News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ఎన్నికల ఫలితాలు 2023

Priyanka Jawalkar: పవన్‌తో నటించే అవకాశం వచ్చినా చేయను - ప్రియాంక అంత మాట అనేసిందేంటి?

తెలుగమ్మాయి ప్రియాంక జవాల్కర్‌ పవన్ కల్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆయనను ఓ అభిమానిగా ఇష్టపడుతాను తప్ప, కలిసి నటించనని వెల్లడించింది.

FOLLOW US: 
Share:

‘టాక్సీవాలా’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తెలుగు హీరోయిన్ ప్రియాంక జవాల్కర్. అనంతపురానికి చెందిన ఈ ముద్దుగుమ్మ తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. విజయ్ దేవరకొండతో నటించి మెప్పించింది. అందం, అభినయంతో ఆకట్టుకుంది. ‘టాక్సీవాలా’ తర్వాత పలు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ‘తిమ్మరసు’, ‘ఎస్‌.ఆర్‌.కల్యాణ మండపం’లో నటించింది. ఈ సినిమాలు ప్రేక్షకులను బాగానే అలరించాయి. కానీ, ప్రియాంక కెరీర్ కు మాత్రం అవి పెద్దగా కలిసి రాలేదు. ఆ తర్వాత అవకాశాలు కూడా రాలేదు. 

పవన్ కల్యాణ్ అంటే ఎంతో ఇష్టం!

తాజాగా ప్రియాంక పవన్ కల్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను పవర్ స్టార్ అభిమానని అయినా, ఆయనతో కలిసి నటించే అవకాశం వచ్చినా, చేయలేనని చెప్పింది. ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె, పవన్ కల్యాణ్ గురించి పలు విషయాలు వెల్లడించింది. ‘‘పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే నాకు ఎంతో ఇష్టం. ఆయన ప్రతి సినిమా చూస్తాను. ‘తమ్ముడు’ సినిమా ఎన్ని సార్లు చూశానో నాకే గుర్తులేదు. ‘ఖుషి’ మూవీ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమాలోని ప్రతి డైలాగ్ ఈజీగా చెప్పగలను. తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు ఎంతో మంది అభిమానులు ఉన్నా, పెద్ద స్టార్ గా కొనసాగుతున్నా, చాలా సింపుల్ గా కనిపిస్తారు. ఆయన ఎందుకు అంత ఆర్డినరీగా ఉంటారో అర్థం కాదు” అని చెప్పింది.  

పవన్ తో సినిమా చేయాలనే కోరిక లేదు, అవకాశం వచ్చినా చేయను!

పవన్ కల్యాణ్ తో కలిసి నటించే అవకాశాం వస్తే? ఏం చేస్తారు? అనే ప్రశ్నకు ప్రియాంక షాకింగ్ కామెంట్స్ చేసింది. ఓ అభిమానిగా ఆయన్ని ఇష్టపడుతాను తప్ప, ఆయనతో సినిమా చేయలేను అని చెప్పింది. “ఓ అభిమానిగా ఆయనను చూసి సంతోషపడతాను. అంతకు మించి ఏమీ కోరుకోవడం లేదు. ఆయనతో కలిసి సినిమా చేయాలనే ఆలోచన నాకు లేదు. ఒకవేళ ఆయన సినిమాలో ఛాన్స్ వచ్చినా, చేయను” అని చెప్పింది. ఆమె ఆన్సర్ తో యాంకర్ తో పాటు సినీ లవర్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు. పవన్ కల్యాణ్ తో సినిమాలు చేసేందుకు ప్రతి హీరోయిన్ ఎదురు చూస్తుంటుంది. కానీ, ఈ అమ్మాయేంటి చేయనంటుంది? అని అనుకుంటున్నారు.  

బాలయ్య సినిమాలో ఛాన్స్ దక్కించుకుందా?

ప్రస్తుతం ప్రియాంక బాలయ్య సినిమాలో అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా సెలెక్ట్ అయినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు మాత్రం బయటకు వెల్లడి కాలేదు.  

