అన్వేషించండి

Charmme Kaur: బతకండి, బతకనివ్వండి - ట్విట్టర్‌కు బ్రేక్ చెబుతూ ఛార్మీ కామెంట్స్

ప్రముఖ హీరోయిన్, ప్రొడ్యూసర్ ఛార్మి కీలక నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియాకు కొంత కాలం పాటు బ్రేక్ తీసుకుంటున్నట్లు వెల్లడించింది..

తెలుగు సినిమా పరిశ్రమలో హీరోయిన్‌గా అడుగు పెట్టిన అందాల తార ఛార్మి.. తక్కువ  సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తన అందచందాలకు తోడు చక్కటి నటనతో వరుస అవకాశాలు దక్కించుకున్నారు. టాలీవుడ్ టాప్ హీరోలతో కలిసి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించారు. తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. కొద్ది రోజుల్లోనే టాప్ హీరోయిన్ గా ఎదిగారు.  ఆ తర్వాత నెమ్మదిగా వెండి తెరకు దూరమయ్యారు. తెర మీద కనిపించడం మానేసినా.. సినిమా పరిశ్రమలో కొనసాగారు. మాస్ దర్శకుడు పూరి జగన్నాథ్ తో కలిసి నిర్మాతగా మారి, సినిమాలు నిర్మించడం మొదలు పెట్టారు. ‘పూరి కనెక్ట్స్‘ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించి పలు సినిమాలకు ప్రొడ్యూస్ చేస్తున్నారు. వీరిద్దరు కలిపి నిర్మించిన ‘ఇస్మార్ట్ శంకర్’ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.  తాజాగా తెరకెక్కిన లైగర్ పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయినా.. ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేదు.  

ట్విట్టర్ కు ఛార్మి బ్రేక్..

ఓ వైపు సినిమాల్లో ఎంతో బిజీగా ఉన్నా.. మరోవైపు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు ఛార్మి. ఆమె షేర్ చేసే ఫోటోలు, వీడియోలు ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి. లైగర్ నేపథ్యంలో ఎప్పటికప్పుడు సినిమాకు సంబంధించిన కీలక విషయాలను వెల్లడిస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించారు. సినిమాలను సంబంధించిన  అప్‏డేట్స్‏తో పాటు, తన వ్యక్తిగత వివరాలను కూడా షేర్ చేసుకుంటూ అభిమానులతో టచ్ ‏లో ఉంటున్నారు. అయితే ఛార్మి తాజాగా కీలక విషయాన్ని వెల్లడించారు.  సోషల్ మీడియా నుంచి విరామం తీసుకుంటున్నానంటూ సంచలన ప్రకటన చేశారు. “చిల్ గాయ్స్! సోషల్ మీడియా నుంచి చిన్న బ్రేక్ తీసుకుంటున్నాను. పూరీ కనెక్ట్స్ తో  మళ్లీ పెద్ద విషయంతో తిరిగి వస్తా. అప్పటి వరకు బతకండి, బతకనివ్వండి” అని ప్రకటించారు.  

విరామానికి కారణం ఇదేనా?

ఛార్మి చేసిన తాజా ప్రకటనతో సినీ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. సోషల్ మీడియా నుంచి ఛార్మి ఎందుకు  విరామం తీసుకున్నారు? అని ఆలోచిస్తున్నారు.  ఛార్మికి ప్రస్తుతం ట్విట్టర్ లో ఆరున్నర లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఛార్మి సన్నిహితులు మాత్రం ఆమె ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉండటం వల్లే సోషల్ మీడియాకు విరామం ప్రకటించారని చెబుతున్నారు.  తాజాగా ఆమె నిర్మాతగా వ్యవహరించిన లైగర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాభవం పొందింది. సౌత్ నుంచి నార్త్ వరకు అన్ని భాషల్లోనూ డిజాస్టర్ గా నిలిచింది. నిర్మాతగా కోలుకోలేని దెబ్బ తిన్నారు. అయినా  విజయ్ దేవరకొండతో కలిసి పూరి జగన్నాథ్ ‘జన గణ మన‘ అనే సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాను పూరి, ఛార్మి కలిసి నిర్మిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నందునే ఛార్మీ సోషల్ మీడియాకు విరామం ప్రకటించినట్లు తెలుస్తోంది.  

