Actress Amala Paul: నటి అమలా పాల్‌కు అవమానం, ఆలయంలోకి రానివ్వని అధికారులు
సినీ నటి అమలా పాల్ కు అవమానం జరిగింది. కేరళ తిరువైరాణికుళం మహాదేవ ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఆమెను అధికారులు అడ్డుకున్నారు.
![Actress Amala Paul: నటి అమలా పాల్‌కు అవమానం, ఆలయంలోకి రానివ్వని అధికారులు Actress Amala Paul denied entry to Kerala temple says Religious discrimination still exists in 2023 Actress Amala Paul: నటి అమలా పాల్‌కు అవమానం, ఆలయంలోకి రానివ్వని అధికారులు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/18/86d79bd4e4d4befbade5c3d29a3c27d61674029725363544_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
అమలా పాల్.. సౌత్ లో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించిన ముద్దుగుమ్మ. తెలుగులోనూ పలువురు అగ్ర హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. ‘ఇద్దరమ్మాయిలు’ సినిమాలో అల్లు అర్జున్ సరసన నటించి అదరగొట్టింది. ఆ తర్వాత పలు సినిమా అవకాశాలను దక్కించుకుంది. గతకొంత కాలంగా పెద్దగా సినిమా అవకాశాలు రావడం లేదు. అడపాదడపా వెండి తెరపై దర్శనం ఇస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు, అదే స్థాయిలో కాంట్రవర్సీలతోనూ వెలుగులో ఉంటోంది. తాజాగా అమలా పాల్ కు కేరళలో పెద్ద అవమానం జరిగింది.
అమలా పాల్ ను ఆలయంలోకి రానివ్వని అధికారులు
ఈ గ్లామర్ బ్యూటీ తాజాగా ఎర్నాకులం వెళ్లింది. అక్కడున్న మహాదేవ ఆలయంలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవాలి అనుకుంది. అనుకున్నట్లుగానే ఆలయానికి వెళ్లింది. అక్కడే ఆమెకు అసలు అవమానం ఎదురయ్యింది. ఆలయ అధికారులు అమ్మవారిని దర్శించుకోకుండా అడ్డుకున్నారు. ఆమె క్రైస్తవ కుటుంబానికి చెందినది కావడంతో మహాదేవ ఆలయంలోకి రాకూడదని పూజారులు తేల్చి చెప్పారు. ఈ ఆలయంలోకి కేవలం హిందూ భక్తులకు మాత్రమే ప్రవేశం ఉందన్నారు. అన్యమతస్తులు ఎవరూ ఆలయ ప్రాంగణంలో అడుగు పెట్టకూడదని చెప్పారు. అంతగా కావాలంటే ఆలయం ముందున్న అమ్మవారిని దర్శించుకోని వెళ్లాలని చెప్పారు. ఆలయ పూజారుల మాటలతో ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయింది.
మత పరమైన వివక్ష కొనసాగడం చాలా బాధాకరం
ఈ అవమానం పట్ల అమలా పాల్ చాలా ఫీలయ్యింది. అక్కడున్న విజిటర్స్ రిజిస్టర్ లో తనకు జరిగిన చేదు అనుభవాన్ని వివరించింది. “2023 సంవత్సరంలోనూ మత పరమైన వివక్ష కొనసాగడం చాలా బాధాకరం, విచారకరం. ఆలయంలోకి నన్ను రానివ్వకపోవడం చాలా నిరాశ కలిగించింది. నేను అమ్మవారి చెందకు చేరుకుని ఉండకపోవచ్చు. కానీ దూరం నుంచి ప్రార్థించాను. తన ఆత్మను స్మరించుకున్నాను. త్వరలోనే మత పరమైన వివక్ష పోతుందని ఆశిస్తున్నాను. ప్రజలను మతం ప్రాతిపదికన కాకుండా సమానంగా చూసే రోజు రావాలని కోరుకుంటున్నాను” అని రాసుకొచ్చింది.
వివరణ ఇచ్చిన మహాదేవ ఆలయ ట్రస్ట్ అధికారులు
అమలా పాల్ ఈ విషయాన్ని బయటకు వెల్లడించడంతో ప్రస్తుతం కేరళలో హాట్ టాపిక్ అయ్యింది. ఈ ఘటనపై మహాదేవ ఆలయ ట్రస్ట్ అధికారులు సైతం స్పందించారు. అమలా పాల్ పట్ల తమకు ఎలాంటి వివక్ష లేదని చెప్పారు. కేవలం తాము ప్రొటాకాల్ పాటించినట్లు వివరణ ఇచ్చారు. అమలా పాల్ అభిమానులు మాత్రం ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెక్యులర్ దేశంలో మత పరమైన ఆంక్షలేంటని ప్రశ్నిస్తున్నారు. మరికొంత మంది మాత్రం ఆయా మతాల ప్రజల మనోభావాలను గౌరవించాలని సూచిస్తున్నారు.
View this post on Instagram
Read Also: పవన్‌తో నటించే అవకాశం వచ్చినా చేయను - ప్రియాంక అంత మాట అనేసిందేంటి?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)