View this post on Instagram
 
A post shared by Priyanka Jawalkar (@jawalkar)

Read Also: మెగాస్టార్ మెసేజ్ చేసినా రిప్లై ఇవ్వని యాంకర్ సుమ, షాకింగ్ విషయాన్ని చెప్పిన చిరంజీవి!

Published at : 18 Jan 2023 09:03 AM (IST) Tags: Priyanka Jawalkar power star Pawan Kalyan Movie chance

ఇవి కూడా చూడండి

Meenakshi Chaudhary: మీనాక్షీ చౌదరి, ఊర్వశి రౌటేలా - బాలకృష్ణతో గ్లామర్ గాళ్స్ ఇద్దరూ...    

Meenakshi Chaudhary: మీనాక్షీ చౌదరి, ఊర్వశి రౌటేలా - బాలకృష్ణతో గ్లామర్ గాళ్స్ ఇద్దరూ...    

Gruhalakshmi December 6th Episode: ‘గృహలక్ష్మీ’ సీరియల్‌: తాగొచ్చిన నందగోపాల్‌కు శిక్ష వేయాలన్న బసవయ్య - విక్రమ్‌ను అడ్డుకున్న రాజ్యలక్ష్మీ

Gruhalakshmi December 6th Episode: ‘గృహలక్ష్మీ’ సీరియల్‌: తాగొచ్చిన నందగోపాల్‌కు శిక్ష వేయాలన్న బసవయ్య - విక్రమ్‌ను అడ్డుకున్న రాజ్యలక్ష్మీ

Venu Swamy: వరుణ్ తేజ్, లావణ్య కలిసుండే అవకాశాల్లేవ్ - వాళ్ళిద్దరి జాతకాలపై వేణు స్వామి సంచనల వ్యాఖ్యలు

Venu Swamy: వరుణ్ తేజ్, లావణ్య కలిసుండే అవకాశాల్లేవ్ - వాళ్ళిద్దరి జాతకాలపై వేణు స్వామి సంచనల వ్యాఖ్యలు

Guppedantha Manasu December 6th Episode: రిషి పెద్ద టిస్ట్ ఇవ్వబోతున్నాడా - అనుపమ కథను ఎలాంటి మలుపు తిప్పబోతోంది!

Guppedantha Manasu December 6th Episode: రిషి పెద్ద టిస్ట్ ఇవ్వబోతున్నాడా - అనుపమ కథను ఎలాంటి మలుపు తిప్పబోతోంది!

Bigg Boss 7 Telugu: శోభాకు సపోర్ట్ చేస్తూ హౌజ్‌మేట్స్ నిర్ణయం - మద్దతు ఇచ్చినవారిపైనే మోనిత అరుపులు!

Bigg Boss 7 Telugu: శోభాకు సపోర్ట్ చేస్తూ హౌజ్‌మేట్స్ నిర్ణయం - మద్దతు ఇచ్చినవారిపైనే మోనిత అరుపులు!

టాప్ స్టోరీస్

Michaung Cyclone Effect In AP: మిగ్‌జాం తుపాను ధాటికి ఏపీ కకావికలం- బోరుమంటున్న రైతులు

Michaung Cyclone Effect In AP: మిగ్‌జాం తుపాను ధాటికి ఏపీ కకావికలం- బోరుమంటున్న రైతులు

Telangana CM Revanth Reddy: సీఎం అయ్యాక రేవంత్ రెడ్డి తొలి ట్వీట్ చూశారా! వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు

Telangana CM Revanth Reddy: సీఎం అయ్యాక రేవంత్ రెడ్డి తొలి ట్వీట్ చూశారా! వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు

Telangana New CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి..కార్యకర్తల సంబరాలు | ABP Desam

Telangana New CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి..కార్యకర్తల సంబరాలు | ABP Desam

నేను అమ్ముడుపోయానా..? రేవంత్ రెడ్డి ఎమోషనల్...!

నేను అమ్ముడుపోయానా..? రేవంత్ రెడ్డి ఎమోషనల్...!
×