Sameer On Balakrishna: బస్ డోర్ తీసి జనాల్లోకి తోసేశారు - బాలయ్య చేసిన పనికి సమీర్ షాక్!
బాలయ్యతో జరిగిన షాకింగ్ ఇన్సిడెంట్ గురించి నటుడు సమీర్ తాజాగా బయట పెట్టారు. ఆ రోజు ఆయన చేసిన పనికి భయపడినట్లు చెప్పారు. తాజాగా ‘సుమ అడ్డా’ షోకు గెస్టుగా వచ్చిన సమీర్, ఈ విషయాన్ని వెల్లడించారు.
సమీర్.. టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటు మెగా హీరోలతో, అటు నందమూరి యాక్టర్స్ తో చాలా క్లోజ్ గా ఉంటారు. చిరంజీవి, బాలకృష్ణతో కలిసి పలు సినిమాల్లో నటించి మెప్పించారు. ఇద్దరు అగ్ర హీరోలతోనూ ఆయన చాలా సాన్నిహిత్యంగా ఉంటారు. తాజాగా బాలయ్య గురించి సమీర్ ఓ షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. ఓసారి తనను డోర్ తీసి జనాల్లోకి తోసేసిన ఘటన గురించి గుర్తు చేసుకున్నారు. ‘లెజెండ్’ విజయ యాత్రలో ఈ ఘటన జరగగా, తాజాగా ‘సుమ అడ్డా’ షోకు గెస్టుగా వచ్చిన ఆయన దీని గురించి వివరించారు. తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమో విడుదలైంది.ఈ షోలో సమీర్ తో పాటు సీనియర్ నటులు గిరిధర్, హేమ పాల్గొన్నారు.
డోర్ తీసి జనాల్లోకి తోసేశారు- సమీర్
ఈ షోలో సుమ సమీర్ ను ఓ ప్రశ్న అడిగింది. ఓ సినిమా ప్రమోషన్ ఈవెంట్లో బాలయ్య గారితో ఓ సంఘటన జరిగిందట కదా? అదేంటో చెప్పాలని కోరింది. అప్పుడు ఆ రోజు ఏం జరిగిందో సమీర్ వివరించారు. “అంత దూరంలో థియేటర్ ఉంది. గేట్‌కు మేమున్న బస్‌కు చాలా దూరం ఉంది. బాబు మనం అక్కడికి ఎలా వెళ్తామని అడిగాను. చూస్తావా? ఎలా వెళ్తానో అని అంటూ, డోర్ తీసేసి నన్ను తోసేశాడు” అంటూ ఆ రోజు జరిగిన విషయాన్ని వివరించారు.
Read Also; ‘బాహుబలి2’ రికార్డును ‘పఠాన్’ బద్దలుకొట్టేనా? తాజా పరిణామాలు ఏం చెప్తున్నాయంటే?
షో అంతా సుమ పంచులే పంచులు!
ఇక ఈ ప్రోమోలో సుమ పంచుల మీద పంచులు వేసింది. హేమ డామినేషన్ కు గిరిధర్ భయంతో వణికిపోయారు. తాను అందంగా లేనని ఆడియెన్స్ అంటే వారిపైకీ దూసుకెళ్లింది హేమ. మీ గ్లామర్ మెయింటైన్ చెయ్యడానికి మీరు ఏం చేస్తుంటారని సమీర్ ను అడగగా సుమ షోలు చూస్తుంటానని చెప్పారు. మీరేం చేస్తుంటారు గ్లామర్ మెయింటైన్ చెయ్యడానికి అని హేమను అడగగా హేమ ఆడియన్స్ తో మీరే చెప్పాలి? హేమక్క అందంగా లేదా? అంటూ కామెంట్ చేశారు. ఓ అబ్బాయి మాత్రం చేతులు ఊపుతూ అందంగా లేదని అర్థం వచ్చేలా సైగ చేశాడు. ఎవడ్రా ఇక్కడ చెయ్యెత్తి ఇలా ఇలా అన్నాడు అంటూ హేమ బెదిరించే ప్రయత్నం చేసింది. గ్లామర్ మెయింటైన్ చెయ్యడానికి మీరేం చేస్తారని సుమ గిరిధర్ ను అడగగా ఇప్పుడే చికెన్ ఫ్రైడ్ రైస్ తిన్నానంటూ ఫన్నీ కామెంట్స్ చేశారు. ఇక ‘అన్నయ్య’ మూవీలో మాదిరిగా చిరంజీవిని అనుకరించేందుకు సమీర్ ప్రయత్నించగా, ఎందుకు మీరు నాగార్జునలా యాక్ట్ చేస్తున్నారంటూ సుమ సమీర్ పై పంచ్ విసిరింది. దీంతో షోలోని వాళ్లంతా నవ్వుల్లో మునిగిపోయారు.ఈ నెల 4న ఈ ఎపిసోడ్ టీవీలో ప్రసారం కానుంది.
Read Also: ఆ దేశంలో హాలీవుడ్ మూవీస్ చూస్తే జైల్లో పెడతారు - తల్లిదండ్రులకూ శిక్ష తప్పదు!