By: ABP Desam | Updated at : 01 Mar 2023 01:16 PM (IST)
Edited By: anjibabuchittimalla
Photo@Pixabay
ప్రపంచ దేశాలు ఆధునిక పోకడల వైపు శరవేగంగా దూసుకెళ్తున్నాయి. టెక్నాలజీతో పాటు అన్ని రంగాల్లోనూ గణనీయమైన అభివృద్ధి సాధిస్తున్నాయి. కానీ, కొన్ని దేశాలు ఇంకా మూస ధోరణిలోనే బతుకీడుస్తున్నాయి. తమ దేశ ప్రజలపై రకరకాల ఆంక్షలు విధిస్తూ ఆటవిక రాజ్యాన్ని కొనసాగిస్తున్నాయి. అలాంటి దేశాల్లో ఒకటి ఉత్తర కొరియా. అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తీసుకునే నిర్ణయాలు అత్యంత దారుణంగా ఉంటాయి. ఆయన అమలు చేసే విధానాలు అత్యంత ఘోరంగా ఉంటాయి.
తాజాగా మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది నార్త్ కొరియా ప్రభుత్వం. పాశ్చాత్య మీడియా కంటెంట్‌ను అరికట్టడానికి కఠిన చర్యలు అమలు చేస్తోంది. దేశంలో హాలీవుడ్ లేదంటే విదేశీ చిత్రాలను చూస్తూ పట్టుబడితే పిల్లలు, వారి తల్లిదండ్రులను జైలులో పెట్టాలని నిర్ణయించింది. హాలీవుడ్ సినిమాలు చూస్తూ పట్టుబడిన పిల్లల తల్లిదండ్రులను ఆరు నెలల పాటు లేబర్ క్యాంపులకు పంపిస్తామని వెల్లడించింది. పిల్లలు ఐదేళ్ల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని రేడియో ఫ్రీ ఆసియా తాజాగా నివేదించింది.
గత ఏడాది ప్రారంభంలో దక్షిణ కొరియా సినిమాలను చూసినందుకు గాను ఇద్దరు మైనర్లకు నార్త్ కొరియా ప్రభుత్వం మరణశిక్ష విధించింది. K-పాప్ వీడియోలను చూడటంతో పాటు పంపిణీ చేసినందుకు గాను గత దశాబ్దంలో కనీసం ఏడుగురికి మరణశిక్ష విధిస్తున్నట్లు మానవ హక్కుల సంఘం వెల్లడించింది. "దక్షిణ కొరియా సినిమాలు, నాటకాలను చూసి, పంపిణీ చేసి సామాజిక వ్యవస్థకు భంగం కలిగించే వారిని క్షమించే అవకాశమే లేదు. సదరు వ్యక్తులు గరిష్టంగా మరణ శిక్షకు గురవుతారు” అని ఆ దేశ ప్రభుత్వం హెచ్చరించింది.
ఉత్తర కొరియాలో పోర్న్ చూస్తే అంతే సంగతులు. తెలిసి చూసినా, తెలియక చూసినా ప్రాణాలు వదులుకోవాల్సిందే. అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ గత నెలలో అడల్ట్ వీడియోలను చూసే వారిని షూట్ చేయమని స్పెషల్ టీమ్ కు ఆదేశాలు జారీ చేశాడు. 'గ్రుప్ప' లేదంటే 'సోషలిస్టు గ్రూపులు' అని పిలువబడే ఈ టీమ్ కు పోర్న్ చూసే వారిని కాల్చివేసే బాధ్యతను అప్పగించినట్లు తెలుస్తోంది. అంతేకాదు, కమ్యూనిస్ట్ పార్టీ అధికారిక సిద్ధాంతం నుంచి ప్రజలు వైదొలగకుండా చూసుకునే బాధ్యత వారికి అప్పగించినట్లు తెలుస్తోంది.
ఉత్తర కొరియాలో కిమ్ జోంగ్ ఉన్ ప్రభుత్వ అణచివేతను, నిరంకుశత్వం మాటల్లో చెప్పలేనిది. అధ్యక్షుడు విధించే శిక్షలు, ఆంక్షలు అక్కడి జనాలను భరించలేని స్థితికి తీసుకొచ్చాయి. అక్కడి పౌరుల హేర్ కట్ నుంచి తినే తిండి వరకు అన్నీ ఆయన చెప్పినట్లే చేయాలి. లేదంటే ప్రాణాల మీద ఆశ కోల్పోవాల్సిందే. దుర్మార్గపు పాలన భరించలేక చాలామంది ఆ దేశం విడిచి పారిపోయే ప్రయత్నం చేస్తున్నారు. అలా చేసే ప్రయత్నంలో ఎంతో మంది ఆ దేశ పౌరులు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలున్నాయి.
Read Also: పిలకతో ఉన్న ఈ హీరో ఎవరో గుర్తుపట్టగలరా?
Priyanka Nalkari Wedding: గుడిలో రహస్య వివాహం చేసుకున్న ప్రియాంక నల్కారి, వరుడు ఎవరో తెలుసా?
ఆ సామాన్యుల చేతిలో ఆస్కార్ - పట్టరాని ఆనందంలో ‘ఎలిఫ్యాంట్ విష్పర్స్’ జంట
అలా చేయనన్నానని హీరోయిన్ పాత్ర నుంచి తొలగించారు: నటి సన
Mohan Babu on Manoj: కుక్కలు మొరుగుతూనే ఉంటాయి పట్టించుకోను - మనోజ్ రెండో పెళ్లిపై మోహన్ బాబు రియాక్షన్
Ravi Teja Brother Raghu Son : యూత్‌ఫుల్ సినిమాతో హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు
TSPSC Exams : రాజకీయంలో చిక్కుకుపోతున్న టీఎస్‌పీఎస్సీ - మళ్లీ పరీక్షలు ఎప్పుడు ?
Sajjala On Mlc Results : టీడీపీకి ఓటు వేసిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలెవరో తెలుసు, డబ్బులు ఆశచూపి ప్రలోభపెట్టారు- సజ్జల
పేపర్ లీక్ పై తప్పుడు ఆరోపణలు - బండి సంజయ్, రేవంత్ రెడ్డికి కేటీఆర్ లీగల్ నోటీసులు
CM Jagan On Polavaram : పోలవరం ప్రాజెక్టును 45.7 మీటర్ల ఎత్తు వరకు నిర్మిస్తాం, అసెంబ్లీలో సీఎం జగన్ క్లారిటీ