By: ABP Desam | Updated at : 30 Jan 2023 06:45 PM (IST)
Edited By: Mani kumar
Image Credit: Sundeep Kishan/YouTube
టాలీవుడ్ యంగ్ హీరోల్లో సందీప్ కిషన్ ఒకడు. 2010లో వచ్చిన ‘ప్రస్థానం’, ‘స్నేహ గీతం’ సినిమాలతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన సందీప్ అనాతి కాలంలోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సందీప్ తాజాగా ‘మైఖేల్’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ కు రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ లో బిజీ బిజీ గా ఉంది. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా హీరో సందీప్ కిషన్ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా సినిమా గురించి ముచ్చటించాడు. అయితే ఇంటర్వ్యూ లో భాగంగా సందీప్ కిషన్ తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దీంతో ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
ఇంటర్య్వూ లో యాంకర్ అడిగిన ప్రశ్నలకు సందీప్ సమాధానాలు చెప్పాడు. ఈ నేపథ్యంలో ఇటీవల తమిళంలో సూపర్ హిట్ అయిన ‘విక్రమ్’ సినిమాలో మీరు కూడా చేయాల్సిందట కదా అని యాంకర్ అడిగితే.. దానికి ఆయన సమాధానం చెప్తూ మొదట్లో లోకేష్ తనను ఈ సినిమాలో ఓ క్యారెక్టర్ చేయాలని అడిగాడని, తాను కూడా చేస్తాను అని చెప్పానని, అయితే తర్వాత ఇద్దరం మాట్లాడుకొని ఆగిపోయామని అందుకే ఆ సినిమాలో తాను నటించలేదని చెప్పుకొచ్చాడు. మరి లోకేష్ ప్రపంచంలోకి మీరెప్పుడు వస్తారని అడిగితే.. లోకేష్ ప్రపంచం మొదలైందే నా సినిమాతోనే కదా అని బదులిచ్చాడు. ఇప్పుడు లోకేష్ పెద్ద డైరెక్టర్ అయినా తనకు మొదటి నుంచీ క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి తమ మధ్యలో అలాంటి గ్యాప్ ఏమీ లేదన్నాడు. ఒకవేళ లోకేష్ తనకు ముందు నుంచీ ఫ్రెండ్ కాకపోయుంటే ఆ ఫీలింగ్ ఉండేదేమో అని అన్నాడు. అయినా ఏదైనా ఉంటే తప్పకుండా చేస్తామని అన్నాడు.
ప్రస్తుతం సందీప్ కిషన్ మంచి ఫామ్ లో ఉన్నాడు. వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. కేవలం ఒక్క తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ్ భాషల్లోనూ సినిమాలు చేస్తూ బిజీ గా ఉంటున్నాడు. అలాగే ప్రయోగాలకు సందీప్ ఎప్పుడూ ముందుంటాడు. ఈ నేపథ్యంలోనే ‘మైఖేల్’ మూవీలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాను మాత్రం పాన్ ఇండియా సినిమాగా విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో సందీప్ తో పాటు తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కూడా నటిస్తున్నాడు. తమిళ్ లో విజయ్ కు మంచి మార్కెట్ ఉంది. విజయ్ కాంబో లో సినిమా కావడంతో ఈ మూవీ పై మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా త్వరలో జరగనుంది. మరి ఈ సినిమాతో అయినా సందీప్ కు ఒక హిట్ అందుతుందేమో చూడాలి. ఇక ఈ మూవీలో గౌతమ్ వాసుదేవ్ మీనన్, అనసూయ భరద్వాజ్, వరుణ్ సందేశ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూవీను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP కరణ్ సి ప్రొడక్షన్స్ LLP సంయుక్తం గా నిర్మిస్తోంది. ఈ చిత్రానికి సామ్ సిఎస్ సంగీత దర్శకుడు గా వ్యవహరిస్తున్నాడు.
IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!
Robert Downey Jr: ఆ హీరో నమిలేసిన చూయింగ్ గమ్ రూ. 45 లక్షలా? ఏం చేసుకుంటారు నాయనా?
Balagam Censored Dialogue: సెన్సార్‌కు ముందు, సెన్సార్ తర్వాత - ‘బలగం’లోని ఆ డైలాగ్ లీక్ చేసిన ప్రియదర్శి
Naga Chaitanya : చైతూను కావాలని టార్గెట్ చేశారా? డివోర్స్, డేటింగ్ రూమర్స్ - ప్లాన్ ప్రకారమే ప్రతిదీ తెరపైకి?
Shaakuntalam: ‘శాకుంతలం’ నుంచి ‘మల్లిక’ వీడియో సాంగ్ రిలీజ్ - అందంతో కట్టిపడేస్తోన్న సమంత
Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ
AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!
Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి
Nellore Spa: నెల్లూరులో ఆల్ ఇన్ వన్ మసాజ్, స్పెషల్ సర్వీస్ అంటూ వల! 15 మంది అరెస్ట్