అన్వేషించండి

Varun Tej: వరుణ్ తేజ్ ‘వీటీ13’ నుంచి క్రేజీ అప్డేట్ - కొత్త లుక్ అదుర్స్

వరుణ్ తేజ్ తాజాగా నటిస్తోన్న సినిమా ‘వీటి 13’. ఈ సినిమాకు శక్తి ప్రతాప్ హదా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను ప్రారంభించి చాలా రోజులు అవుతోంది.

Varun Tej: టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతున్నారు ఈ కుర్ర హీరో. 2014 లో ‘ముకుంద’ సినిమాతో హీరో గా ఎంట్రీ ఇచ్చిన వరుణ్ మొదటి సినిమాతోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తర్వాత ‘కంచె’, ‘ఫిదా’, ‘తొలిప్రేమ’, ‘ఎఫ్ 2’, ‘గద్దలకొండ గణేష్’, ‘ఎఫ్ 3’ లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి ఎంతో మంది అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు వరుస యాక్షన్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయారు. ఓ వైపు ‘గాండీవధారి అర్జున’ సినిమాలో నటిస్తూనే మరో క్రేజీ ప్రాజెక్టును పట్టాలెక్కించారు. ‘వీటీ 13’మూవీ చిత్రీకరణ పనులు జరుగుతున్నాయి. ఇందులో ఆయన ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. తాజాగా ఆ సినిమాకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఒకటి వచ్చింది. దీంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. 

వరుణ్ తేజ్ తాజాగా నటిస్తోన్నVT13కు శక్తి ప్రతాప్ హదా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను ప్రారంభించి చాలా రోజులు అవుతోంది. మూవీ నుంచి కూడా ఇటీవలే కొత్తగా ఏమీ అప్డేట్ లు రాలేదు. అయితే తాజాగా వరుణ్ తేజ్ ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ అప్డేట్ ను తీసుకొచ్చారు. గ్వాలియర్ లో షూటింగ్ షెడ్యూల్ పూర్తయినట్లు తెలిపారు. అంతేకాదు లొకేషన్ నుంచి ఓ ఫోటోను రిలీజ్ చేశారు. ఇందులో వరుణ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ లక్ లో స్టైలిష్ గా కనిపిస్తున్నారు. ఎదురుగా జెట్ విమానం కూడా కనిపిస్తోంది. దీంతో ఈ మూవీ షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలుస్తోంది. ఈ పోస్ట్ చూసి మెగా అభిమానులు మురిసిపోతూ కామెంట్లు చేస్తున్నారు. 

ఇక ఈ సినిమాకు సంబంధించి గతంలో పలు వివరాలను వరుణ్ వెల్లడించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో జరిగిన కొన్ని యధార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు చెప్పారు. పాన్ ఇండియా లెవల్ లో సినిమాను విడుదల చేయనున్నారని సమాచారం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్నారనే ప్రచారం కూడా ఉంది. దీంతో ఈ సినిమాపై ఇప్పటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ మూవీలో మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ హీరోయిన్ గా నటిస్తోంది. సోనీ పిక్చర్స్, రినైజాన్స్ పిక్చర్స్ నిర్మిస్తున్నాయి. ఈ సినిమాతో వరుణ్ బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వనున్నారు. 

ఈ సినిమాతో పాటు వరుణ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ‘గాండీవధారి అర్జున’ సినిమాలో కూడా నటిస్తున్నారు. ఈ సినిమా కూడా యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఈ మూవీను బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. వరుణ్ సరసన సాక్షి హీరోయిన్ గా నటిస్తుంది. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ‘గరుడ వేగ’ వంటి బ్లాక్ బస్టర్ మూవీతో పరిశ్రమను ఆకర్షించిన ప్రవీణ్ సత్తారు ఈ మూవీతో ఏ మేరకు ఆకట్టుకుంటారో చూడాలి. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Varun Tej Konidela (@varunkonidela7)

టాప్ హెడ్ లైన్స్

Spiderman Brand New Day India Collection: ఇండియాలో 'స్పైడర్ మ్యాన్' రికార్డులు... రిలీజుకు ముందు వంద కోట్ల క్లబ్బులో!
ఇండియాలో 'స్పైడర్ మ్యాన్' రికార్డులు... రిలీజుకు ముందు వంద కోట్ల క్లబ్బులో!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 30th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి కేసులో కీలక మలుపు! లక్ష్మీ బతికే ఉందా.. ఆధారాలు అవేనా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి కేసులో కీలక మలుపు! లక్ష్మీ బతికే ఉందా.. ఆధారాలు అవేనా!
Objection My Lord Series OTT : ఓటీటీలోకి శ్రీకాంత్ ఎంట్రీ - అబ్జెక్షన్ మై లార్డ్ సిరీస్ స్ట్రీమింగ్... స్పెషల్ ఏంటో తెలుసా?
ఓటీటీలోకి శ్రీకాంత్ ఎంట్రీ - అబ్జెక్షన్ మై లార్డ్ సిరీస్ స్ట్రీమింగ్... స్పెషల్ ఏంటో తెలుసా?
Venky Atluri: దీపికా పదుకోన్‌కు వెంకీ అట్లూరి కౌంటర్... స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా చెక్ పెట్టాడుగా
దీపికా పదుకోన్‌కు వెంకీ అట్లూరి కౌంటర్... స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా చెక్ పెట్టాడుగా

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR ACB Court: నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
CCS Meeting News: ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
Tamilnadu Politics: డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Venky Atluri: దీపికా పదుకోన్‌కు వెంకీ అట్లూరి కౌంటర్... స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా చెక్ పెట్టాడుగా
దీపికా పదుకోన్‌కు వెంకీ అట్లూరి కౌంటర్... స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా చెక్ పెట్టాడుగా
Supreme Court Big Relief Telangana: తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
Warangal Viral News: వరంగల్, ఖమ్మం జాతీయ రహదారి పై బోల్తా పడ్డ ఆపిల్ పండ్ల వ్యాన్- సంచులతో ఎగబడ్డ జనం!
వరంగల్, ఖమ్మం జాతీయ రహదారి పై బోల్తా పడ్డ ఆపిల్ పండ్ల వ్యాన్- సంచులతో ఎగబడ్డ జనం!
Embed widget