Posani Krishna Murali: అదే నా బలం - అందువల్లే ముప్పై ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా: పోసాని కృష్ణమురళి
Posani Krishna Murali: ఒక రైటర్ గా వంద సినిమాల వరకూ కథలు రాసినట్లు పోసాని కృష్ణమురళి తెలిపారు. తాను కేవలం కథను నమ్ముకుని గత ముప్పై ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నానని చెప్పారు.
తిరుపతి : మామూలు తాను జెంటిల్మన్ అని, ఎవరైనా చెడుగా మాట్లాడితే డాబర్ మ్యాన్ గా మారిపోతానని సినీ నటుడు పోసాని కృష్ణమురళి అన్నారు. తిరుపతిలో నూతనంగా నిర్మించిన మెడిగో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను పోసాని కృష్ణమురళి పరిశీలించారు. ఆసుపత్రిలో రోగుల కోసం ఏర్పాటు చేసిన వసతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తన చిన్ననాటి మిత్రుడు రవి ఆహ్వానం మేరకు తిరుపతి వచ్చానని తెలిపారు. తన మిత్రుడు నూతనంగా నిర్మించిన మెడిగో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను చూసేందుకు వచ్చి, చాలా కాలం తరువాత అతడ్ని కలిశానని... సినీ ఇండస్ట్రీలో తనకు మిత్రులు ఎవరూ లేరని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కాలేజీ రోజుల్లో ఏం చేశామంటే.. పోసాని
కాలేజీ రోజుల్లో తాను చాలా క్లాసులు ఎగ్గొట్టే వాడినని పోసాని గుర్తు చేసుకున్నారు. తన మిత్రుడు రవి సహకారంతోనే ఎంఫిల్ పాస్ అయినట్లు ఆయన తెలిపారు. ‘నా మంచి కోరే మిత్రుడుగా రవి మిగిలిపోతాడు. బతికున్నంత కాలం నా మిత్రుడిని గుర్తుంచుకుంటాను. 'వాడెవ్వడు వీడెవ్వడు మన ప్రేమకు అడ్డు ఎవడూ' అనే నూతన సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు’ పోసాని వెల్లడించారు.
పెద్ద హీరోలతో సినిమా చేస్తారా.. !
ఒక రైటర్ గా వంద సినిమాలు వరకూ కథలు రాసినట్లు తెలిపారు. తాను కేవలం కథను నమ్ముకుని గత ముప్పై ఏళ్లుగా ఇండస్ట్రీలో ఒక ఎంప్లాయిగా ఉన్నానని చెప్పారు. మంచి కథలు రాసుకుంటే ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికి నిలిచి పోతామని, తనకు తెలిసి కథే హీరోలా ఉండాలని అభిప్రాయపడ్డారు. పెద్ద హీరోలను డైరెక్షన్ చేసే ఆలోచన తనకు ఇప్పుడు లేదన్నారు.
తనకు నచ్చితేనే ఎవరితోనైనా సినిమా తీస్తానని, పరిశ్రమ వల్ల, ప్రేక్షకుల వల్ల తాను, తన కుటుంబం బాగుందన్నారు. సినిమా ఇండస్ట్రీలో తనకు మిత్రులు ఎవరూ లేరని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీకి ఉపయోగపడే వారిని నేను ఎప్పటికీ గౌరవిస్తానని, ఇండస్ట్రీలో ఎవరికి వారే పెద్దవారని చెప్పారు. ఎవరు పెద్ద, ఎవరు చిన్న అని తనకు అలాంటి పట్టింపులు లేవని పోసాని కృష్ణ మురళీ పేర్కొన్నారు.
Also Read: బాలీవుడ్‌లో విషాదం - 24 ఏళ్లకు 'గల్లీ బాయ్' ర్యాపర్ ఎంసీ తోడ్ ఫోడ్ మృతి, రణ్‌వీర్ సింగ్ భావోద్వేగం
Also Read: కోడి కత్తి వాడిన రాజమౌళి, ఖైదీ సీఎం - నాగబాబు వెటకారం! వైఎస్ వివేకాది సహజ మరణమా?