గతంలోనూ ట్విట్టర్ కు విరామం

ఇప్పుడే కాదు.. గతంలోనూ ఛార్మి ఓసారి ట్విట్టర్ కు విరామం ప్రకటించారు. లైగర్ సినిమా ప్రారంభం సమయంలో కొంత కాలం సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారు. తాజాగా మరోసారి సోషల్ మీడియాకు విరామం ప్రకటించారు. మళ్లీ ఏ న్యూస్ తో సోషల్ మీడియాలో అడుగు పెడుతారోనని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read : ఎన్టీఆర్‌ను టార్గెట్ చేసిన కేసీఆర్? - దెబ్బకు రెండున్నర కోట్ల నష్టం

Also Read : ఫ్లాప్‌ల‌తో క‌ట్టిన స్టార్‌డ‌మ్ కోట - ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ క్రేజ్ వేరే లెవల్

టాప్ హెడ్ లైన్స్

Anasuya Bharadwaj : భర్త చనిపోతే బొట్టు, గాజులు తీసేయాలా? - అనసూయ ఎమోషనల్ వీడియో
భర్త చనిపోతే బొట్టు, గాజులు తీసేయాలా? - అనసూయ ఎమోషనల్ వీడియో
Zombie Reddy 2 : జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
NBK111 Release Date : NBK111 రిలీజ్ డేట్ ఫిక్స్! - బాలయ్య మూవీ షూటింగ్ మళ్లీ ఎప్పుడంటే?
NBK111 రిలీజ్ డేట్ ఫిక్స్! - బాలయ్య మూవీ షూటింగ్ మళ్లీ ఎప్పుడంటే?
Miss Apoorva: బోల్డ్ & బ్యూటిఫుల్ మిస్ అపూర్వ.. బిగ్ బాస్ అగ్నిపరీక్షలో దుమ్మురేపుతోన్న కామనర్.. మోడలింగ్ నుంచి గ్లామర్ హౌస్ వరకు!
బోల్డ్ & బ్యూటిఫుల్ మిస్ అపూర్వ.. బిగ్ బాస్ అగ్నిపరీక్షలో దుమ్మురేపుతోన్న కామనర్

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
Kesineni Nani: విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
IND VS SL Padikkal Hundred: పడిక్కల్ సూపర్ సెంచరీ.. భారీ స్కోరు దిశ‌గా టీమిండియా.. రాణించిన గిల్, జ‌డేజా, జైస్వాల్, పంత్ ఇంజ్యూరీ సస్పెన్స్, లంక‌తో రెండో టెస్టు!
పడిక్కల్ సూపర్ సెంచరీ.. భారీ స్కోరు దిశ‌గా టీమిండియా.. రాణించిన గిల్, జ‌డేజా, జైస్వాల్, పంత్ ఇంజ్యూరీ సస్పెన్స్, లంక‌తో రెండో టెస్టు!
Viral Video: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
Zombie Reddy 2 : జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
Anagani Satya Prasad: అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
Auto Drivers Strike: చర్చల ద్వారానే సమస్య పరిష్కారం.. ఆటో కార్మికులు సమ్మెకు వెళ్లొద్దని మంత్రి పొన్నం విజ్ఞప్తి
చర్చల ద్వారానే సమస్య పరిష్కారం.. ఆటో కార్మికులు సమ్మెకు వెళ్లొద్దని మంత్రి పొన్నం విజ్ఞప్తి
Gachibowli Building Collapse: గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
Embed widget