తర్. ఈ విషయంలో ఎవరినీ బ్లేమ్ చేయలేమని చెప్పుకొచ్చింది.
View this post on Instagram





















